Pawan Kalyan - Brahmanandam : పవన్ కళ్యాణ్ దైవాంశ సంభూతుడు, గెలిపించాలి - బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు
BRO Pre Release Event Highlights : 'బ్రో' ప్రీ రిలీజ్ వేడుకలో బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశిస్తూ... చప్పట్లు కొట్టడం కాదని, జనసేనానిని గెలిపించాలని చెప్పారు.
సినిమాను సినిమాగా చూద్దామని, రాజకీయాలను అక్కడ వదిలేద్దామని 'బ్రో' ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు చెప్పారు. అయితే... ఇప్పుడు ఆయన్ను, జనసేన పార్టీ (Janasena Party)ని వేరు వేరుగా చూడలేని పరిస్థితులు కనపడుతున్నాయి. 'బ్రో' ప్రీ రిలీజ్ వేడుక (Bro Pre Release Event)కు వచ్చిన అతిథుల నోటి వెంట రాజకీయాల ప్రస్తావన వచ్చింది.
చప్పట్లు కొట్టడం కాదు... గెలిపించాలి! - బ్రహ్మానందం
'బ్రో' ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి... ''మీరు అందరూ ఇలా చప్పట్లు కొట్టడం కాదు, మీరందరూ ఆశీస్సులు అందించి పవన్ కళ్యాణ్ గారి విజయానికి అన్ని విధాలా తోడ్పడాలని కోరుకుంటున్నాను'' అని హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడగలిగిన అతి తక్కువ మందిలో తాను ఒకడినని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌కు 18, 20 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి చూస్తున్నానని బ్రహ్మానందం చెప్పారు.
పవన్ కళ్యాణ్ దైవాంశ సంభూతుడు - బ్రహ్మానందం
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి కూడా బ్రహ్మానందం మాట్లాడారు. పవన్ దైవాంశ సంభూతుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మానందం మాట్లాడుతూ ''పవన్ కళ్యాణ్ ఎంతటి మంచి మనిషి అంటే... ఆయన నవ్వు మీరంతా చూసే ఉంటారు. పత్తి కాయ పగిలినప్పుడు? తెల్లటి పత్తి బయటకు వచ్చినప్పుడు? ఆ తెల్లదనంలో ఎంతటి స్పష్టత, అందం ఉంటుందో? అంత అందంగా ఉంటుంది. మనిషి అంతా మంచితనం. మనిషి అంతా హాస్యం. ఏ రకంగా ఆయన దగ్గరకు వెళితే ఆ రకమైన దర్శనం ఇవ్వగలిగిన దైవాంశ సంభూతుడు మా పవన్ కళ్యాణ్'' అని చెప్పారు.
ఐ లవ్ యు బ్రో (పవన్) : బ్రహ్మానందం
'బ్రో' ప్రీ రిలీజ్ వేడుకలో స్పీచ్ స్టార్టింగులో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు బ్రహ్మానందం (Brahmanandam) ఐ లవ్ యు చెప్పారు. 'మిస్టర్ బ్రో... ఐ లవ్ యు బ్రో.. ఏయ్ దొంగ, ఐ లవ్ యు డా' అని బ్రహ్మానందం అంటుంటే పవన్ కళ్యాణ్ నవ్వేశారు. తనకు చాలా ఇష్టమైన వ్యక్తి, నటుడు, మంచి మనసున్న మనిషి పవన్ కళ్యాణ్ అని బ్రహ్మానందం పేర్కొన్నారు. ఆయనతో సాయి ధరమ్ తేజ్ క్యూట్ బాయ్ అన్నారు. 'బ్రో' సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
Also Read : అమెరికాలో చిరంజీవి కాలికి సర్జరీ - సమస్య ఏమిటంటే?
'బ్రో'లో పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఆయన తీసిన తమిళ హిట్ 'వినోదయ సీతం' ఆధారంగా రూపొందిన చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. తమన్ సంగీత దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు తెరకెక్కించాయి. జూలై 28న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతోంది. సాయి తేజ్ జోడీగా కేతికా శర్మ, కీలక పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు.
Also Read : ధనుష్ పాన్ ఇండియా సినిమాలో అక్కినేని నాగార్జున!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial