Sreeleela: 'గుంటూరు కారం' తర్వాత శ్రీలీలకు కొత్త ఆఫర్స్ రావడం లేదా? కారణం అదేనా?
Sreeleela: మొన్నటిదాకా క్రేజీ హీరోయిన్ గా ఉన్న శ్రీలీలకు వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. దీంతో కొత్త ఆఫర్స్ రావడం లేదని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Sreeleela: 2019లో 'కిస్' అనే కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసిన యంగ్ బ్యూటీ శ్రీలీల.. 'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీలోనే తన గ్లామర్ తో, డ్యాన్స్ లతో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ యూత్ లో ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఎంట్రీతోనే అగ్ర దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. దీంతో క్రేజీ ఆఫర్స్ తలుపు తట్టాయి. ప్రారంభంలోనే మంచి హిట్స్ పడటంతో, ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వచ్చిన ప్రతీ సినిమాకు సైన్ చేస్తూ, చేతి నిండా సినిమాలతో బిజీగా మారిపోయింది. కానీ ఇటీవల కాలంలో బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ పలకరించడంతో, ఒక్కసారిగా అమ్మడి చుట్టూ నెగిటివిటీ వచ్చి చేరింది.
ఎనర్జిటిక్ డ్యాన్స్ లు, ఆకట్టుకునే అందం, మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉండటంతో శ్రీలీల కొన్నేళ్లపాటు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణిస్తుందని అందరూ భావించారు. రవితేజతో చేసిన 'ధమాకా' మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో, టాలీవుడ్ స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకూ.. అందరికి మొదటి ఛాయిస్ గా మారిపోయింది. అయితే 'స్కంద' రూపంలో ఫస్ట్ డిజాస్టర్ ను చవిచూసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. కాకపోతే ఆ వెంటనే వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవడం ఆమెకు కలిసొచ్చింది.
కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మెగా మేనల్లుడితో కలిసి శ్రీలీల నటించిన 'ఆదికేశవ' చిత్రం మరో భారీ పరాజయాన్ని మూటగట్టుకునేలా చేసింది. నితిన్ కు జోడీగా నటించిన 'ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్' సినిమా తన ఖాతాలోకి మరో డిజాస్టర్ ని చేర్చింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన 'గుంటూరు కారం' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ కస్తూరీకి ఏమాత్రం ప్లస్ అవ్వలేదు. మహేశ్ స్టార్ పవర్ తో బాక్సాఫీస్ మంచి కలెక్షన్స్ వచ్చాయి కానీ, శ్రీలీలకు పేరు తెచ్చిపెట్టలేదు. పైగా ఆమె చుట్టూ బోలెడంత నెగిటివిటీ వచ్చి చేరడానికి కారణమైంది.
ఇలా వరుసగా ప్లాప్స్ పడటంతో మొన్నటి వరకూ శ్రీలీల డేట్స్ కోసం ఎగబడిన ఫిలిం మేకర్స్ అంతా ఇప్పుడు మొహం చాటేస్తున్నారట. ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్ ను పక్కన పెడితే అమ్మడికి కొత్త ఆఫర్స్ రావడం లేదట. ఈ పరిస్థితికి వరుస పరాజయాలు ఒక కారణమైతే, అధిక పారితోషికం డిమాండ్ చేయడం మరొక కారణంగా ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. 'గుంటూరు కారం' చిత్రానికి ఈ బ్యూటీ మూడున్నర కోట్లకు పైగానే తీసుకున్నట్లుగా రూమర్స్ ఉన్నాయి. తదుపరి సినిమాలకు కూడా అదే రేంజ్ లో అడిగే అవకాశం ఉందని ఇతర నిర్మాతలు ఎవరూ ఆమెను సంప్రదించడం లేదని టాక్ నడుస్తోంది.
నిజానికి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ ఎక్కువ కాలం ఉండదు. అందుకే ఇలా క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే విధంగా ఆలోచిస్తుంటారు. శ్రీలీల కూడా అదే ఫాలో అవుతూ వరుసపెట్టి సినిమాలకు సంతకాలు చేసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ప్లాప్స్ పడటంతో క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది. ఇప్పటి నుంచైనా స్క్రిప్ట్ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అభిమానులు భావిస్తున్నారు.
శ్రీలీల ఇప్పటికే కమిటైన సినిమాలలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంది. అలానే గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా లాంచ్ అవుతున్న చిత్రంలోనూ ఈ బ్యూటీనే హీరోయిన్. అయితే ఈ సినిమా ఎక్కడిదాకా వచ్చింది, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే సమాచారం లేదు.
Also Read: 'హరి హర వీరమల్లు' వెనుక అసలేం జరుగుతోంది?