అన్వేషించండి

Janhvi Kapoor: తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్‌ కొట్టేసిన జాన్వీ కపూర్‌ - నాని సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్‌ అయినట్టేనా?

Janhvi Kapoor Act in Nani-Srikanth Odela: తెలుగులో ఒక్క సినిమా రిలీజ్‌ కాకుండానే జాన్వీ వరుస ప్రాజెక్ట్స్‌కి సైన్‌ చేస్తుంది. ఇప్పటికే 'దేవర', RC16 వంటి భారీ ప్రాజెక్ట్స్‌ చేస్తుంది.

Janhvi Kapoor in Nani 33 Movie: ఎంట్రీతోనే బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లో యమ జోరు చూపిస్తుంది. హిందీలో ఆడపదడపా సినిమాలు చేసుకుంటున్న జాన్వీ.. ఏకంగా పాన్‌ ఇండియా సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా 'దేవర' (Devara Movie)మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది.

ఈ మూవీ సెట్‌లో ఉండగానే రామ్‌ చరణ్‌తో మరో పాన్‌ ఇండియా మూవీ చేస్తుంది. ఇలా ఎంట్రీతోనే ఇద్దరు గ్లోబల్‌ స్టార్స్ సరసన నటించే చాన్స్‌ కొట్టేసింది జాన్వీ. దీంతో ఈ అమ్మడికి లక్క్‌ మామూలుగా లేదంటూ అంతా జాన్వీ గురించి మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినా.. టాలీవుడ్‌లో మాత్రం పాన్‌ ఇండియా సినిమాల ఆఫర్స్‌ కొట్టేసింది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ సినిమాలతో ఒక్కసారిగా టాలీవుడ్‌ సెన్సేషన్ గా నిలిచింది. తాజాగా ఈ భామ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఫిక్స్‌ అయినట్టు తెలుస్తోంది. అదే 'దసరా' కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం. న్యాచులర్‌ స్టార్‌ నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో ఓ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

'నాని33'వ సినిమాగా రాబోతుంది. దసరా వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  నాని కోసం శ్రీకాంత్‌ ఓదెల ఈ సినిమాను భారీగా ప్లాన్‌ చేశారట. స్క్రిప్ట్‌ కూడా నానికి బాగా నచ్చిందట. వెంటనే ఈసినిమా చేసేందుకు నాని చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. సరిపోదా శనివారం అయిపోయాగానే ఈ సినిమా పట్టాలెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. దీంతో ఈ చిత్రంలో హీరోయిన్‌ వేటలో పడిందట మూవీ టీం.

ఈ క్రమంలో ఈ సినిమాకు జాన్వీని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం ఈ అమ్మడి లక్‌ మామూలుగా లేదని చెప్పాలి. వచ్చిరాగానే మూడు పెద్ద సినిమాలు, అదీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఆఫర్స్‌ కొట్టేసింది. దీంతో ఇక తెలుగులో జాన్వీ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిపోతుందనడంలో సందేహం లేదు. కాగా ఆ మధ్య నాని నటనపై జాన్వీ కపూర్‌ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. నాని-మృణాల్ ఠాకూర్ జంటగా నటించి హాయ్‌ నాన్న సినిమా మంచి విజయం సాధించింది. మూవీపై ప్రశంసలు కురిపించింది. నాని.. ఎప్పటిలాగే అదరగొట్టాడు అంటూ నాని నటనను ప్రశంసించింది. 

Also Read: రాజ్‌ తరుణ్‌ ఎక్కడ? - విచారణకు హాజరు కావాలని హెచ్చరిస్తూ హీరోకి పోలీసుల నోటీసులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget