బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ట్రోఫీ అందుకున్నాడు. అమర్ దీప్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఒట్టి చేతులతో ఇంటికెళ్లాడు. విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు రూ.35 లక్షల ప్రైజ్ మనీ లభించింది. యావర్ రూ.15 లక్షల బ్రీఫ్ కేసుతో బయటకు వెళ్లడం వల్ల ప్రశాంత్ ప్రైజ్ మనీకి కోత పడింది. పల్లవి ప్రశాంత్‌కు ఇంకా మారుతీ సుజుకీ బ్రెజ్జా కారు బహుమతిగా లభించింది. ఆ కారు విలువ సుమారు 10 లక్షల (మోడల్ బట్టి ధరలో రూ.లక్ష, రూ.2 లక్షలు తేడా ఉండొచ్చు) అలాగే జోస్ అలుకాస్ నుంచి మరో రూ.15 లక్షల చెక్ లభించింది. ఆ మొత్తంతో గోల్డ్ మాత్రమే కొనాలి. Images Credit: Star Maa