Madhavi Latha Comments: దిల్ రాజుని అడ్డం పెట్టుకుని.. ఈ గలీజు పనులేంటి రేవంత్ రెడ్డి సార్?
Madhavi Latha Shocking Comments: గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ అనంతరం నటి మాధవీ లత ఓ సంచలన వీడియోని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. సీఎం రేవంత్‌కు ఆమె కొన్ని ప్రశ్నలు సంధించారు
’’సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు... ఆ విషయంపై ఆయన ఇన్‌టైమ్‌లో స్పందించకపోవడమే పొరపాటు.. తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉంది’’ అంటూ నటి మాధవీ లత సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆమె కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ..
‘‘రేవంత్ రెడ్డి సార్‌ని కొన్ని సూటి ప్రశ్నలు అడుగుదామని అనుకుంటున్నా.. ఇప్పటికే చాలా మంది అడిగేశారు. కాస్త లేటయిపోయింది. నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల అడగలేకపోయానన్నమాట. అన్నట్లు, నిన్న మెదక్ జిల్లాలో ఒక చిన్నపాపపై అత్యాచారం చేశారంట. దాని గురించి అసెంబ్లీలో మాట్లాడతారా? ఓవైసీ, అక్బరుద్దీన్ ప్రశ్నిస్తారా? పసిపిల్ల, ఆడబిడ్డ, ప్రాణం, పాపం, అయ్యో, అబ్బాస్ తప్పు చేశాడు.. శిక్ష విధించండి.. దీనిపై ఏమంటారు రేవంత్ రెడ్డి జీ అని అడుగుతారా?
అలాగే కొడంగల్‌లో ఒక రైతు ఆత్మహత్య చేసుకుని.. దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే అని చెప్పి, లేఖ రాసి పెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడంట. మరి వాళ్ల కుటుంబానికి రూ. 25 లక్షలు ఇచ్చారా? పోనీ పాతిక వేలు ఎవరైనా ఇచ్చారా? ఆయనెవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట. ఆయన పేరు పొద్దు తిరుగుడు పువ్వు అంట. ఆ పువ్వు ఎట్ట తిరిగితే.. అట్ట తిరుగుతాడంట. మరి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ రైతు ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులని పరామర్శించి డబ్బులు ఇచ్చారా?
అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు.. ఆయనకి తెలియకుండా జరిగింది. ఆయన దాని మీద సరిగా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు. తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉంటుంది. అందరిలాగా ఆయన కూడా సామాన్య వ్యక్తే. మీకు ఎలాంటి విధులు, హక్కులు వర్తిస్తాయో.. ఆయనకీ వర్తిస్తాయి. జరిగిన చిన్న తప్పుకి సినిమా ఇండస్ట్రీ మీద ఉక్కు పాదం మోపాలి, సినిమా ఇండస్ట్రీని కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తున్నారు. ఎలా అయితే జగన్ సినిమా వాళ్లందరినీ పిలిపించుకొని ఫోజులు కొట్టి దండం పెట్టించుకున్నట్లు.. మనం సీఎం అయ్యాక ఎందుకు చేయించుకోకూడదు అని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు.
Also Read: 'మ్యాక్స్' రివ్యూ: మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కిచ్చా సుదీప్ - మరి సినిమా హిట్టా? ఫట్టా?
#WeStandWithAlluArjun
— Allu Arjun fan ikkadaa (@AAFanIkkadaa) December 26, 2024
Actress #Madhavilatha asked direct questions to Telangana CM #RevanthReddy ...🔥👏#AlluArjun #StopCheapPoliticsOnAlluArjun pic.twitter.com/dtGMavdkeZ
రేవంత్ రెడ్డి గారు మీ ప్రయాణం అంతా చాలా బాగుంది. మొదటి నుండి ఎంతో కష్టపడి పైకొచ్చి ఈరోజు సీఎం అయ్యారు. జీవితంలో చాలా చాలా సాధించారు. మరి ఎందుకిప్పుడు? ఇంత గలీజుగా బిహేవ్ చేస్తున్నారు. స్థాయికి వచ్చాక ఎందుకు ఇంత గలీజుగా బిహేవ్ చేస్తున్నారు. గురుకుల పాఠశాలల్లో ఎంతోమంది చనిపోయారు.. ఏనాడూ మాట్లాడిన పాపాన పోలేదు. అందరికీ సమానంగా స్పందించండి. ఓకేనా.. డైరెక్ట్‌గా బాధితులకు స్పందించకుండా.. సినిమా వాళ్ల మీద దిల్ రాజును అడ్డు పెట్టుకుని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. ఏం చేస్తారు.. సినిమా వాళ్ల బతుకులు అలాంటివి మరి.. వచ్చి మీ కాళ్లు మొక్కుతారు’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాధవీ లత షాకింగ్ కామెంట్స్ చేసింది.
Also Read: బేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?
ఇదిలా ఉంటే.. గురువారం సినీ ప్రముఖులు కొందరు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం, సీఎం దృష్టి అంతా.. హైదరాబాద్‌ని ఇంటర్నేషనల్ సినిమా హబ్‌గా ఎలా తీర్చిదిద్దాలనే ఆలోచనే అంటూ దిల్ రాజుతో పాటు హాజరైన వారంతా చెప్పుకొచ్చారు.