Samantha: అబుదాబి వెకేషన్‌లో డైరెక్టర్ రాజ్‌తో సమంత? - ఆ ఫోటోలో ఉన్నది ఎవరు!
Samantha Raj Nidimoru: సమంత, రాజ్ రిలేషన్ షిప్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అరబ్ కంట్రీ వెకేషన్ ఫోటోస్ షేర్ చేయగా.. ఆమె రాజ్‌తో కలిసి వెకేషన్‌కు వెళ్లారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Samantha With Raj Nidimoru In Abudhabi Trip: 'శుభం' సక్సెస్ తర్వాత స్టార్ హీరోయిన్ సమంత దుబాయ్‌లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ జ్యువెలరీ బ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన ఆమె.. గత కొద్ది రోజులుగా అక్కడి ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. నేచుర్‌ను ఆస్వాదిస్తూ బెస్ట్ మూమెంట్స్‌ను షేర్ చేస్తున్నారు.
డైరెక్టర్ రాజ్‌తో సమంత?
అరబ్ కంట్రీ హోటల్స్‌లో బెస్ట్ ఫుడ్స్ టేస్ట్ చేస్తూ అక్కడి అందాలు ఎంజాయ్ చేస్తున్నారు సమంత. తాజాగా అబుదాబిలో ఉన్న ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. 'నక్షత్రాలకు చేరువలో..' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమె డైరెక్టర్ రాజ్ నిడమోరుతో వెకేషన్‌కు వెళ్లారని కామెంట్స్ చేస్తున్నారు.
ఆ ఫోటోలో ఉన్నది ఎవరు?
ఓ ఫోటోలో సమంత మరో వ్యక్తితో కలిసి స్టార్స్‌ను చూస్తున్నట్లు ఉండగా.. ఆ ఫోటోలో ఉన్నది రాజ్‌యేనంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సమంత అబుదాబిలో రాజ్‌తో కలిసి వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు. ఇటీవలే వీరిద్దరి రిలేషన్ షిప్‌పైనా రూమర్స్ హల్చల్ చేశాయి. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆ రూమర్లకు బలం చేకూర్చాయి.
'శుభం' సక్సెస్ ప్రమోషన్స్‌లో భాగంగా సమంత ఆ మూమెంట్స్‌ను ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. డైరెక్టర్ రాజ్ భుజంపై సమంత వాలి ఉన్న ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ కొన్ని ఆంగ్ల మీడియాల్లో కథనాలు కూడా వచ్చాయి. అయితే, ఇదంతా తప్పుడు ప్రచారమని.. అసత్యాలు స్ప్రెడ్ చెయ్యొద్దంటూ సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.
View this post on Instagram
Also Read: 'SSMB29' మూవీలో ఆర్ మాధవన్? - రూమర్ Vs రియల్.. ఆ వార్తల్లో నిజం ఏంటంటే?
అసలేం జరిగిందంటే?
రాజ్ - డీకే సంయుక్తంగా తెరకెక్కించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ'లో సమంత నటించారు. అప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే రూమర్స్ రాగా.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తిరగడం వీటికి మరింత బలాన్ని చేకూర్చింది. 'శుభం' సక్సెస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫోటోస్ మళ్లీ వైరల్ కాగా మళ్లీ వీరి వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో రాజ్ సతీమణి శ్యామాలి ఇన్ స్టా వేదికగా పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
2015లో రాజ్‌తో శ్యామాలికి వివాహం జరగ్గా.. ఇద్దరూ విడిపోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు హల్చల్ చేశాయి. ఈ క్రమంలో తన కోసం ఆలోచించే వారందరికీ దేవుడి ఆశీర్వాదం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నట్లు శ్యామాలి పోస్ట్ పెట్టారు. ఇది వారిని ఉద్దేశించే అంటూ మరో చర్చ కూడా సోషల్ మీడియాలో మొదలైంది. అయితే.. దీనిపై ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు.
'చై' చివరి గుర్తులు చెరిపేసిన సమంత
రెండు రోజుల క్రితం తన బ్రాండ్ ప్రమోషన్లలో భాగంగా చేసిన వీడియోలో సమంత తన మెడపై ఉన్న 'YMC' (ఏమాయ చేశావే) టాటూ తొలగించారు. అఖిల్ పెళ్లి రోజునే ఇలా చేశారని.. నాగచైతన్య చివరి గుర్తును ఆమె చెరిపేశారంటూ నెట్టింట చర్చ సాగింది. ఆమె ఈ మూవీతోనే ఎంట్రీ ఇవ్వగా.. భారీ సక్సెస్ అందుకున్నారు. ఈ టాటూ తనకు ఎంతో స్పెషల్ అని పలు సందర్భాల్లో సామ్ చెప్పారు. అది చెరిపేయడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా.. షేర్ చేసిన ఫోటోల్లో ఉన్నది కూడా రాజ్ నిడమోరునే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.





















