Poonam Kaur: ఒక్క మహిళ కూడా లేదేంటి? - ముఖ్యమంత్రితో టాలీవుడ్ పెద్దల భేటీపై పూనమ్ ఫైర్
Poonam Kaur On Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీపై ప్రశ్నిస్తూ తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వివాదాలతో వార్తల్లో నిలిచే హీరోయిన్లలో పూనమ్ కౌర్ కూడా ఒకరు. ఆమె చేసే ఇన్ డైరెక్ట్ ట్వీట్లు, కౌంటర్లు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోనప్పటికీ, పూనమ్ కౌర్ మాత్రం తన ట్వీట్ల దాడిని ఆపట్లేదు. సినిమాలలో అవకాశాలు లేకపోయినా ఇలా వివాదాస్పద ట్వీట్లతోనే ఈ అమ్మడు వార్తల్లో నిలుస్తుంది. తాజాగా డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినీ పెద్దలకు ఎక్స్ ద్వారా సూటి ప్రశ్న వేసింది. తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పే పూనమ్, సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది. ఇప్పుడేమో సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్లిన టీంలో ఒక్క అమ్మాయి కూడా ఎందుకు లేదు? అంటూ ప్రశ్నించింది.
వివాదంపై పూనమ్ కౌర్ ట్వీట్
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట వివాదం నిన్నటిదాకా టాలీవుడ్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు నేతృత్వంలో టాలీవుడ్ పెద్దలంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డితో గురువారం నాడు భేటీ అయ్యారు. ఈ భేటీలో నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో పాటు... దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి బడా నిర్మాతలు, సాయి రాజేష్, శివ బాలాజీ, కిరణ్ అబ్బవరం సహా చిన్నా పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరూ కలిసి దాదాపు 40 మంది ఈ మీటింగ్ కు హాజరయ్యారు. కానీ అందులో టాలీవుడ్ నుంచి ఒక్క మహిళా ప్రతినిధి కూడా కనిపించలేదు. ఇదే విషయాన్ని తాజాగా పూనమ్ కౌర్ ట్వీట్ ద్వారా ప్రశ్నించింది.
ఎక్స్ లో పూనమ్ కౌర్ 'సీఎంతో సమావేశానికి తీసుకెళ్లాల్సినంత ముఖ్యమైన మహిళలు ఎవ్వరూ లేరా? మహిళలకు ఎలాంటి సమస్యలు ఉండవా? హీరోకి సమస్య వచ్చినా, లేదంటే బిజినెస్ ఇష్యూ వచ్చినా అందరూ ఏకమవుతారు. పరిశ్రమ మొత్తం నిలబడుతుంది. కానీ ఓ మహిళలకు సమస్య వస్తే ఎవ్వరూ ముందుకు రారు" అంటూ తనదైన శైలిలో ఇండస్ట్రీ పెద్దలను నిలదీసింది.
Also Read: దిల్ రాజుని అడ్డం పెట్టుకుని.. ఈ గలీజు పనులేంటి రేవంత్ రెడ్డి సార్?
No women was considered important enough to be taken for a meeting with CM , women have absolutely no issues , industry stands up when a hero has a issue or trade matters , no women has issue - none can have one .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) December 26, 2024
సీఎం రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న
ఇలా ఇండస్ట్రీ పెద్దలను నిలదీయడమే కాకుండా ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది. "సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన సామాన్య మహిళ రేవతి గురించి ఇంతగా బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ ఈ మీటింగ్ లో ఒక్క మహిళ కూడా ఎందుకు లేదు? అనే ప్రశ్న మాత్రం అడగలేక పోయారు" అంటూ కౌంటర్ వేసింది. ఇక ఎప్పటిలాగే పూనమ్ కౌర్ చేసిన ఈ పోస్టులను కొంతమంది సమర్థిస్తుంటే, మరి కొంతమంది ఆమెపై తిరిగి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఉన్న పలువురు హీరోయిన్లు ఈ వివాదంపై పెదవి విప్పుతున్నారు. పూనమ్ కౌర్ లాగే మాధవి లత కూడా ముఖ్యమంత్రిపై ఫైర్ అవుతూ కామెంట్స్ చేసింది. కాకపోతే మాధవీలత దిల్ రాజును వాడుకుని ఇలాంటి పనులేంటి? అంటూ మండిపడింది.
Read Also: 'మ్యాక్స్' రివ్యూ: మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కిచ్చా సుదీప్ - మరి సినిమా హిట్టా? ఫట్టా?