‘బిగ్ బాస్’ ప్రియాంక జైన్ ఇంట్లో దొంగ - అన్నీ తీసుకుపోవాలట!

‘బిగ్ బాస్’ ప్రియాంక జైన్ సోషల్ మీడియాలో భలే యాక్టీవ్‌గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను ఫాలో అవుతూ రీల్స్ చేస్తూ ఉంటుంది.

ప్రస్తుతం ప్రియాంక చేతిలో సీరియల్స్ ఏమీ లేవు. సోషల్ మీడియా మీదే ఆధారపడింది.

ఇటీవల తన ప్రియుడు శివ్ కారు డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతున్న రీల్ ఒకటి పోస్ట్ చేసింది.

అంతకు ముందు.. శివ్ మీదకు ఎక్కి గుర్రపు స్వారీ చేస్తున్న రీల్ కూడా వైరల్ అయ్యింది.

తాజాగా ప్రియాంక తన ఇంటికి దొంగోడు వచ్చాడంటూ రీల్ చేసింది.

అదేంటీ, దొంగోడు వస్తే రీల్ ఏమిటీ.. పోలీస్‌లను పిలవాలి కదా అని అనుకుంటున్నారా?

Image Source: Priyanka Jain/Instagram

అదేనండి, ఇటీవల ట్రెండ్ అవుతోన్న ‘కల్ రాత్ మేరే గర్ ఏక్ చోర్ ఆయా’ సాంగ్‌నే రీల్ చేసింది.

Image Source: Priyanka Jain/Instagram

బ్లాక్ శారీలో.. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రియాంక చేసిన ఈ రీల్ భలే వైరల్ అవుతోంది.