అన్వేషించండి

Aditi Govitrikar: అందుకు ఒప్పుకోలేదని సినిమా నుంచి తీసేశారు - క్యాస్టింగ్ కౌచ్‌పై నోరువిప్పిన ‘తమ్ముడు’ బ్యూటీ

Aditi Govitrikar: సీనియర్ నటీమణులు అదితి గోవిత్రికర్, సుచిత్రా కృష్ణమూర్తి.. తాము పాల్గొన్న ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి బయటపెట్టారు.

మీటూ మూమెంట్ సమయంలో సినీ పరిశ్రమలోని నటీమణులు, సింగర్స్, డ్యాన్సర్స్.. ఇలా చాలామంది తాము ఎదుర్కున్న చేదు అనుభవాలను చెప్పడానికి ముందుకొచ్చారు. కేవలం అదే సమయంలో మాత్రమే కాదు.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో సందర్భాల్లో పరిశ్రమలో తాము ఎదుర్కుంటున్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను బయటపెడుతూనే ఉన్నారు నటీమణులు.. తాజాగా మరో సీనియర్ హీరోయిన్.. తాను పాల్గొన్న ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ‘తమ్ముడు’ ఫేమ్ అదితి గోవిత్రికర్.

నీకేమైనా పిచ్చా..?
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘తమ్ముడు’ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది బాలీవుడ్ భామ అదితి గోవిత్రికర్. ఆ సినిమాలో తన పాత్ర గురించి ఎక్కువమంది ప్రేక్షకులకు గుర్తులేకపోయినా.. ‘వయ్యారీ భామ నీ హింస నడక’ అంటూ సాగే తన పాట మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులందరికీ గుర్తుంది. ఇక ఈ హీరోయిన్.. తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ‘‘ఒక పెద్ద సినిమా షూటింగ్ కోసం నేను సౌత్ ఆఫ్రికా వెళ్లాను. ఆ సమయంలో ఆ వ్యక్తి అనవసరంగా హింట్స్ ఇస్తున్నాడని నేను అర్థం చేసుకోలేకపోయాను. అందుకే నేను ఎక్కువగా మాట్లాడకుండా తన మొహం మీదే నవ్వి ‘నీకైమైనా పిచ్చా?’ అని అడిగి వెళ్లిపోయాను. కానీ అలా అనడం వల్ల తన ఇగో హర్ట్ అయ్యింది. ఆ తరువాతి రోజే నా టీమ్‌ను, నన్ను ప్యాకప్ చేసుకొని చెప్పి ముంబాయ్ పంపించేశారు. ఆ సమయంలో అసలు ఏం జరిగిందో నేను అర్థం చేసుకోలేకపోయాను’’ అని బయటపెట్టింది అదితి.

సినిమా నుంచి తీసేశారు..
‘‘అప్పటికీ నేను కేవలం మూడు, నాలుగు రోజులు మాత్రమే షూట్ చేశాను. దానికోసమే నన్ను ఒక మీటింగ్‌కు పిలిచారు. ఎప్పుడూ ఏదో ఒక కారణాలు చెప్తూ ఉండేవారు. నేను సరే అనే ఊరుకునేదాన్ని. అప్పుడే నాకు అర్థమయ్యింది ఏదో జరిగిందని, అయినా కూడా నేను దేనికి ఒప్పుకోకపోవడంతో సినిమా నుంచి తీసేశారు’’ అంటూ తన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది అదితి గోవిత్రికర్. కానీ అసలు ఆ సినిమా ఏంటి, తనను ఇబ్బంది పెట్టినవారు ఎవరు అని పేర్లు మాత్రం రివీల్ చేయలేదు. ఇలాంటి ఇంటర్వూలోనే ‘కభీ హా కభీ నా’ ఫేమ్ సుచిత్రా కృష్ణమూర్తి కూడా తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి బయటపెట్టింది.

హోటల్‌లో మీటింగ్..
‘‘మేము ఒకసారి హోటల్‌లో కలిశాము. ఆ రోజుల్లో చాలా మీటింగ్స్ హోటల్స్‌లో జరిగేవి. అది కామన్. అదే సందర్భంలో నేను నా తండ్రితో చాలా క్లోజ్‌గా ఉంటాను అని ఆ వ్యక్తితో చెప్పాను. అయితే మంచిదే. ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేసి రేపు పొద్దున వస్తానని చెప్పు అన్నాడు. నాకు ఒక్కసారిగా కన్నీళ్లు ఆగలేదు. వెంటనే అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాను. ఇలాంటి విషయాలను మనకు వెంటనే అర్థం కావు. తర్వాత ఆలోచిస్తే అనిపించింది.. ఇది ఇంకా సాయంత్రమే కదా, ఆ వ్యక్తితో నేను ఉదయం వరకు ఉండి ఏం చేయాలి అని. ఆ తర్వాత అతడు అన్న మాటల వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటో నాకు అర్థమయ్యింది’’ అని సుచిత్రా వివరించింది.

Also Read: మిడ్ నైట్ to ఎర్లీ మార్నింగ్ - ఇకపై ‘యానిమల్’ 24 గంటల షోస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget