అన్వేషించండి

Agent Movie: ఓటీటీలోకి రాకుండానే నేరుగా టీవీ చానెల్‌లోకి అఖిల్ ‘ఏజెంట్’ - కానీ, చిన్న ట్విస్ట్

అక్కినేని అఖిల్ డిజాస్టర్ మూవీ ‘ఏజెంట్‘ టీవీలో టెలీకాస్ట్ అయ్యేందుకు రెడీ అవుతోంది. తెలుగులోకి కాకుండా హిందీ వెర్షన్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓటీటీలోకి రాకముందే టీవీలోకి రావడం విశేషం.

Agent TV Premiere Date Revealed: అక్కినేని యువ హీరో నిఖిల్ చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా సాలిడ్ హిట్ దక్కడం లేదు. ఇప్పటికే ఆయన పలు సినిమాల్లో నటించినా, అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. అఖిల్ ఇండస్ట్రీలో రాణించడం కష్టమేనని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

నేరుగా టీవీలోకి వచ్చేస్తున్న‘ఏజెంట్‘

స్పై యాక్షన్ ‘ఏజెంట్’ మూవీ గత ఏడాది ఏప్రిల్ 28న విడులైనా, ఇప్పటి వరకు ఓటీటీలోకి అడుగు పెట్టలేదు.  ఇప్పుడు టీవీలో టెలీకాస్ట్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. అయితే, తెలుగులో కాకుండా హిందీ వెర్షన్ మాత్రమే ప్రసారం కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలను గోల్డ్ మైన్స్ టీవీ చానెల్ వెల్లడించింది. ఈ నెల 28న రాత్రి 8 గంటలకు ‘ఏజెంట్’ హిందీ వెర్షన్ ను టెలికాస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు గోల్డ్ మైన్స్ చానెల్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసింది. ఓటీటీలోకి రాకముందే నేరుగా టీవీల్లోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించింది.

ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో?

‘ఏజెంట్’ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్ ను సోనీ లివ్ దక్కిచుకుంది. అంతేకాదు, గత ఏడాది సెప్టెంబర్ లో స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. కారణాలు ఏంటో తెలియదు గానీ, ప్రసారం చేయలేదు. ఆ తర్వాత పలుమార్లు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరిగినా, ఇప్పటికీ రాలేదు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి సోనీ లివ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను డిలీట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. అసలు ఈ సినిమా ఓటీటీలో వస్తుందా? రాదా? అనే అనుమానాలు సినీ అభిమానులలో తలెత్తుతున్నాయి.

బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన ‘ఏజెంట్‘

దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్’ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా, ఓటీటీలో ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. నిజానికి ‘ఏజెంట్‘ సినిమా రిలీజ్ కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ట్రైలర్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ దెబ్బతో అఖిల్ సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయమని చాలా మంది భావించారు. కానీ, ఈ సినిమా విడుదలయ్యాక సీన్ పూర్తిగా మారిపోయింది. తొలి షో నుంచే ఈ సినిమాపై భారీగా నెగెటివ్ టాక్ వచ్చింది. పట్టుమని రూ. 10 కోట్లు కూడా వసూళు చేయలేకపోయింది.

‘ఏజెంట్‘ సినిమాను అనిల్ సుంకర, రాంబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో అఖిల్ కు జంటగా  సాక్షి వైద్య హీరోయిన్‍గా చేసింది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి, డినో మోరియా, విక్రమ్ జీత్ విర్క్, డెంజిలన్ స్మిత్, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్ ఇతర పాత్రల్లో నటించారు.

Also Read: తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్‌ కొట్టేసిన జాన్వీ కపూర్‌ - నాని సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్‌ అయినట్టేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

N Convention Demolition: నాగార్జున మంచి నటుడే, కానీ కక్కుర్తి ఎందుకు? ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నారాయణ ఘాటు వ్యాఖ్యలు
నాగార్జున మంచి నటుడే, కానీ కక్కుర్తి ఎందుకు? ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నారాయణ ఘాటు వ్యాఖ్యలు
HYDRA Report: ఆ ప్రముఖుల కట్టడాలను కూల్చివేసిన హైడ్రా, ప్రభుత్వానికి కీలక నివేదిక
ఆ ప్రముఖుల కట్టడాలను కూల్చివేసిన హైడ్రా, ప్రభుత్వానికి కీలక నివేదిక
Revanth Reddy: అప్పటికల్లా హైదరాబాద్‌లో ఒలింపిక్స్, ప్రధానిని కోరతాం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
అప్పటికల్లా హైదరాబాద్‌లో ఒలింపిక్స్, ప్రధానిని కోరతాం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Tadipatri Politics: తాడిపత్రిలో ఒంటరైన రారాజు కేతిరెడ్డి! కనీసం నియోజకవర్గంలోకి నో ఎంట్రీ!
తాడిపత్రిలో ఒంటరైన రారాజు కేతిరెడ్డి! కనీసం నియోజకవర్గంలోకి నో ఎంట్రీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Suryakumar Yadav Leaving MI Fact Check | KKR కి కెప్టెన్ గా SKY వెళ్తున్నాడా..? | ABP DesamVirat Kohli Jersey Auction | విరాట్ కొహ్లీకి ఓ రేట్ కట్టిన అభిమానులు | ABP DesamNeeraj Chopra Diamond League 2024 | నీరజ్ చోప్రా విజయం వెనుక ఓ కెన్యా ప్లేయర్ | ABP DesamShikhar Dhawan Announces Retirement | క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధవన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
N Convention Demolition: నాగార్జున మంచి నటుడే, కానీ కక్కుర్తి ఎందుకు? ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నారాయణ ఘాటు వ్యాఖ్యలు
నాగార్జున మంచి నటుడే, కానీ కక్కుర్తి ఎందుకు? ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నారాయణ ఘాటు వ్యాఖ్యలు
HYDRA Report: ఆ ప్రముఖుల కట్టడాలను కూల్చివేసిన హైడ్రా, ప్రభుత్వానికి కీలక నివేదిక
ఆ ప్రముఖుల కట్టడాలను కూల్చివేసిన హైడ్రా, ప్రభుత్వానికి కీలక నివేదిక
Revanth Reddy: అప్పటికల్లా హైదరాబాద్‌లో ఒలింపిక్స్, ప్రధానిని కోరతాం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
అప్పటికల్లా హైదరాబాద్‌లో ఒలింపిక్స్, ప్రధానిని కోరతాం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Tadipatri Politics: తాడిపత్రిలో ఒంటరైన రారాజు కేతిరెడ్డి! కనీసం నియోజకవర్గంలోకి నో ఎంట్రీ!
తాడిపత్రిలో ఒంటరైన రారాజు కేతిరెడ్డి! కనీసం నియోజకవర్గంలోకి నో ఎంట్రీ!
గోకుల్ చాట్ పేలుళ్ళకు 17 ఏళ్లు, తీవ్రవాదులకు ఏ శిక్షలు పడ్డాయి?
గోకుల్ చాట్ పేలుళ్ళకు 17 ఏళ్లు, తీవ్రవాదులకు ఏ శిక్షలు పడ్డాయి?
Anantha Babu Video: వైసీపీ లీడర్ అనంతబాబు న్యూడ్ వీడియో వైరల్! మార్ఫింగ్ అని కొట్టిపారేసిన ఎమ్మెల్సీ
వైసీపీ లీడర్ అనంతబాబు న్యూడ్ వీడియో వైరల్! మార్ఫింగ్ అని కొట్టిపారేసిన ఎమ్మెల్సీ
HYDRA: హైడ్రా దూకుడు: ఆంధ్రా ఆఫీసర్‌ను గుర్తుకు తెస్తున్న ఏవీ రంగనాథ్ తీరు - నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువ!
హైడ్రా దూకుడు: ఆంధ్రా ఆఫీసర్‌ను గుర్తుకు తెస్తున్న ఏవీ రంగనాథ్ తీరు - నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువ!
Ali on Pawan Kalyan: అలీ చేతిలో ఎర్ర‌కండువా, ప‌వ‌న్ కల్యాణ్ ప్ర‌స్తావ‌న, చాలా ప‌వ‌ర్ ఫుల్ అంటూ కామెంట్స్
అలీ చేతిలో ఎర్ర‌కండువా, ప‌వ‌న్ కల్యాణ్ ప్ర‌స్తావ‌న, చాలా ప‌వ‌ర్ ఫుల్ అంటూ కామెంట్స్
Embed widget