అన్వేషించండి

Deepika Padukone: దీపికా పదుకోన్‌కు బిడ్డ పుట్టబోయేది ఆ రోజే - డెలివరీ డేట్ ఇచ్చేసిన డాక్టర్లు

Deepika Padukone Delivery: హీరోయిన్ దీపికా పదుకోన్ ప్రెగ్నెంట్ అనేది తెలిసిన విషయమే. ఆవిడ డెలివరీ ఈ నెలలో అని, డాక్టర్లు డెలివరీ డేట్ కూడా ఇచ్చారని ముంబై ఇండస్ట్రీ అంటోంది.

రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ దంపతులకు జన్మించినబోయే బిడ్డ కోసం బాలీవుడ్ ఎదురు చూస్తోంది. ఫిబ్రవరిలో ఈ స్టార్ కపుల్ ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించింది. అప్పట్నుంచి సెప్టెంబర్ నెలలో పండంటి బిడ్డకు దీపిక జన్మ ఇస్తుందని అటు ఫిల్మ్ ఇండస్ట్రీ జనాలు, ఇటు ఆడియన్స్ ఓ అంచనాకు వచ్చారు. ఇప్పుడు ఆ బిడ్డ పుట్టబోయే తేదీ కూడా ఇండస్ట్రీ సర్కిళ్లలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

సెప్టెంబర్ 28న దీపికా పదుకోన్ డెలివరీ?
దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ దంపతులు తమ జీవితంలో కొత్త అధ్యాయంలో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నారని బాలీవుడ్ చెబుతోంది. అన్నీ అనుకున్న విధంగా జరిగితే ఈ నెల 28న దీపికా పదుకోన్ డెలివరీ అని ముంబై టాక్. ఆల్రెడీ సౌత్ బొంబాయిలోని ఓ ఆస్పత్రిలో డెలివరీకి ఏర్పాట్లు జరిగాయని తెలిసింది. 

మార్చి వరకు బిడ్డతో దీపిక... నో షూటింగ్స్!
డెలివరీ అయ్యాక ఆరు నెలల పాటు ఎక్కడికీ వెళ్లకూడదని దీపికా పదుకోన్ డిసైడ్ అయ్యారట. బిడ్డతో టైమ్ స్పెండ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారట. వచ్చే ఏడాది మార్చి వరకు ఆవిడ ఎటువంటి షూటింగ్స్ చేయరని ఆల్రెడీ మేనేజర్లు సినిమా దర్శక నిర్మాతలకు చెప్పినట్టు సమాచారం. ప్రెగ్నెంట్ అయిన సమయంలో కొత్త సినిమాల గురించి దీపికా పదుకోన్ ఓ నిర్ణయానికి వచ్చారు. 'కల్కి 2898 ఏడీ' ఆమె ప్రీ ప్రెగ్నెంట్ ఫిల్మ్ అని చెప్పాలి.

డెలివరీ కోసం దీపికా పదుకోన్ లండన్ వెళతారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఆ ప్రచారంలో నిజం లేదని, ముంబైలో డెలివరీకి ఏర్పాట్లు జరిగాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

పుట్టబోయేది అమ్మాయా? అబ్బాయా?
దీపికా పదుకోన్ డెలివరీ కోసం, డెలివరీ అయ్యాక శుభాకాంక్షలు చెప్పడం కోసం బాలీవుడ్ సెలబ్రిటీలు ఎదురు చూస్తుంటే... కొంత మంది నెటిజనులు ఆమెకు అబ్బాయి పుడతాడా? లేదంటే అమ్మాయి పుడుతుందా? అని కొత్త చర్చకు దారి తీశారు. ఒక్కటి మాత్రం నిజం... ఎవరు జన్మించినా పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. వాళ్లకు లేని ఆలోచనలు నెటిజనులకు ఎందుకో మరి!

Also Read: కళ్యాణ్ బాబు... నీలాంటి నాయకుడు కావాలి, నువ్వు అద్భుతాలు చెయ్యగలవ్ - తమ్ముడికి మెగాస్టార్ బర్త్‌డే విషెస్


షారుఖ్ 'మన్నత్' దగ్గరకు దీప్ వీర్ దంపతులు!
రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ దంపతులు బిడ్డ పుట్టిన తర్వాత ఇల్లు మారే ప్లాన్ చేశారట. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'మన్నత్' దగ్గరలో సుమారు 120 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన కొత్త ఇంటికి మారతారట. సముద్ర తీరం కనిపించేలా ఓ ఇల్లు కొనుగోలు చేశారని సమాచారం. మహారాష్ట్రలోని అలీబాగ్ ఏరియాలో రూ. 22 కోట్లు పెట్టి 2021లో దీప్ వీర్ దంపతులు ఓ ఇల్లు కొన్నారు. ఇప్పుడు కొన్నది రెండో ఇల్లు. 

దీపికా పదుకోన్ కొత్త సినిమాలు ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు లేవు. ఈ స్టార్ హీరోయిన్ మార్చి తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటారు. అయితే... ప్రస్తుతం రణ్వీర్ సింగ్ 'సింగం ఎగైన్', 'డాన్ 3' సినిమాలు చేస్తున్నారు.

Also Readమేమంతా ఓ కుటుంబం... ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి - బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget