అన్వేషించండి

Actor Divyenndu: ‘మిర్జాపూర్ - 3’ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - అంత మాట అనేశావేంటి మున్నాభాయ్?

Actor Divyenndu : మిర్జాపూర్.. ఇప్ప‌టికే 1, 2 పార్ట్ లు ప్రేక్ష‌కులను ఎంత‌గానో అల‌రించాయి. ఈ సిరిస్ కి స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మీర్జాపూర్ - 3 కి సంబంధించి ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్.

Actor Divyenndu will not return as Munna Bhaiya in the third season: 'మిర్జాపూర్'.. వెబ్ సిరీస్ ల‌లో ఈ సిరీస్ కి విప‌రీత‌మైన హైప్ క్రియేట్ అయ్యింది. కొన్ని బోల్డ్ సీన్లు, బోల్డ్ డైలాగ్స్ ఉన్న‌ప్ప‌టికీ చాలామంది ఈ సిరీస్ ని ఆద‌రించారు. చూసేందుకు ఇంట్రెస్ట్ పెట్టారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ లలో 'మీర్జాపూర్' ముందు వరుసలో ఉంటుంది. పొలిటికల్ గ్యాంగ్ స్టర్ డ్రామా సిరీస్ ఇది. ఇక ఇప్ప‌టికే రెండు సీజ‌న్లు రిలీజై హిట్ గా నిలిచాయి. మూడో సీజ‌న్ కోసం వెయిటింగ్. దానికి సంబంధించిన అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు చాలామంది. ఇక అందులోని క్యారెక్ట‌ర్ల కు అయితే బిభ‌త్స‌మే ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటిది ఇప్పుడు మున్నాభాయ్ (దివ్యేందు శ‌ర్మ) ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారు. 

బ్యాడ్ న్యూస్!

దివ్యేందు శర్మ... 'మీర్జాపూ'ర్ సిరీస్ లో ఆయ‌న మున్నాభాయ్ క్యారెక్ట‌ర్ చేశారు. ఆ క్యారెక్ట‌ర్‌కు విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. ఆయన చెప్పిన డైలాగులు తెగ వైర‌ల్ అయ్యాయి కూడా. అలాంటిది ఇప్పుడు మీర్జాపూర్ సీజ‌న్ - 3 లో మున్నాభాయ్ క‌నిపించ‌డట‌. హ్యూమ‌న్స్ ఆఫ్ ముంబై అనే ప్రోగ్రామ్ లో ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాలు చెప్పారు. “ నేను సీజ‌న్ - 3 న‌టించ‌డం లేదు. ఇది మీ అంద‌రికీ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని నాకు తెలుసు. నాకు కూడా ఆ త‌ర‌హా సిరీస్ ల‌ను ప్రేమిస్తాను. నేను ఈ సీజ‌న్‌లో ఉండ‌టం లేదు. నేను ఆ పాత్ర‌లో చేస్తున్న‌ప్పుడు అది నా వ్య‌క్తిత్వాన్ని చాలా ప్ర‌భావితం చేసింది. కొన్ని స‌మ‌యాల్లో నా చుట్టూ చీక‌టిగా అయిపోయేది. ఊపిరి ఆడ‌టం లేదు అనిపించేది. ఆ జోన్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక కానీ నాకు ఆ విష‌యం అర్థం కాలేదు” అని చెప్పారు దివ్యేందు శ‌ర్మ‌. 


ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని మీర్జాపూర్ అనే ప్రాంతం నేప‌థ్యంలో తీశారు ఈ వెబ్ సిరీస్. మొద‌టి సీజ‌న్ 2018లో అమెజాన్ లో ఈ సిరీస్ రిలీజ్ అయ్యింది. హిందీలో రిలీజైన వెబ్ సిరీస్ కి మంచి ఆద‌ర‌ణ రావ‌డంతో మిగ‌తా భాష‌ల్లో కూడా రిలీజ్ చేశారు. అన్ని భాష‌ల్లో  'మీర్జాపూర్' సూపర్ హిట్ అయ్యింది. దీనికి కొనసాగింపుగా రెండో సీజన్ ను 2020 అక్టోబరు 23న రిలీజ్ చేశారు. రెండు సీజన్లు కూడా మంచి హిట్ సాధించడంతో మూడో సీజన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇందులో శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్రియ పిల్గోంగర్, హర్షిత గౌర్ తదితరులు నటించారు. ముఖ్యంగా ఇందులోని మున్నా భాయ్, గోడ్డు భాయ్, గోలు అఖండానంద్‌ పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. ఇక మూడో పార్ట్ కి సంబంధించి ఇటీవ‌లే ముంబైలో జ‌రిగిన ఒక ఈవెంట్ లో ప్ర‌క‌టించారు మేక‌ర్స్. అయితే, సీజన్-2లో మున్నాభాయ్‌ను గుడ్డు భాయ్, గోలు చంపేస్తారు.

Also Read: జనసేన పార్టీకి చిరంజీవి 'మెగా' విరాళం - 'విశ్వంభర' సెట్స్‌లో అన్నయ్యను కలిసిన తమ్ముడు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Embed widget