Akhil Akkineni: మళ్ళీ తెరపైకి మోస్ట్ ఎలిజిబుల్ కాంబినేషన్, 'ఏజెంట్' తర్వాత అఖిల్ చేయబోయే సినిమా అదేనా?
'ఏజెంట్' తర్వాత అఖిల్ అక్కినేని చేయబోయే సినిమా ఏది? దీనికి మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. ముందు వినిపించిన పేర్లు కంటే ఇప్పుడు కొత్తగా మరో దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది.
![Akhil Akkineni: మళ్ళీ తెరపైకి మోస్ట్ ఎలిజిబుల్ కాంబినేషన్, 'ఏజెంట్' తర్వాత అఖిల్ చేయబోయే సినిమా అదేనా? Akhil Akkineni to do one more film with his Most Eligible Bachelor movie director Bommarillu Bhaskar Akhil Akkineni: మళ్ళీ తెరపైకి మోస్ట్ ఎలిజిబుల్ కాంబినేషన్, 'ఏజెంట్' తర్వాత అఖిల్ చేయబోయే సినిమా అదేనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/04/bf3f03fbce3f0f4b1b30622e8866a836_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇప్పుడు అఖిల్ అక్కినేని ఏం చేస్తున్నారు? సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా చేస్తున్నారు. మనాలిలో కొన్ని రోజులుగా జరుగుతున్న యాక్షన్ షెడ్యూల్ శుక్రవారంతో కంప్లీట్ అయ్యింది (Akhil Akkineni's Agent Movie Manali Schedule Completed). అఖిల్ అక్కడ నుంచి తిరిగొచ్చారు. 'ఏజెంట్' సంగతి ఓకే. దీని తర్వాత ఆయన చేయబోయే సినిమా ఏది?
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'గాడ్ ఫాదర్' సినిమా చేస్తున్న మోహన్ రాజా దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేసే అవకాశం ఉందని కొన్ని రోజులుగా వినబడుతోంది. అయితే, ఇప్పుడు కొత్తగా మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది. తనకు ఫస్ట్ సక్సెస్ అందించిన దర్శకుడు 'బొమ్మరిల్లు' భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి అఖిల్ అక్కినేని రెడీ అవుతున్నారట.
Also Read: 'విక్రమ్' రివ్యూ: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
అఖిల్, భాస్కర్ కలయికలో వచ్చిన మొదటి సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. మంచి విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత భాస్కర్ మరో సినిమా స్టార్ట్ చేయలేదు. ఇటీవల అఖిల్‌ను కలిసి ఒక కథ చెప్పారట. అది హీరోకి నచ్చిందని తెలుస్తోంది. ఏషియన్ సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో సినిమా విషయమై మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు, సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)