అన్వేషించండి

Jagapathi Babu: నన్ను వాళ్లు మోసం చేశారు, వారి ట్రాప్‌లో పడకండి.. జాగ్రత్త - జగపతి బాబు షాకింగ్‌ కామెంట్స్‌

Jagapathi Babu: టాలీవుడ్‌ స్టార్ నటుడు జగపతి బాబు వారి చేతిలో దారుణంగా మోసపోయారు. ఈ మేరకు ఆయన వీడియో రిలీజ్ చేసి అసలు విషయం చెప్పారు. అంతేకాదు ఫ్యాన్స్‌, ప్రజలు కూడా జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

Jagapathi Babu Cheated by a Real Estate Company: విలక్షణ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం పవర్ఫుల్‌ విలన్‌ రోల్స్‌ చేస్తూ ఆడియన్స్‌ని అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమాలు చేస్తూ ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ని పొందారు. ఇప్పుడు విలన్‌గానూ తనదైన విలక్షణ నటనతో ఆడియన్స్‌ని మెప్పిస్తున్నారు. ఇక జగపతి బాబుకి ఇండస్ట్రీలో సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉందని చెప్పాలి.

వెండితెరపై ఆయన మ్యానరిజం, యాక్టింగ్‌ స్కిల్స్‌, స్టైల్‌కి థియేటర్లో ఈళలు పడాల్సిందే. సినిమాల్లో స్ట్రిక్ట్‌ రోల్స్‌, విలన్‌ పాత్ర చేస్తూ ఉండే జగపతి బాబు వ్యక్తిగతం విషయంలో గొప్యత పాటిస్తుంటారు. ఎలాంటి విషయంలో అయినా మోహమాటం లేకుండా తన అభిప్రాయం చెబుతుంటారు. పొలిటికల్‌ అయినా, సామాజాకి అంశాలైనా తన గోంతుని వినిపిస్తుంటారు. అలా ప్రతి విషయంలో చాలా ఖచ్చితంగా ఉండే ఆయన కొందరి చేతుల్లో మోసపోయారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది.

ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టా స్టోరీ ఓ వీడియోలో షేర్‌ చేశారు. అందులో తాను ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ చేతిలో మోసపోయానంటూ చెప్పుకొచ్చారు. "ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఇదే విషయంలో హెచ్చరించారు. ఇటీవల నేను ఓ రియల్‌ ఎస్టేట్‌ యాడ్‌లో నటించాను. నన్ను కూడా వాళ్లు మోసం చేశారు. చెక్‌ డిస్‌అలో చేశారు. చెక్‌ రాగానే ఫోటో తీసి పూర్తి వివరాలతో సహా మీకు త్వరలోనే వెల్లడిస్తా. ఇకపై ల్యాండ్‌ కొనేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. భూమి కొనేముందు రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరి అథారిటీ(రెరా) నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకుని ల్యాండ్‌ కొనండి. ఎవరి ట్రాప్‌లో పడోద్దు" అంటూ ఆయన హెచ్చరించారు.

ప్రస్తుతం ఆయన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంత పెద్ద స్టార్‌ అయినా ఆయనే మోసపోతుంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని నెటజన్లు రకరకాలుగ స్పందిస్తున్నారు. కాగా, జగపతిబాబు ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. చివరిగా ప్రభాస్‌ 'సలార్‌', మహేష్‌ బాబు 'గుంటూరు కారం‌' చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సలార్‌ 2  షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అలాగే మాస్‌ మహారాజా నెక్ట్స్‌ మూవీ 'మిస్టర్ బచ్చన్' మూవీ చేస్తున్నాడు. 

Also Read: అసెంబ్లీలోకి న‌ట సింహం, కొద‌మ సింహం... నందమూరి, కొణిదెల ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా హైప‌ర్ ఆది స్పీచ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget