Adipurush Release LIVE: 'ఆదిపురుష్' రిలీజ్ అప్‌డేట్స్ - క్రిటిక్స్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది
Adipurush Movie Release LIVE Updates: ఆదిపురుషుడిగా ప్రభాస్ ఆగమనానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. ఏబీపీ దేశం పాఠకుల కోసం రిలీజ్ లైవ్ అప్డేట్స్...
LIVE
Background
ఆదిపురుషుడిగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఆగమనానికి మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈతరం కథానాయకులలో స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత రాముడి పాత్ర చేసినది ఆయన ఒక్కరే. 'రామాయణం చేయడం అందరికీ దొరికే అవకాశం కాదు, నీకు దొరికింది. నిజంగా నీ అదృష్టం' అని మెగాస్టార్ చిరంజీవి చెప్పారని ప్రభాస్ సంతోషం వ్యక్తం చేశారు.
తెలుగు ప్రజలకు శ్రీ రాముడు అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గుర్తుకు వస్తారు. అందువల్ల, రాముడిగా ప్రభాస్ ఎలా చేసి ఉంటారు? 'ఆదిపురుష్' ఎలా ఉంటుంది (Adipurush Review)? అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తికి మరికొన్ని గంటల్లో తెర పడనుంది.
ప్రపంచవ్యాప్తంగా త్రీడీలో విడుదల
జూన్ 16 (అనగా... శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా 'ఆదిపురుష్' త్రీడీలో విడుదల అవుతోంది. అమెరికాలో ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఏపీ, తెలంగాణలో కంటే అక్కడి ప్రేక్షకులు ముందుగా సినిమా చూడనున్నారు.
Adipurush Release Live Updates : 'ఆదిపురుష్' చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. దీని కంటే ముందు హిందీలో అజయ్ దేవగణ్ కథానాయకుడిగా 'తానాజీ' చిత్రాన్ని ఆయన తీశారు. ఇందులో సీతా దేవిగా కృతి సనన్ నటించారు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్, హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు.
ప్రభాస్ కోసం తెలుగు రైట్స్ కొన్న విశ్వప్రసాద్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాల 'ఆదిపురుష్' థియేట్రికల్ హక్కులను రూ. 165 కోట్లు ప్లస్ జీఎస్టీకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమాను ఆ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ చేయనున్న 'స్పిరిట్' రైట్స్ కూడా తీసుకోనున్నారు.
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
'ఆదిపురుష్' థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. ఆల్ ఓవర్ వరల్డ్ సుమారు 245 కోట్లకు రైట్స్ విక్రయించారని సమాచారం. రూ. 250 కోట్లు కలెక్ట్ చేస్తే గానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు. ప్రస్తుతం సినిమా మీద ఉన్న హైప్ చూస్తే... అన్ని కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు. హిట్ టాక్ వస్తే అంతకు అంత కలెక్ట్ చేయవచ్చు కూడా.
విమర్శల నుంచి ప్రశంసల వరకు...
'ఆదిపురుష్' ఫస్ట్ టీజర్ విడుదలైన తర్వాత బోలెడు విమర్శలు వచ్చాయి. కొందరు ప్రభాస్ అభిమానులు కేసుల పెదవి విరిచారు. విజువల్ ఎఫెక్ట్స్ అసలు బాలేదని చెప్పుకొచ్చారు. అటువంటి స్టేజి నుంచి సినిమా మీద హైప్ నెలకొందంటే... ఆ పాటలు, ట్రైలర్ కారణం. విజువల్ ఎఫెక్ట్స్ మీద చిత్ర బృందం గట్టిగా వర్క్ చేసింది. ఏడెనిమిది నెలలు ఓం రౌత్ అండ్ టీమ్ నిద్రపోలేదని తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ వ్యాఖ్యానించారు. 'జై శ్రీరామ్' సాంగ్ హిట్ కావడం కూడా కలిసి వచ్చింది.
'ఆదిపురుష్' థియేటర్లలో వానరుడు
'ఆదిపురుష్' థియేటర్లలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఓ ప్రాంతంలోని థియేటర్లో కోతి వచ్చింది. శ్రీరాముని సినిమాకు హనుమంతుడు వచ్చాడంటూ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
'ఆదిపురుష్' రివ్యూ - ప్రభాస్ సినిమా చూసి విమర్శలు ఏమంటున్నారంటే?
‘ఆదిపురుష్’ 3డీ టికెట్ ధరలు మామూలుగా లేవుగా..
హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ లో ఆదిపురుష్ టికెట్ ధరలు రూ.400 ( గోల్డ్+3D గ్లాస్ ) నుండి మొదలవుతున్నాయి. హైదరాబాద్ మొత్తంలోనే అత్యంత ఖరీదైన టికెట్ ధరలు ఈ థియేటర్ లోనే ఉన్నప్పటికీ టికెట్స్ మాత్రం హాట్ కేకుల్లాగా అమ్ముడవుతున్నాయి. సినీ ఫ్లెక్స్ థియేటర్స్ లోను ఇప్పటికే చాలా టికెట్లు అమ్ముడు అయ్యాయి. మిగతా మల్టీప్లెక్స్ లో టికెట్ ధరలు రూ.325(సాధారణ), రూ.325(ఎగ్జిక్యూటివ్), రూ.380(విఐపి)గా ఉన్నాయి. అటు గచ్చిబౌలిలోని ప్లాటినం మూవీ టైం సినిమా థియేటర్లో త్రీడీ సిల్వర్ క్లాస్ టికెట్ ధర రూ.325, నిజాంపేట్ లోని జిపిఆర్ లో కూడా రూ.325 (3d గోల్డ్) రూ.380 (3d సోఫా) చొప్పున విక్రయిస్తున్నారు.
‘ఆదిపురుష్’ ఎర్లీ మార్నింగ్ షోకు అనుమతి
‘ఆదిపురుష్’ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ భారత ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ దృశ్యకావ్యం సినిమాను జూన్ 16 న విడుదుల చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభం అయిపోయాయి.
అమెరికాలో 'ఆదిపురుష్' కోసం 200 కార్లతో ర్యాలీ
అమెరికాలోని పీపుల్ టెక్ గ్రూప్ నుంచి సియాటెల్ లోని సినీమార్క్ థియేటర్ వరకు ఈ రోజు మూడు గంటలకు 200 కార్లతో ర్యాలీ చేయనున్నారు.