అన్వేషించండి

Jani Master Case: లైంగిక వేధింపుల కేసు - జానీ మాస్టర్‌పై నటి పూనమ్‌ కౌర్‌ సంచలన కామెంట్స్‌

Poonam Kaur Comments: స్టార్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ లైంగిక వేధింపుల కేసుపై నటి పూనమ్‌ కౌర్‌ సీరియస్‌ అయ్యింది. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ సంచలన కామెంట్స్‌ చేసింది.

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ లైంగిక వేధింపుల కేసు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 21ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ తనని లైంగికంగా వేధించాడంటూ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ విషయం బయటకు రాగానే పలువురు సినీతారలు, మహిళా సంఘాలు ఆయనపై మండిపడుతున్నారు. అంతేకాదు బాధిత యువతి తమ మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ కేసు సింగర్‌ చిన్మయి స్పందిస్తూ బాధిత యువతికి మద్దతు తెలిపింది.

ఒక మీడియా కథనాన్ని ట్యాగ్‌ చేస్తూ చిన్మయి "నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్‌ వేధించడం ప్రారంభించాడు. ఈ కేసులో పోరాడేందుకు కావాల్సినంత శక్తి ఆ అమ్మాయికి ఉండాలని కోరుకుంటున్నాను" ఇన్‌స్టా వేదికగా స్పందించింది. తాజాగా సినీ నటి పూనమ్‌ కౌర్‌ కూడా ఈ కేసుపై స్పందించింది. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో సంచలన పోస్ట్‌ చేసింది. "ఇకపై నిందితుడు షేక్‌ జానీని మాస్టర్‌ అని పిలవకండి. మాస్టర్‌ పదానికి కాస్తా గౌరవం ఇవ్వండి" అంటూ ఆమె సిరియస్‌ అయ్యింది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

జానీ మాస్టర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా

కాగా జానీ మాస్టర్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు చెప్పిన ఆమె ముంబై, చెన్నైలో ఔట్‌ డోర్‌ షూట్స్‌కి వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అలాగే తను నివాసం ఉంటున్న నార్సింగ్‌ ఇంట్లోనూ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నార్సింగ్‌ పోలీసులు జానీపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహరంలో ఇప్పటికే ఆయనపై జనసేన వేటు వేసింది. ఫిలిం చాంబర్‌ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఆయన తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ అఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌కు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశమైన తర్వాత POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుందని  ఫిలిం ఛాంబర్‌ గౌరవ కార్యదర్శి కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. 

పెళ్లి చేసుకోవాలని వేధింపులు

ఇదిలా ఉంటే సదరు యువతి జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేస్తూ సంచలన ఆరోపణలు చేసింది. జానీ మాస్టర్‌ తనని పెళ్లి చేసుకోవాలని వేధించినట్టు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. అంతేకాదు ఎంతోకాలంగా తనని లైంగికంగా వేధిస్తున్నాడని, తన కోరిక తీర్చకుండ ఆఫర్స్‌ లేకుండ చేస్తానని బెదిరించినట్టు పేర్కొంది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడని, లేదంటే కెరీర్‌ లేకుండ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్టు ఆమె సంచలన విసయాలు వెల్లడించింది. అయితే సదరు యువతి ఆరోపణలపై ఇప్పటి వరకు జానీ స్పందించపోవడం గమనార్హం. 

Also Read: జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు - ఫిలిం ఛాంబర్‌ రియాక్షన్‌ ఇదే..!

టాప్ హెడ్ లైన్స్

Dharman Ram Pothineni : రజనీ కాంత్ 'ధర్మన్'లో రామ్ పోతినేని - పవర్ ఫుల్ యాటిట్యూడ్‌కు గ్రాండ్ వెల్‌కమ్
రజనీ కాంత్ 'ధర్మన్'లో రామ్ పోతినేని - పవర్ ఫుల్ యాటిట్యూడ్‌కు గ్రాండ్ వెల్‌కమ్
Vrushakarma Songs : సూరీడే చీకట్లో నా చూపుల్లో ఉదయించాలి - ట్రెజర్ హంటర్‌గా చై స్వాగ్... వృషకర్మ ఫస్ట్ సింగిల్ లిరిక్స్
సూరీడే చీకట్లో నా చూపుల్లో ఉదయించాలి - ట్రెజర్ హంటర్‌గా చై స్వాగ్... వృషకర్మ ఫస్ట్ సింగిల్ లిరిక్స్
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Idupu Kayitham Baraat Beat Song : నాగదుర్గ మాస్ డ్యాన్స్ - ఇడుపు కాయితం నుంచి ట్రెండింగ్‌లో వీడియో సాంగ్
నాగదుర్గ మాస్ డ్యాన్స్ - ఇడుపు కాయితం నుంచి ట్రెండింగ్‌లో వీడియో సాంగ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
CM Revanth Reddy Birthday: కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
Embed widget