Actress Kranthi: అలా అన్నందుకు ఎంఎస్ నారాయణ నాపై సీరియస్ అయ్యారు - నటి క్రాంతి
Actress Kranthi About MS Narayana:ఎంఎస్ నారాయణ గురించి నటి క్రాంతి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్య్వూలో రేసు గుర్రం సెట్‌లో తనపై సీరియస్ అయ్యారంటూ ఆ సంఘటనను గుర్తు చేసుకుంది.
Actress Kranthi About MS Narayana: నటి క్రాంతి బలివాడ తెలుగు ఆడియన్స్‌కి బాగా సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. అలాగే పలు టీవీ సీరియల్లోనూ కీలక పాత్రలు చేసి బుల్లితెర ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. మరోవైపు పలు చిత్రాలకు డిబ్బింగ్ కూడా చెబుతుంది. అలా నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆమె ఎన్నో స్టార్ హీరో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. అల్లు అర్జున్ రేసు గుర్రంలో ఆమె దివంగత నటుడు, కమెడియన్ ఎంఎస్ నారాయణకు భార్యగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె ఎంఎస్ నారాయణతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంది. అలాగే ఓ సందర్భంగా తనన ఎంఎస్ నారాయణ బాగా తిట్టారంటూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకుంది.
నీకేంటి నొప్పి అని తిట్టారు.
ఈ సందర్భంగా నటి క్రాంతి మాట్లాడుతూ.. "ఎంఎస్ నారాయణ చాలా గొప్ప నటులు. సెట్‌లో ఆయన చాలా సరదాగా ఉంటారు. ఆయన కమెడియన్ కాబట్టి ఎప్పుడు ఒకే మూడ్‌ను క్యారీ చేస్తారు. అందుకే ఆయన సక్సెస్‌ఫుల్ కమెడియన్ అయ్యారు. పర్సనల్ కూడా మంచి వ్యక్తి. ఓ తండ్రి ఎలా ఉంటారో ఆయన అలా ఉంటారు. కెరీర్ పరంగా మంచి మంచి సజేషన్స్ ఇస్తుంటారు. ఒక రోజు సెట్‌లో నేను ప్రోటిన్ బిస్కెట్స్ తింటుంటే.. ఆయన అవి ప్రొటిన్ బిస్కెట్స్ అమ్మా.. రెండు, మూడు మాత్రమే తినాలి. అలా మేకాలా మే మే అంటూ తింటూనే ఉండకూడదు" అనేవారు. "అలాగే ఒకరోజు షూటింగ్‌లో అలా కూర్చుని ఉన్నాను. ఆయన నా పక్కన ఉన్నారు. ఏంటీ? సార్ ఇది ఇలా కూర్చోబెట్టారు. నాకు బోర్ కొడుతుంది. షూటింగ్ చేయాలనిపించడం లేదు అనగానే ఆయన ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.
సెట్ లో అల్లు అర్జున్ అలా ఉంటాడు
నీకేంటి నొప్పి.. ఇలా అవకాశాలు లేక బయట ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? మంచి క్యారెక్టర్ ఇచ్చి.. క్యారవాన్ ఇచ్చి మంచి డ్రెస్, మేకప్, ప్రొడక్షన్ వారు మంచి ఫుడ్ పెట్టి ఏసీ క్యారవాన్ కూర్చోబెడితే.. నటించడానికి నీకేంటి బాధ. బుద్దిగా షూటింగ్ చేస్కో. ఇంకాసారి ఇలాంటి మాటలు నా దగ్గర చెప్పోద్దు" అని కొప్పడ్డారని చెప్పింది. అలా సీరియర్స్‌తో తనకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయని చెప్పింది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెబుతూ.. "అల్లు అర్జున్ చాలా సింపుల్‌గా ఉంటారు. సాధారణం క్యారెక్టర్ ఆర్టిస్టులు.. వాళ్లు పెద్ద స్టార్స్ మనతో ఏం మాట్లాడతారులే అని అలా పక్కన కూర్చుంటాం. కానీ, అల్లు అర్జునే వచ్చి పలకరిస్తంటారు. హాయ్ అంటే నేను అల్లు అర్జున్ అంటారు. నాతో సరదాగా మాట్లాడేవారు. నేను ప్రోటిన్ బిస్కెట్స్ తింటే అవి నాకు ఇష్టమని తీసుకుని తినేవారు. అలా ఆయనే చనువు తిసుకునేవారు" అంటూ చెప్పుకొచ్చింది.
Also Read: మేకప్ రూమ్‌లో బట్టలు మార్చుకుంటుంటే అలా చేశారు, నాకు న్యాయం కావాలి - సీరియల్ నటి ఆవేదన