అన్వేషించండి

Hebah Patel: ఆ ప్రశ్నకు హెబ్బా పటేల్ ఆగ్రహం - ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్

హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గ్రేట్ ఇండియన్ సూసైడ్' అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా హెబ్బా పటేల్ ఓ ఇంటర్వ్యూలో యాంకర్ పై కోపంతో ఇంటర్వ్యూ మధ్యలో నుంచి వెళ్ళిపోయింది.

రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'కుమారి 21ఎఫ్' సినిమాతో ఓవర్ నైట్ పాపులారిటీ దక్కించుకొని యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది హెబ్బా పటేల్. సినిమాలో తన మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా కొన్ని చిన్న సినిమాలు చేసినా అవి అంతగా సక్సెస్ కాలేదు. మళ్లీ చాలాకాలం తర్వాత నిఖిల్ సరసన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇక ఈ మధ్యకాలంలో అంతగా సినిమాల్లో కనిపించని ఈ ముద్దుగుమ్మ వచ్చిన అవకాశాన్ని అందుకొని హీరోయిన్‌గా మంచి కం బ్యాక్ కోసం ఎదురు చూస్తోంది. రీసెంట్‌గా 'ఓదెల రైల్వే స్టేషన్' అనే సినిమాతో డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టింది.

ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో రిలీజ్ అయిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ఇప్పుడు ఓటీటీలో బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్ లు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే 'గ్రేట్ ఇండియన్ సూసైడ్' (Great Indian Sucide) అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆహా ఓటీటీలో అక్టోబర్ 6 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది హెబ్బా పటేల్. అయితే ఈ ఇంటర్వ్యూలో యాంకర్ స్టార్టింగ్ లోనే మీ మూడు బావుందా? అంతా ఓకేనా? అంటూ అడగడంతో తనకు అర్థం కాలేదని హెబ్బా పటేల్ తెలిపింది.

దీంతో మరోసారి మీ మూడ్ బాగుందా? అంతా ఓకేనా? ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? అని అడగడంతో హెబ్బా పటేల్ హర్ట్ అయి మధ్యలోనే వెళ్లిపోయింది. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో చూసిన చాలామంది నెటిజన్స్ ఇదంతా ప్రాంక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ ఘటన నిజంగానే జరిగినట్లు తెలుస్తోంది. మీ మూడ్ బానే ఉందా? అని అడిగినదానికి హెబ్బా పటేల్ అలా మధ్యలో నుంచి ఎందుకు లేచి వెళ్లిపోయిందో అర్థం కాలేదు కానీ ఇది ప్రాంక్ కోసం చేసిన వీడియో కాదని చెబుతున్నారు. అయితే కొంతమంది మాత్రం పబ్లిసిటీ కోసం ఇలా ప్రాంక్ చేసి ఉంటారని, లేదంటే ఎందుకు వీడియో బయటకు వస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో క్లిప్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఇక 'గ్రేట్ ఇండియన్ సూసైడ్' వెబ్ సిరీస్ విషయానికొస్తే.. ఈ సిరీస్ ని విప్లవ్ కొనేటి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించారు. హెబ్బా పటేల్ తో పాటూ రామ్ కార్తీ, నరేశ్, పవిత్రా లోకేశ్, జయప్రకాశ్ కీలకపాత్రల్లో నటించారు. సామూహిక ఆత్యహత్యల సంఘటన ఆధారంగా 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' సిరీస్‌ను తెరకెక్కించారు. చనిపోయిన వ్యక్తిని బతికించుకునేందుకు ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఎంచుకున్న మార్గం.. వాళ్లంతా ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు? అనే అంశాలతో ఈ సిరీస్ ఉండబోతోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ వెబ్ సిరీస్‌తో హెబ్బా పటేల్ ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో చూడాలి.

Also Read : రణ్ బీర్, సాయి పల్లవి, యశ్ కాంబోలో 'రామాయణం' - 2024లో షూటింగ్ స్టార్ట్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
Embed widget