Akshay Kumar: రూ.500 అద్దెతో ఆ ఇంట్లో ఉండేవాడిని, దాన్ని కొనడానికి కారణం ఇదే: అక్షయ్ కుమార్
Akshay Kumar: అక్షయ్ కుమార్ సింప్లిసిటీకి మారుపేరు. ఎంత పేరు వచ్చినా తన మూలాలు మాత్రం మర్చిపోను అంటున్నారు. 500 రూపాయలు అద్దె కట్టి ఉన్న ఇంటిని ఇప్పుడు కొనుక్కుంటున్నారట ఈ బాలీవుడ్ హీరో.
Akshay Kumar To Buy His Old Flat Where He Used To Give Rs 500 Rent: అక్షయ్ కుమార్ సింప్లిసిటీకి మారుపేరు. ఎంత స్టార్ డమ్ వచ్చినా, సెలబ్రిటీ స్టేటస్ వచ్చినా సింపుల్ గా కనిపిస్తారు ఆయన. ఎంతోకష్టపడి ఈ స్టేజ్ కి వచ్చిన హీరోల్లో ఆయన ఒకరు. అయితే, ఒక ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అక్షయ్ కుమార్. ముంబైలో రూ.500 కి రెంట్ కట్టి ఉండేవాళ్లం అని ఆ రోజులు భలే బాగుంటాయని అన్నారు అక్షయ్. అందుకే, ఆ ఇంటిని తాను కొనుక్కుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అక్షయ్ కుమార్ ముంబైలోని డాన్ బాస్కో స్కూల్ లో విద్యను అభ్యసించారు. ఈ మేరకు డాన్ బాస్కో స్కూల్ కి ఎప్పుడైనా వెళ్తారా? అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. స్కూల్ కి, తమ ఫ్యామిలీ రెంట్ కి ఉన్న ఇంటికి వెళ్తుంటానని, ఆ ప్రదేశాలు తనకు చాలా ఇష్టం అని అన్నారు అక్షయ్.
రూ.500 రెంట్ కట్టేవాళ్లం.., ఇప్పుడు దాన్నే కొంటున్నాను..
తను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం ఒక అపార్ట్ మెంట్ లో ఉండేవాళ్లం అని, తరచూ ఆ ఇంటికి వెళ్లి వస్తుంటానని చెప్పారు అక్షయ్ కుమార్. "ఎప్పుడు ఆ ఇంటికి వెళ్లినా చాలా ఆనందంగా అనిపిస్తుంది. దాని వెనుక ఉన్న సైకాలజీ ఎంటో తెలియదు కానీ.. అదో హ్యాపీ మూమెంట్. మేం ఆ ఇంటికి రూ.500 రెంట్ కట్టేవాళ్లం. ఫ్యామిలీ అంతా దాంట్లోనే ఉండేవాళ్లం. ఇప్పుడు ఆ ఇంటిని రెనోవేట్ చేస్తున్నారు. అది డబుల్ బెడ్ రూమ్ ఇల్లు. ఆ అపార్ట్ మెంట్ లోని మూడో ఫ్లోర్ కొనుక్కుంటాను అని వాళ్లకు చెప్పాను" అని అన్నారు అక్షయ్ కుమార్.
ఎన్నో జ్ఞాపకాలు ఆ ఇంట్లో..
"ఆ ఇంటితో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నిజానికి ఇప్పుడు అక్కడ మాకు ఎవ్వరూ లేరు. కానీ, ఫ్లాట్ అలా ఉంచాలి అనుకున్నాను. మా నాన్నది 9 - 6 జాబ్.. ఆయన ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని నేను మా అక్క ఎదురుచూస్తూ ఉండేవాళ్లం. ఇంటికి ఎదురుగా జామ చెట్టు ఉండేది ఆ కాయలు తెంపుకుని తినేవాళ్లం. ఇప్పటికీ ప్రతి నెల అక్కడికి వెళ్లి పండ్లు, పూలు తెంపుకుంటాను. అలా అన్ని గుర్తు చేసుకుంటాను. నేను ఎక్కడ నుంచి వచ్చాను అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలని అనుకుంటాను. ఆ విషయాలను మాత్రం మర్చిపోను" అని చిన్ననాటి విషయాలు పంచుకున్నారు అక్షయ్ కుమార్.
ఇక సినిమాల విషయానికొస్తే.. 'బడే మియాన్ చోటే మియాన్' సినిమాలో టైగర్ షాఫ్ర, మానుషి చిల్లర్, పృథ్వీ రాజ్ సుకుమారన్ తో కలిసి నటించారు అక్షయ్. ఇక ప్రస్తుతం ఆయన 'హౌస్ ఫుల్ 5', 'హీరా పేరి - 3' , 'వెల్కమ్ - 3' సినిమాలతో బిజీగా ఉన్నారు.
Also Read: ‘మిర్జాపూర్ - 3’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - అంత మాట అనేశావేంటి మున్నాభాయ్?