Akhanda 2 Villain: 'అఖండ 2'లో విలన్... రియల్ లైఫ్‌లోనూ ఆర్మీ ఆఫీసరే... సంగే సెల్ట్రామ్ బ్యాగ్రౌండ్ తెలుసా?
Who Is Sangay Tsheltrim: 'అఖండ 2 తాండవం'లో ఆది పినిశెట్టి మెయిన్ విలన్ అని భావించారంతా! అయితే థియేటర్లకు వెళ్లిన తర్వాత తెలిసింది... అందులో అసలు విలన్ వేరొకరు అని! అతని బ్యాగ్రౌండ్ తెలుసా?

Meet Akhanda 2 Thaandavam Villain Sangay Tsheltrim: 'అఖండ 2 తాండవం' సినిమాలో యువ కథానాయకుడు ఆది పినిశెట్టి విలన్ అని ప్రేక్షకులు అందరూ భావించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'సరైనోడు'లో ఆయన విలన్. ఇప్పుడు మరోసారి శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారని అనుకుంటే, థియేటర్లకు వెళ్లిన తర్వాత మెయిన్ విలన్ వేరొకరు అని తెలిసింది. అతని పేరు సంగే సెల్ట్రాన్. అసలు అతను ఎవరో తెలుసా?
'అఖండ 2'లో మెయిన్ విలన్ ఎవరు?
Who is Akhanda 2 Main Villain: 'అఖండ 2 తాండవం' సినిమాలో మెయిన్ విలన్ ఎవరు? అనేది చెప్పేది ముందు కథ గురించి చెప్పాలి. భారత్ - చైనా సరిహద్దులలో (గాల్వన్)లో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనా ఆర్మీ జనరల్ తనయుడు మరణిస్తాడు. దాంతో భారతదేశంపై పగ తీర్చుకోవాలని బయో వార్ ప్లాన్ చేస్తాడు ఆ జనరల్. అతడిని అఖండ పైలోకాలకు పంపిస్తారు. ఆ జనరల్ పాత్రలో సంగే సెల్ట్రాన్ నటించారు.
View this post on Instagram
ఎవరీ సెల్ట్రాన్? గతంలో ఏం చేశారేంటి?
'అఖండ 2' కంటే ముందు తెలుగులో మరో సినిమా చేశారు సంగే సెల్ట్రాన్. అఖిల్ అక్కినేని 'ఏజెంట్'లో ఖలీద్ పాత్రలో నటించారు. ఆ సినిమా అంతంత మాత్రంగా ఆడింది. అందువల్ల, ఆయనకు తెలుగులో గుర్తింపు రాలేదు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 'రాధే', బాద్ షా షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమాల్లో సెల్ట్రాన్ నటించారు.
రియల్ లైఫ్‌లో ఆర్మీ ఆఫీసర్... చైనా కాదు!
సంగే సెల్ట్రాన్ ఇండియన్ కాదు. ఆయనది భూటాన్. నటన మీద ఆసక్తితో మన దేశం వచ్చారు. భారతీయ సినిమాల్లో ఆయన విలన్ రోల్స్ చేస్తున్నారు. కానీ ఆయన రియల్ లైఫ్ హీరో. భూటాన్ ఆర్మీలో అధికారిగా విధులు నిర్వర్తించి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు.
Also Read: ఎవరీ తరుణ్ ఖన్నా? 'అఖండ 2'లో శివుడు ఈయనే - హిందీలో వెరీ పాపులర్... ఇంతకు ముందు చేశారో తెలుసా?
20 years of my journey and major transition in my career.#cadet #armyofficer #champion #actor pic.twitter.com/4S8xjb3Os7
— Sangay Tsheltrim (@sangaytsheltrim) May 8, 2021
ఆర్మీ ఆఫీసర్ కావడంతో ఫిట్నెస్ మీద సంగే సెల్ట్రాన్ (Sangay Tsheltrim)కు మంచి గురి ఉంది. ఆయన ఓల్డ్ ఫోటోలు చూస్తే బాడీ బిల్డర్ అని అర్థం అవుతోంది. ఈ భూటాన్ ఆర్మీ అధికారికి యాక్షన్ హీరో రోల్ చేయాలనేది కోరిక. 'అఖండ 2 తాండవం' సినిమా ద్వారా తెలుగులో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇకపై మరిన్ని అవకాశాలు రావచ్చు కూడా!
Also Read: ఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల





















