ముందుగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నెటిజన్లకు పరిచయమయ్యింది దీప్తి సునయన.

ఆ తర్వాత బిగ్ బాస్‌లో అవకాశం రావడంతో తను ఎవరో ఎక్కువమంది ప్రేక్షకులకు తెలిసింది.

వెండితెరపై ఎక్కువగా ఫోకస్ చేయకుండానే యూట్యూబ్‌లో ఆల్బమ్ సాంగ్స్‌తో సెటిల్ అయిపోయింది దీప్తి.

సోషల్ మీడియాలో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేసుకుంటూ యాక్టివ్‌గా ఉంటుంది.

దీప్తి సునయన కొత్త కారు కొన్న విషయాన్ని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌తో పంచుకుంది.

తాజాగా తన కొత్త కారుకు పూజ చేయించిన ఫోటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది.

‘వేల ఆనందాలు సంచుల్లో నింపుకుందాం’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.

All Images Credit: Deepthi Sunaina/Instagram