Ajith Kumar : లేడీ ఫ్యాన్ బ్యాగు మోసిన అజిత్ - స్టార్ హీరోలు ఎవరైనా చేస్తారా ఇలా?
అభిమానుల కష్టం చూసి చలించిపోయే కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. సెల్ఫీ అడిగిన ఫ్యాన్ బ్యాగేజీని మోసి గొప్ప మనసు చాటుకున్నారు.
Ajith Kumar : ఫ్యాన్స్ కు కష్టం వస్తే నేనున్నానమటూ ముందుండే స్టార్ హీరోల్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఒకరు. ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ సింప్లిసిటీని మెయింటైన్ చేస్తూ... సామాన్య వ్యక్తిగా ప్రజల్లో కలిసిపోతుంటారు. మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు ఆయన. విమానాశ్రయంలో పది నెలల బిడ్డతో బ్యాగ్ మోయలేక ఇబ్బంది పడుతున్న ఓ ఫ్యాన్ కు ఆసరాగా నిలిచి వార్తల్లో నిలిచారు. ఆమె బ్యాగ్ ను స్వయంగా విమానం వరకు మోశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సెలబ్రెటీలు ఎవరైనా కనిపిస్తే సెల్ఫీలు తీసుకుందాం అని చాలా మంది అనుకుంటారు. అలా అడిగితే కొందరు సింపుల్ గా సారీ చెప్పేసి వెళ్లిపోతుంటారు. కొందరేమో ఫ్యాన్స్ కోసం కాసేపు ఆగి, సమయం కేటాయిస్తూ ఉంటారు. కానీ అజిత్ అంతకు మించిన పని ఒకటి చేశారు. సెల్ఫీ అడిగిన అభిమానికి సెల్ఫీ ఇవ్వడంతో పాటు ఆమెకు సాయం కూడా చేశారు. లండన్ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అజిత్ లాగే ఓ మహిళ ఎయిర్ పోర్టుకు రాగా.. అతన్ని చూడగానే ఆయన్ని చేరుకుని సెల్ఫీ కావాలని కోరింది. ఈ విషయాన్ని ఆమె భర్త కార్తిక్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
తన భార్య పది నెలల వయసున్న తమ బాబుతో గ్లాస్గో నుంచి చెన్నైకు బయలుదేరిందని ఆ వ్యక్తి రాసుకొచ్చాడు. లండన్ విమానాశ్రయంలో అప్పుడే హీరో అజిత్ కనిపించారని, కలిసి ఫొటో దిగేందుకు ఆయన్ను తన భార్య కలిసిందని చెప్పారు. "నా భార్య ఒంటరిగా ప్రయాణిస్తుందని గమనించిన ఆయన కేవలం ఫొటోకు పోజివ్వడమే కాకుండా విమానం ఎక్కే వరకూ తోడుగా ఉన్నారు. ‘ఫర్వాలేదు సర్.. నేను చూసుకుంటా’ అని ఆమె చెప్పినా... ‘నో ప్రాబ్లమ్. నాకూ ఇద్దరు పిల్లలున్నారు. పరిస్థితి అర్థం చేసుకోగలను’ అని చెప్పారు. ఆమె ఓ సూట్ కేసు, బేబీ బ్యాగుతో ఇబ్బంది పడుతుందని... అజితే స్వయంగా బేబీ బ్యాగును విమానం వరకు మోసుకెళ్లి, సిబ్బంది (క్యాబిన్ క్రూ)కి ఇచ్చి దాన్ని ఆమె సీటు వద్ద పెట్టించారు. ఆ తర్వాత షటిల్ బస్సులో ప్రయాణించే సమయంలోనూ నా భార్య తాను వాటిని మోయగలనని చెప్పగా అజిత్ ఆమె వారిస్తూ సాయం చేశారు. ఆయన వ్యక్తిత్వం నన్ను ఎంతో కదిలించింది’’ అంటూ కార్తిక్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన అజిత్ అభిమానులు, నెటిజన్లు ‘అజిత్ అంటే ఇదీ’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అజిత్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వాన్ని అందరూ కొనియాడుతున్నారు.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌ను భయపెట్టిన 'శాకుంతలం' - 'ఆదిపురుష్' ఎలా ఉంటుందో?
ఇక అజిత్ సినిమా విషయాలకొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి ‘తునివు’ (Thunivu) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ తర్వాత సినిమా (#AK62) విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఉంటుందని ఇటీవల కోలీవుడ్‌లో వార్తలొచ్చాయి. గానీ ఇప్పటికీ ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆ ప్రాజెక్టు రద్దు అయిందని మరో డైరెక్టర్‌తో.. అజిత్ తన 62వ చిత్రంతో అభిమానుల ముందుకు రానున్నట్టు వార్తలు వినిపిస్తు్న్నాయి.
Also Read : పవన్ కళ్యాణ్ మాసివ్ యాక్షన్ సీన్ - 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో...