Aamir Khan: హీరోయిన్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్.. ఏజ్ గ్యాప్‌పై ట్రోలింగ్స్ - అప్పుడు కమల్ ఇప్పుడు ఆమిర్
Aamir Khan Genelia: తన కన్నా చిన్న వయసున్న జెనీలియాతో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై బాలీవుడ్ స్టార్ ఆమిర్ తాజాగా స్పందించారు. ఏజ్ గ్యాప్, ఆన్ స్క్రీన్ రొమాన్స్ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Aamir Khan About Trollings On Sitaare Zameen Par Movie: మూవీ అన్నాక హీరో హీరోయిన్ల మధ్య ముద్దు సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు కామన్. అయితే.. అది శ్రుతి మించడం, హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్‌పై ఇటీవల ఎక్కువగా చర్చ సాగుతోంది. ఎక్కువ ఏజ్ స్టార్ హీరోలు తక్కువ ఏజ్ హీరోయిన్లతో రొమాన్స్ చేయడం విమర్శలకు కారణం అవుతోంది.
అప్పుడు కమల్.. ఇప్పుడు ఆమిర్
ఇటీవల యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ 'థగ్ లైఫ్' విషయంలోనూ ఆయనపై నెట్టింట ట్రోల్ సాగింది. 70 ఏళ్ల వయసున్న కమల్‌తో 42 ఏళ్ల త్రిష రొమాన్స్ చేశారంటూ కామెంట్స్ చేశారు. తాజాగా.. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌పై ఇప్పుడు ట్రోలింగ్ సాగుతోంది. ఆయన లేటెస్ట్ మూవీ 'సితారే జమీన్ పర్'లో ఆమిర్ సరసన జెనీలియా నటించారు. వీరిద్దరి మధ్య 23 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండడంతో దీనిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. దీన్నే హైలెట్ చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా.. తాజాగా ఈ అంశంపై ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ స్పందించారు.
ఆమిర్ ఏమన్నారంటే?
ఏజ్ గ్యాప్ విషయంలో తాను కూడా ఆందోళన చెందినట్లు ఆమిర్ తెలిపారు. 'జెనీలియాను బీటౌన్‌కు పరిచయం చేసింది నేనేనని నాకు గుర్తుంది. కానీ, ఈ మూవీలో మేమిద్దరం 40ల వయసున్న రోల్స్ చేస్తున్నాం. ఆమె కూడా ఇప్పుడు దాదాపు ఆ వయసులోనే ఉంది కదా!' అని అన్నారు. కాగా.. 2008లో 'జానేతు.. యా జానే నా' మూవీతో జెనీలియాను బాలీవుడ్‌కు పరిచయం చేశారు ఆమిర్. ఇందులో ఆయన మేనల్లుడు హీరోగా నటించగా.. ఆమిర్ నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
Also Read: 'SSMB29' మూవీలో ఆర్ మాధవన్? - రూమర్ Vs రియల్.. ఆ వార్తల్లో నిజం ఏంటంటే?
వీఎఫ్ఎక్స్.. ఏజ్ ఆలోచన ఎందుకు?
గతంతో పోలిస్తే పూర్తిగా పరిస్థితులు మారిపోయాయని.. ఇప్పుడు మనకు వీఎఫ్ఎక్స్ అందుబాటులో ఉందని అన్నారు ఆమిర్. 'అప్పట్లో నా వయసు ఉన్న వారు 18 ఏళ్ల రోల్ పోషిస్తే ప్రోస్థటిక్ మేకప్‌పై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు దాని అవసరం లేదు. టెక్నాలజీతో ఏమైనా చెయ్యొచ్చు. 1989 నాటి 'ఈశ్వర్' అనిల్ కపూర్ 80 ఏళ్ల వ్యక్తిగా కనిపించారు. దీని కోసం ఎంతో మేకప్ ఉపయోగించారు. వీఎఫ్ఎక్స్ వచ్చాక యాక్టర్స్ ఏజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.' అని ఆమిర్ చెప్పారు.
'లాల్ సింగ్ చడ్డా' తర్వాత ఆమిర్ 'సితారే జమీన్ పర్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించగా.. దివ్య నిధి శర్మ స్టోరీ అందించారు. ఈ నెల 20న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ఆమిర్ 'దాదా సాహెబ్ ఫాల్కే' బయోపిక్ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కమల్ 'థగ్ లైఫ్'లోనూ హీరోయిన్లతో రొమాన్స్‌పై సోషల్ మీడియాలో చర్చ సాగింది. 70 ఏళ్ల వయసున్న కమల్.. త్రిషతో రొమాన్స్, హీరోయిన్ అభిరామితో లిప్ లాక్ చేయడంపై ట్రోలింగ్స్ సాగాయి. దీనిపై డైరెక్టర్ మణిరత్నం స్పందించారు. ఓ సీన్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్ షిప్ చూస్తున్నప్పుడు వాళ్లు కమల్, త్రిషలా చూడకూడదని.. రోల్స్ చూడాలని అన్నారు. మూవీ చూసిన తర్వాత నిజాలు తెలుసుకుని అభిప్రాయాలు చెప్పొచ్చంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.






















