Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్ కామెంట్స్
Actress Hema in Tirumala: ఇటీవల బెయిల్ నుంచి బయటకు వచ్చిన నటి హేమ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా తన అరెస్ట్‌పై ప్రశ్నించిన రిపోర్ట్‌పై ఫైర్ అయ్యింది.
Actress Hema Visits Tirumala: నటి హేమ డ్రగ్స్ కేసు ఇండస్ట్రీలో ఎంతటి సంచలనం రేపిందో అందరికి తెలిసిందే. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కేమ అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల బెయిల్‌ప బయటకు వచ్చిన ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆలయం బయట మీడియాలో మాట్లాడుతూ సెటైరికల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం హేమ కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇంతకి ఆమె ఏమన్నదంటే.. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన నటి హేమ శుక్రవారం (జూన్ 28) తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది.
ఏమో మీకే తెలియాలి..
అనంతరం ఆలయం బయటకు వచ్చిన ఆమెతో స్థానికులు సెల్ఫీ తీసుకునేందుకు ఆసక్తి చూపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దర్శనం బాగా జరిగిందని చెప్పింది. చిన్నప్పటి నుంచి నేను ఈ ఆలయానికి వస్తాను అదీ మీకు తెలుసుగా. నాకు తిరుమల ఆలయం పుట్టింటితో సమానం అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం తన అరెస్ట్‌పై మీడియా ప్రతినిథి ప్రశ్నించగా.. ఏమో మీకే తెలియాలి. రేవ్ పార్టీపై ఎన్నేన్నో కథనాలు రాశారుగా.. ఏంటన్నది నాకంటే బాగా మీకే తెలుసు" అంటూ ఇలా తన అరెస్ట్‌పై ప్రశ్నను దాటవేసింది. దీంతో హేమ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. మీడియా ప్రశ్నల నుంచి తెలివిగా తప్పించుకుందంటూ ఆమె నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
హేమ రేవ్ పార్టీ కేసు
కాగా గత మే 19న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వాసు తన పుట్టిన రోజు సందర్భంగా బెంగళూరులో గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే నటి హేమతో కూడా హాజరైంది. పార్టీలో డిజే సౌండ్ కారణంగా డిస్ట్రబైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీపై దాడి చేసిన బెంగళూరు పోలీసులు అక్కడ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే పార్టీ హాజరైన దాదాసు 120 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో నటి హేమ కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారందరి రక్తనమూనాలు సేకరించి టెస్ట్ చేయగా.. అందులో సుమారు 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడైంది. అందులో నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు పరీక్షలో తేలింది.
'మా' చర్యలు
దీంతో పోలీసులు ఆమె నోటీసులు ఇచ్చిన అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే రేవ్ పార్టీలో పట్టుబడ్డ హేమ ఆ తర్వాత చేసిన డ్రామా అంతా ఇంతా కాదు. తాను ఎక్కడికి వెళ్లలేదని, హైదరాబాద్‌లో ఓ ఫాం హౌజ్‌లో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని తన ఇంట్లో బిర్యానీ వండుతూ వీడియో షేర్ చేసి తాను ఇంట్లోనే ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేసింది. ఇక హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు పరీక్షలో తేలి ఆమె అరెస్ట్ అవ్వడంతో మా అసోషియేషన్ ఆమె సస్పెన్షన్ వేటు వేసింది. మొదట హేమకు బాసటగా నిలిచిన మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచ విష్ణు కేసులో నిజానిజాలు తేలేవరకు హేమపై ఎలాంటి చర్యలు తీసుకోమన్నారు. ఇక డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడవ్వగా అసోషియేషన్ సభ్యుల నిర్ణయం మేరకు హేమను సస్పెండ్ చేస్తున్నట్టు 'మా' నిర్ణయం తీసుకుంది.
Also Read: నేను బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నా- షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రముఖ నటి హీనా ఖాన్