అన్వేషించండి

Akhil Akkineni : అయ్యగారు కాదు... అఖిల్‌కు కొత్తపేరు - ఈసారి గట్టిగా కొడుతున్నాం... లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్

Akhil Akkineni Reaction : లెనిన్ మూవీతో ఈసారి అఖిల్ అక్కినేని కచ్చితంగా హిట్ కొడుతున్నాడని అన్నారు కింగ్ నాగార్జున. తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.

Akhil Akkineni Reaction About Nick Name In Lenin Pre Release Event : అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ రూరల్ మాస్ ఎంటర్టైనర్ 'లెనిన్' జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరుపతిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక, ఇదే ఈవెంట్‌లో ఫ్యాన్స్ ఆయనకు కొత్త పేరు పెట్టారు.

అయ్యగారు కాదు

హీరో అఖిల్‌ను ఫ్యాన్స్ అంతా 'అయ్యగారు' అంటూ సరదాగా పిలుస్తుంటారు. అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫ్యాన్స్ ఆయనకు కొత్త పేరు పెట్టారు. యాంకర్ సుమ ఓ అభిమానిని ప్రశ్నించగా... నాగ అఖిల్ అని అన్నారు. 'నాగ అఖిల్ అంటే నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ,  నాగేశ్వరరావులో నాగ, అన్నపూర్ణమ్మలో అ. నాగార్జున, అమల పేర్లను అందులో చూసుకోవచ్చు. ఇక నుంచి ఆయన ప్రతీ మూవీకి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది.' అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Also Read : Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?

'ముఖం చూపించలేకపోతున్నా'

సినిమాలకు చాలా గ్యాప్ వచ్చిందని... అందుకే ఫ్యాన్స్‌కు ముఖం చూపించలేకపోతున్నట్లు చెప్పారు అఖిల్. 'గ్యాప్ వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. రెండున్నరేళ్లుగా అందరితో కమ్యూనికేట్ చేయలేకపోతున్నా. ఇది నిజాయితీగా అంగీకరించాల్సిందే. లెనిన్ వెనుక ఒకటే ఉద్దేశం ఉంది. నేను మీ ఇంటి వాడిని అయిపోవాలి. ఆ ప్రయత్నమే ఈ సినిమా. రెండేళ్ల క్రితం నందు అద్భుతమైన కథ చెప్పాడు. ఇది నా కథ అని నాకు అనిపించింది. ఈ మూవీతో అందరికీ ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్. ఈసారి జులై 10న సినిమా మాట్లాడుతుంది.' అని అన్నారు.

నాన్న గారి ఊరిలో...

అఖిల్ ఇప్పటివరకూ అర్బన్ స్టోరీస్ చేశాడని... మరి ఈ విలేజ్ స్టోరీకి సెట్ అవుతాడా? అని కాస్త భయపడినట్లు చెప్పారు కింగ్ నాగార్జున. 'ఈ సినిమా చూశాక నాతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. అఖిల్ లెనిన్‌గా మారిపోయాడు. స్టోరీ చెప్పినప్పుడు శ్రీరామపురంలో జరిగిన కథ అని నందు చెప్పాడు. అది నాన్న గారు పుట్టిన ఊరు. అందుకే కథకు వెంటనే కనెక్ట్ అయ్యా. ఈ సినిమాలో ట్విస్టులు ఎవరూ ఊహించలేరు. సెకండాఫ్‌లో అలాంటి ట్విస్ట్స్ వస్తాయి. భాగ్యశ్రీ కోసం ఎన్ని యుద్ధాలైనా చెయ్యొచ్చు. జులై 10కి వస్తున్నాం. మనవాడు కొడుతున్నాడు.' అని అన్నారు.

ఈ మూవీకి వినరో భాగ్యము విష్ణుకథ ఫేం మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించగా... అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. జులై 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Sing Geetham OTT : సింగ్ గీతం ఓటీటీ రిలీజ్ - థియేటర్ వెర్షన్ కంటే వెరీ డిఫరెంట్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget