Agent OTT Release Date : మూడు వారాలకే ఓటీటీలో 'ఏజెంట్' - సోనీ లివ్‌లో ఆ రోజు రిలీజ్ పక్కా!
Agent Movie On Sony Livఅఖిల్ అక్కినేని 'ఏజెంట్' థియేటర్లలో విడుదలైన మూడు వారాలకు ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఏ రోజు విడుదల కానుందీ వెల్లడించింది.
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) కథానాయకుడిగా నటించిన స్పై థ్రిల్లర్ 'ఏజెంట్' (Agent Movie). ఇందులో మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. డినో మోరియా విలన్ రోల్ చేశారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు. అతి త్వరలో ఈ సినిమా ఓటీటీలో సందడికి సిద్ధం అయ్యింది.
మే 19న ఓటీటీలో 'ఏజెంట్'
Agent Movie OTT Release Date : 'ఏజెంట్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ నెల 19న ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. సో... మరో రెండు వారాలు ఆగితే ఓటీటీలో సినిమాను చూసేయొచ్చు. అదీ సంగతి!
థియేటర్లలో ఏప్రిల్ 28న 'ఏజెంట్' విడుదలైంది. అంటే... మూడు వారాలకు ఓటీటీ స్క్రీన్ మీద విడుదలకు రెడీ అయ్యింది. తెలుగులో కొన్ని చిన్న సినిమాలు ఈ విధంగా విడుదలైన సందర్భాలు ఉన్నాయి. థియేటర్లలోకి వచ్చిన వారమే వచ్చిన సినిమాలు ఉన్నాయి. థియేట్రికల్ రిలీజ్ అయిన రెండు మూడు వారాలకు వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే... భారీ తారాగణం, పేరున్న దర్శక - నిర్మాతలు చేసిన సినిమా మూడు వారాలకు ఓటీటీ బాట పట్టడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.
నిర్మాతే ఫ్లాప్ అని ట్వీట్ చేశాక...
భారీ అంచనాల మధ్య 'ఏజెంట్' థియేటర్లలోకి వచ్చింది. అయితే, మొదటి ఆట నుంచి డిజాస్టర్ టాక్ వచ్చింది. దాంతో రెండో రోజు వసూళ్ళ మీద తీవ్ర ప్రభావం చూపించింది. మొదటి రోజు సినిమాకు నాలుగు కోట్ల షేర్ వస్తే... రెండో రోజు అది కోటిన్నరకు పడింది. మూడు రోజు లక్షల్లో వచ్చింది. నాలుగు రోజు అయితే కేవలం 17 లక్షల రూపాయల షేర్ మాత్రమే రాబట్టింది. మంగళవారం అది కూడా రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : మంగ్లీ కొత్త పాట - రేలా రేలా రేలా రేలా మనసు ఉరకలేసేనా
నిర్మాత అనిల్ సుంకర సైతం తమ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకొన్నారు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సినిమా స్టార్ట్ చేయడం తమ తప్పేనని ఆయన అంగీకరించారు. తమకు 'ఏజెంట్' కాస్ట్లీ మిస్టేక్ అని అనిల్ సుంకర ట్వీట్ చేశారు. అది కూడా వసూళ్ల మీద చాలా ప్రభావం చూపించిందని, నిర్మాతే ఫ్లాప్ అని చెప్పాక థియేటర్లకు ఎవరు వస్తారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Also Read : నేను ఆత్మహత్య చేసుకుంటే కారణం వీళ్ళే, నన్ను చంపేందుకూ ప్రయత్నించారు - లిరిసిస్ట్ శ్రేష్ఠ షాకింగ్ పోస్ట్
'ఏజెంట్' కథ ఏంటంటే?
రిక్కీ అలియాస్ రామకృష్ణ (అఖిల్ అక్కినేని)కి 'రా' ఏజెంట్ అవ్వాలని కోరిక. మూడుసార్లు ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాస్తాడు. ఇంటర్వ్యూల్లో రిజెక్ట్ అవుతాడు. 'రా' చీఫ్ డెవిల్ అలియాస్ మహాదేవ్ (మమ్ముట్టి) సిస్టమ్ హ్యాక్ చేస్తాడు. దాంతో ఆయన చూపు రిక్కీ మీద పడుతుంది. అయితే, అతడిలో ఏజెంట్ అయ్యే లక్షణాలు ఏమీ లేవని చెప్పేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆయనే దేశానికి పెను ముప్పుగా మారిన గాడ్ అలియాస్ ధర్మ (డినో మోరియా)ను చంపడానికి రిక్కీని ఎందుకు ఎంపిక చేశారు? మిషన్ మొదలైన తర్వాత మహాదేవ్ ఆదేశాలను పక్కన పెట్టిన రిక్కీ ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కొన్నాడు? సెంట్రల్ మినిష్టర్ జయకిషన్ (సంపత్ రాజ్)ను ఎందుకు చంపాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.