(Source: ECI/ABP News/ABP Majha)
Actress Kavitha: 11 ఏళ్ల వయస్సులో స్విమ్ సూట్ - ఆ విషాదం తర్వాత అమ్మ యాక్టింగ్ ఆపేయమంది: కవిత
Actress Kavitha: కవిత.. హీరోయిన్‌గా ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ మిగతావారిలాగా తనకు స్టార్ స్టేటస్ దక్కలేదు. దాని వెనుక కారణాన్ని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టారు ఈ సీనియర్ నటి.
Actress Kavitha Dasaratharaj: ఒకప్పుడు హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన నటీమణులు.. ప్రస్తుతం బుల్లితెరపై సెటిల్ అయిపోయారు. అలాంటి వారిలో కవిత కూడా ఒకరు. 11 ఏళ్లకే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన కవిత.. తర్వాత హీరోయిన్‌గా అన్ని సౌత్ భాషల్లో నటించారు. అంతే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలనాటి హీరోయిన్ల సినిమాల్లో కూడా మెరిశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కెరీర్‌లోని మొదటి రోజులను గుర్తుచేసుకున్నారు. అసలు తనకు కొందరు హీరోయిన్లుగా స్టార్‌డమ్ రాకపోవడానికి గల కారణాన్ని తన మాటల్లో బయటపెట్టారు కవిత.
ఎక్కువగా సక్సెస్..
హీరోయిన్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన మిగతా నటీమణులకు వచ్చినంత స్టార్‌డమ్ కవితకు రాలేదు. దానిపై కూడా ఆమె స్పందించారు. ‘‘ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు ఎలా ఉండేదంటే నేను చేసిన అన్ని సినిమాల్లో చాలావరకు సక్సెస్ అయ్యాయి. నేను సెలక్ట్ చేసుకున్న కథలు, పాత్రలు నాకు చాలా సక్సెస్ ఇచ్చాయి. అందుకే ఎవరైనా తొక్కేయాలనుకున్నా తొక్కేయలేరు. జయసుధ, జయప్రధ, శ్రీదేవిలాంటి వారి తర్వాత స్థానంలో నేను ఉండేదాన్ని. అలా మెల్లగా నా సక్సెస్ వల్ల టాప్ 1 స్థానాన్ని దక్కించుకునే సమయానికి మా తమ్ముడు యాక్సిడెంట్‌లో చనిపోయాడు’’ అని గుర్తుచేసుకున్నాడు కవిత.
స్టార్ స్టేటస్‌కు దగ్గర్లో ఉన్నప్పుడే..
‘‘అక్క, నేను, తమ్ముడు, చెల్లి ఉండేవాళ్లం. ఎప్పుడైతే మా తమ్ముడు చనిపోయాడో మా అమ్మ నన్ను యాక్టింగ్ ఆపేయమన్నారు. నేను కూడా మానసికంగా చాలా కృంగిపోయాను. వర్క్ చేయాలంటే చాలా కష్టం అనిపించేది. కానీ అప్పుడే స్టార్ అనే స్టేటస్‌కు దగ్గర్లో ఉన్నాను. 7 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. 17 సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నాను. కానీ ఆ పరిస్థితుల్లో చేతిలో ఉన్న 7 సినిమాలు పూర్తి చేసి 17 సినిమాల అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాను. అమ్మ లేకుండా నేను షూటింగ్స్‌కు వెళ్లడం కష్టం. నాకు సంబంధించినవి అన్నీ ఆమే చూసుకునేది. అమ్మకు చదువు లేకపోయినా అందరితో బాగా మాట్లాడి ఫ్రెండ్ అయ్యేది. ముఖ్యంగా కృష్ణ, విజయనిర్మలకు అమ్మ వంట అంటే చాలా ఇష్టం’’ అని తెలిపారు కవిత.
అమ్మ ఒప్పుకున్నారు..
తాడేపల్లిగూడెం దగ్గర గ్రామంలోని ఒక పెంకిటిల్లులో ఉండే ఆమె.. సినిమాల్లోకి వచ్చి గుర్తింపు సాధించడం చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు కవిత. తను నటిగా సౌత్ ఇండియా మొత్తం చుట్టేశానని గర్వపడ్డారు. ఇక అప్పట్లోనే స్విమ్ సూట్స్ వేసుకొని ఎక్స్‌పోజింగ్ చేసిన అతి తక్కువమంది నటీమణుల్లో కవిత కూడా ఒకరు. దానిపై ఆమె స్పందించారు. ‘‘11 ఏళ్లకు నా మొదటి సినిమాలోనే స్విమ్ సూట్ వేసుకున్నాను. ఆ ఏజ్‌కు అది వేసుకోవాలా వద్దా అనేది నాకు తెలియదు. అంతా అమ్మే చూసుకునేది. ఆమె ఒప్పుకున్నారు నేను వేసుకున్నాను. నేను చీర కట్టుకొని స్విమ్ చేస్తానని చెప్పలేను కదా.. ఎక్స్‌పోజింగ్ అని ఆలోచించకుండా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి అనుకునేదాన్ని’’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కవిత.