Akhanda Sequel : 'అఖండ 2'పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి - బాలకృష్ణ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే స్పీచ్!
''గుండెలపై చెయ్యి వేసుకుని 'స్కంద' చూడండి'' అని ప్రీ రిలీజ్ థండర్ ఫంక్షన్‌లో దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు. బాలకృష్ణతో 'అఖండ 2' కన్ఫర్మ్ చేశారు. నందమూరి ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే స్పీచ్ ఇచ్చారు.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) హ్యాట్రిక్ హిట్స్ తీశారు. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఈ తరం దర్శకులలో బాలయ్యను బోయపాటి చూపించినట్టు... మరో దర్శకుడు చూపించలేదంటే అతిశయోక్తి కాదు. అందుకని, వీళ్ళ కాంబినేషన్‌లో మరో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు బోయపాటి శ్రీను కిక్ ఇచ్చే మాట చెప్పారు.
'అఖండ 2' చేస్తున్నా - బోయపాటి
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తాజా సినిమా 'స్కంద'. ది ఎటాకర్... అనేది ఉపశీర్షిక. ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించిన చిత్రమిది. సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శనివారం 'స్కంద' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఆ వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన గురించి మాట్లాడుతూ 'అఖండ 2' చేస్తున్నట్లు బోయపాటి శ్రీను స్పష్టం చేశారు.
బాలకృష్ణ వ్యక్తి కాదు, శక్తి : బోయపాటి శ్రీను
బోయపాటి శ్రీను స్పీచ్ నందమూరి అభిమానులు, మరీ ముఖ్యంగా బాలకృష్ణను అభిమానించే వ్యక్తులకు కిక్ ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ''కొంత మంది వ్యక్తులు కాదు, శక్తులు. ఆ శక్తి బాలయ్య. ఆయనకు ఓ పదం అయినా లొంగుతుంది. పాత్ర అయినా లొంగుతుంది. మేం ఓ పాత్రకు ఓ నటుడిని అనుకున్నప్పుడు... మాకు కొత్తగా కనిపిస్తున్నారంటే? వాళ్ళు వందకు వంద శాతం శక్తి ఉన్నవాళ్ళు. అదీ బాలయ్య. ఒక పాత్రను ఇస్తే దానిలో ప్రవేశించి, దానిని లొంగదీసుకుని చేస్తారు. దటీజ్ బాలయ్య'' అని బోయపాటి శ్రీను చెప్పారు.
బాలయ్య ఆశీర్వాదంలో జన హితం ఉంటుంది : బోయపాటి శ్రీను
'స్కంద' ప్రీ రిలీజ్ థండర్ కార్యక్రమానికి బాలకృష్ణను ఆహ్వానించడానికి ప్రధాన కారణం ఏమిటో కూడా బోయపాటి శ్రీను వివరించారు. ఆయన మాట్లాడుతూ... ''బాలయ్య గారిలో ఉన్నది వాక్ సుద్ధి. ఆయన ఆశీర్వాదానికి ఎంత అమోఘమైన విలువ ఉంటుందో నాకు తెలుసు. బాలయ్య గారి ఆశీర్వాదంలో మన హితంతో పాటు జన హితం ఉంటుంది. దటీజ్ బాలయ్య. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు'' అని బోయపాటి శ్రీను చెప్పారు.
గుండెలపై చెయ్యి వేసుకుని 'స్కంద'కు రండి : బోయపాటి శ్రీను
మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు ఎటువంటి విజయం ఇస్తారో తాను రుచి చూశానని, 'స్కంద' కూడా మంచి సినిమా అని, తప్పకుండ విజయం సాధిస్తుందని బోయపాటి శ్రీను ధీమా వ్యక్తం చేశారు. గుండెలపై చెయ్యి వేసుకుని థియేటర్లకు రమ్మని ఆయన చెప్పారు. రామ్ పోతినేనిలో మంచి తపన ఉందని, అది అతనిని పైకి తీసుకొస్తుందని చెప్పారు. శ్రీ లీల ఏ సినిమాలో చేయడం లేదో అడగాల్సిన పరిస్థితి ఉందని, ఎక్కువ సినిమాలు చేస్తే గ్లామర్ పోతుంది కాబట్టి ఆ విషయం ఆమె తెలుసుకోవాలని సరదాగా వ్యాఖ్యానించారు. 'మేజర్', 'గని' చిత్రాల్లో కథానాయిక నటించిన సయీ మంజ్రేకర్ 'స్కంద'లో కీలక పాత్ర చేశారని తెలిపారు.
Also Read : మొగుడిని మిర్చిలా నంజుకుతింటున్న పెళ్ళాం - సమంతను తిడుతూ విజయ్ దేవరకొండ పాట
'స్కంద' సినిమాలో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయని బోయపాటి శ్రీను చెప్పారు. యాక్షన్ మాత్రమే కాదని, ఇంకా చాలా అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తనకు మంచి స్నేహితులు అని, ఆయన వల్ల సినిమా బాగా వచ్చిందని చెప్పారు.
Also Read : హారర్ థ్రిల్లర్ సినిమాతో రాజమౌళి హీరోయిన్ రీ ఎంట్రీ - లుక్ చూశారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial