Akhanda 2 Teaser: బాలయ్య రుద్ర 'తాండవం' - 'అఖండ 2' టీజర్ వేరే లెవల్.. థియేటర్స్ దద్దరిల్లుతాయంతే!
Akhanda 2 Teaser Out: బాలయ్య ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే. ఎంతగానో ఎదురుచూస్తోన్న 'అఖండ 2' టీజర్ వచ్చేసింది. బాలయ్య అఖండ రుద్ తాండవం అనిపించేలా గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

Balakrishna's Akhanda 2 Teaser: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ అవెయిటెడ్ మూవీ 'అఖండ 2' నుంచి బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది. ఆయన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు మాస్ ఫుల్ ట్రీట్ ఇచ్చేలా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ బోయపాటి మార్క్ కనిపించేలా బాలయ్య 'అఖండ రుద్ర తాండవం' గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
థగ థగ తాండవం.. బాలయ్య విశ్వరూపం
'శంభో' అంటూ హిమాలయాల బ్యాక్ గ్రౌండ్‌తో టీజర్ ప్రారంభం కాగా.. సింహం శివుడి రూపంలో ఉందా అన్నట్లుగా బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. ఇదివరకూ ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ స్టైల్, రోల్‌లో ఆయన కనిపించనున్నారని అర్థమవుతోంది. త్రిశూలం చేతబట్టి, ఒళ్లంతా విబూదితో జటాజూటధారియై.. ధర్మాన్ని కాపాడేందుకు సాక్షాత్తూ పరమశివుడే సింహం రూపంలో వస్తున్నాడా? అనేట్లుగా ఆయన ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
హరిహరులు శత్రు సంహారం చేశారా!
'నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా. అమాయకుల ప్రాణాలు తీస్తావా.' అంటూ బాలయ్య పవర్ ఫుల్‌గా చెప్పే డైలాగ్ వేరే లెవల్ అంతే. త్రిశూలాన్ని సుదర్శన చక్రంలా తన మెడ చుట్టూ తిప్పుతూ.. శివుడు, నారాయణుడు కలిసి శత్రు సంహారం చేస్తున్నారా అనేట్లుగా ఉన్న టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు ఏమాత్రం తగ్గకుండా పవర్ ఫుల్ యాక్షన్‌తో గూస్ బంప్స్ తెప్పించేలా బాలయ్యను చూపించారు బోయపాటి. వేదం చదివిన శరభం యుద్ధానికి ఎదిగింది' అంటూ సాగే డైలాగ్ మూవీపై హైప్ పదింతలు క్రియేట్ చేసింది.
There's no mercy!
— 14 Reels Plus (@14ReelsPlus) June 9, 2025
This is DESTRUCTION in its most DIVINE & DEADLIEST form 🔱🔥#Akhanda2Teaser out now!
▶️ https://t.co/jfoVA2IFF3
Happy birthday to the 'GOD OF MASSES' #NandamuriBalakrishna ❤️🔥#Akhanda2 THANDAAVAM IN THEATRES DUSSEHRA 25th SEPTEMBER #Akhanda2Thaandavam… pic.twitter.com/o8ybywz1Fr
'అఖండ'కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతుండగా.. బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. తమన్ బీజీఎం వేరే లెవల్‌లో అంతే. బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'జై బాలయ్య', 'బాలయ్య రుద్ర తాండవం.. నట విశ్వరూపం' అంటూ పేర్కొంటున్నారు.
ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో మాస్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. '14 రీల్స్ ప్లస్' బ్యానర్‌పై ఎం.తేజస్విని సమర్పణలో రామ్ అంచట, గోపీ అచంట నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ల తర్వాత అదే రేంజ్‌లో మరో బ్లాక్ బస్టర్ ఖాయమంటూ బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు.'దసరా' సందర్భంగా సెప్టెంబర్ 25న 'అఖండ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది.





















