Nora Fatehi: వరుణ్ తేజ్‌తో జతకట్టనున్న నోరా ఫతేహి, మరి మీనాక్షి చౌదరి సంగతేంటి?
‘పలాస’ ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి నటించనుంది. ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
Nora Fatehi: మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస’ సినిమా ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా జులై 27 న హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ల గురించి చర్చ నడుస్తోంది. నిన్నటి వరకూ ఈ మూవీలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని అనుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఇంకో పేరు వచ్చి చేరింది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కూడా ఈ మూవీలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
‘వరుణ్ తేజ్ 14’ లో నోరా ఫతేహి..
వరుణ తేజ్ ప్రస్తుతం ‘గాంఢివ ధారి అర్జున’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ మూవీ తర్వాత వరుణ్ తేజ్ కరుణ కుమార్ ప్రాజెజ్ట్ కోసం పని చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలవుతుందని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో మెయిన్ లీడ్ గా మీనాక్షి చౌదరి కనిపించనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కూడా నటించనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ఆమె ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుందట. అలాగే ఒక స్పెషల్ సాంగ్ కు డాన్స్ చేయనుందనే టాక్ కూడా నడుస్తోంది. అయితే ఈ మూవీకు సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ టీమ్ అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు.
‘హరి హర వీరమల్లు’ సినిమాలో కూడా..
నోరా ఫతేహి దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా అతి త్వరలోనే షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ మూవీలో ప్రధాన పాత్రలో నిధి అగర్వాల్ నటిస్తుండగా మహారాణి పాత్రలో నోరా కనిపించనుందట. ఔరంగా జేబు చెల్లెలు పాత్రలో నోరా కనిపించనుందట. మొదట ఆ పాత్ర కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను అనుకున్న మూవీ టీమ్ ఆమె ప్లేస్ లో నోరా ను తీసుకున్నట్లు సమాచారం. ఇందులో ఆమె పవన్ కళ్యాణ్ పాత్రకు స్నేహితురాలిగా నటించనుందట నోరా. త్వరలో ప్రారంభం అయ్యే షూటింగ్ లో ఆమె కూడా పాల్గొననుంది.
సరికొత్త లుక్ లో వరుణ్ తేజ్..
‘పలాస’ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు కరుణ కుమార్. ఈ మూవీ తర్వాత తర్వాత ‘మెట్రో కథలు’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి సినిమాలతో ఫ్లాప్ లను అందుకున్నాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ తో సరికొత్త కథను తెరకెక్కించనున్నారట కరుణ కుమార్. ఈ సినిమా మొత్తం 1960 నాటి కాలంలో జరిగే కథ అని సమాచారం. అందుకే విజువల్స్ లో ఆనాటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట మూవీ టీమ్. అలాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ లుక్ కూడా ఇప్పటి వరకూ చేసిన సినిమాల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుందట. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read: పవన్ కళ్యాణ్ దైవాంశ సంభూతుడు, గెలిపించాలి - బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial