Chiranjeevi: చిరంజీవి చొరవతోనే హార్ట్ సర్జరీ... డిక్షనరీలో 'థాంక్స్' కంటే బెటర్ వర్డ్ దొరకట్లేదు - జర్నలిస్ట్ ప్రభు
Journalist Prabhu: సినీ జర్నలిస్ట్ ప్రభు తన ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు. చిరంజీవి గారే చోరవ తీసుకుని దగ్గరుండి తాను ఆపరేషన్‌కి వెళ్లాలా చేశారన్నారు. ఈ విషయంలో ఆయనకు థ్యాంక్స్ అనే పదం సరిపోవడం లేదు..
Journalist Prabhu Thanks to Megastar Chiranjeevi: ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. జనరల్ చెకప్ కోసం వెళ్లిన ఆయనకు హార్ట్‌లో 80 శాతం బ్లాక్స్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఈ విషయమై ఆయన మెగాస్టార్ చిరంజీవిని (Megastar Chiranjeevi) సాయం కోరగా ఆస్పత్రికి రిఫర్ చేసి వెంటనే ఆయనకు చికిత్స అందేలా చేశారు. దీంతో ఎలాంటి ఖర్చు లేకుండ సర్జరీ లేకుండా జస్ట్ స్టంట్స్ వేసి వైద్యులు ఆయనను పంపించారు. ప్రస్తుతం కోలుకుంటున్న జర్నలిస్ట్ ప్రభు స్వయంగా తన ఆరోగ్యంపై స్పందించారు. ఈ మేరకు ఆయన పత్రిక ప్రకటన ఇచ్చారు.
"గత మూడు రోజులుగా నా ఆరోగ్యం పట్ల ఆందోళన, నాపట్ల అభిమానాన్ని వ్యక్తం చేస్తూ మెసేజ్‌లు పెట్టిన.. పెడుతున్న సాటి పాత్రికేయ మిత్రులు, శ్రేయోభిలాషులందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే హాస్పిటట్‌కు వచ్చి నన్ను పరామర్శించిన ఇండస్ట్రీ పెద్దలు మురళీ మోహన్ గారికి, హీరో శ్రీకాంత్ గారు, తమ్ముడు ఉత్తేజ్‌కి అలాగే అలాగే స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించిన పాత్రికేయ మిత్రులు, ఫోన్ కాల్ ద్వారా, మెసేజ్ ల ద్వారా నన్ను పరామర్శించిన చలనచిత్ర ప్రముఖులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. స్లోగా రికవర్ అవుతున్నాను. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య లేదు. అయితే పది రోజులు విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు, కుటుంబ సభ్యులు చెప్పడం వల్ల బయటకు రాలేకపోతున్నాను" అని అన్నారు.
"ఇక విషయం చెప్పగానే మెగాస్టార్ చిరంజీవి గారు వెంటనే స్పందించడం వల్లనే నేను ఆపరేషన్‌కు వెళ్లాను. లేదంటే తర్వాత చూసుకుందాంలే అన్న చిన్న నిర్లక్ష్యం ఉండేది. కానీ ఆయన చూపించిన కన్‌సర్న్ వల్లనే ఇదంతా జరిగింది. కేవలం సెకండ్ ఒపీనియన్ కోసం ఒక మంచి డాక్టర్‌ని సజెస్ట్ చేస్తారేమో అని ఆయనకు మెసేజ్ పెట్టడం జరిగింది. కానీ ఆయన దగ్గరుండి అన్ని చూసుకున్నారు. అంతేకాదు వెంటనే నేను ఆపరేషన్ చేయించుకునేలా ఆయన నన్ను పరుగులు పెట్టించి నా ఆరోగ్యం కుదుటపడేలా చేశారు.
ఒక్క నా విషయంలోనే కాదు... మన పాత్రికేయ కుటుంబం పట్ల చిరంజీవి గారు చూపించే శ్రద్ధ గురించి నేను కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. కరోనా కష్ట కాలంలో చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన ప్రతి సహాయము జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అందాలని చిరంజీవి గారు తీసుకున్న శ్రద్ధ, చూపించిన చొరవ అందరికీ గుర్తుండే ఉంటుంది. కాబట్టి ప్రస్తుత సందర్భంలో పరిస్థితిలో 'ధన్యవాదాలు' అనే పదం నా భావాలను, భావోద్వేగాలను సూచించడానికి సరిపోదు. కానీ నాకు నిఘంటువులో 'థ్యాంక్స్' కంటే బేటర్ పదం దొరకడం లేదు. అయినా ఈ సందర్భంగా మెగాస్టార్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను" అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: నన్ను వాళ్లు మోసం చేశారు, వారి ట్రాప్‌లో పడకండి... జాగ్రత్త - జగపతి బాబు షాకింగ్ కామెంట్స్