అన్వేషించండి

మైనస్ 40 డిగ్రీస్‌లో ‘గామి’ షూటింగ్, అక్కడ ఆక్సిజన్ కూడా ఉండదు: చాందిని చౌదరి

Chandini Chowdary : హీరోయిన్ చాందిని చౌదరి 'గామి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీమ్ మొత్తం సినిమా కోసం పడ్డ కష్టం గురించి చెప్పింది.

Actress Chandini Chowdary Speech : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'గామి'. ఈ సినిమాలో విశ్వక్ ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నాడు. మొన్నటిదాకా కమర్షియల్ జోనర్స్ లో సినిమాలు చేసిన ఈ హీరో ఇప్పుడు 'గామి' సినిమాతో సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు. ఇందులో ఏకంగా అఘోరాగా కనిపించనున్నాడు. విద్యాధర్ ఈ సినిమాతో తెలుగు వెండితెరకి దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తున్నాడు. తెలుగమ్మాయి, హీరోయిన్ చాందిని చౌదరి ఫిమేల్ లీడ్ రోల్ చేసింది. శివరాత్రి కానుకగా మార్చి 8న విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో హీరోయిన్ చాందిని చౌదరి 'గామి' సినిమా కోసం పడ్డ కష్టం గురించి తన మాటల్లో చెప్పుకొచ్చింది.

2019లో 'గామి' జర్నీ స్టార్ట్ అయింది

"మా డైరెక్టర్ విద్యాధర్ ని 2018లో కలిశాను. మా ఇద్దరి మధ్య సినిమాల గురించి కంటే ఇతర విషయాల గురించి ఎక్కువ డిస్కషన్ నడిచేది. అక్కడినుంచి ఓ ఫ్రెండ్ షిప్ లాగా స్టార్ట్ అయింది. తర్వాత 2019లో 'గామి' స్టార్ట్ అయింది. విద్యాధర్ అతని డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ మొత్తం జర్నీలో మా అమ్మ నాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. అందుకే మా అమ్మకి థాంక్స్ చెప్పుకుంటున్నాను" అని చెప్పింది.

మైనస్ 40డిగ్రీస్ లో షూటింగ్.. ఆక్సిజన్ కూడా ఉండదు

"హిమాలయాస్‌లో మైనస్ 40 డిగ్రీస్ లో షూటింగ్ చేసాం. అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. అక్కడికి విశ్వక్, నేను వెళ్లి ఆక్సిజన్ ట్యాంక్స్ పట్టుకుని చేయాల్సిన పరిస్థితిల్లో కూడా షూటింగ్ చేశాం. ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల కళ్ళు తిరుగుతాయి, మనం ఏం మాట్లాడుతున్నామో.. నిలబడుతున్నామో, పడిపోతామో తెలియని పరిస్థితిలో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో డైలాగులు చెప్పాలి అని అనుకున్నప్పుడు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంతో సపోర్ట్ చేసింది. వాళ్ల సపోర్ట్ తోనే అలాంటి పరిస్థితుల్లోనూ సీన్స్ ని షూట్ చేసాం" అని తెలిపింది.

'గామి' చరిత్రలో మిగిలిపోయే సినిమా అవుతుంది

"జాహ్నవి అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ కి ఎప్పుడూ గ్రేట్ ఫుల్ గా ఉంటాను. ఎందుకంటే గామి ఒక హిస్టరీలో మిగిలిపోయే సినిమా అవుతుంది. మీరు చూసే అద్భుతమైన విజువల్స్ కి కారణం మా డీఓపీ విశ్వనాథ్. ఆయనతో నేను ఇప్పటికే 'మను' సినిమా చేశాను. ఒక కెమెరాతో ఎంత మ్యాజిక్ చేయొచ్చో ఆయన వర్క్ లో చూశాను" అని చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాలో విశ్వక్ సేన్, చాందిని చౌదరితో పాటూ పాటు ఎంజీ అభినయ, మహ్మద్‌ సమద్‌, దయానంద్‌ రెడ్డి, హారికా తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. వీ సెల్యూలాయిడ్‌ సమర్పణలో కార్తీక్ శబరీష్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Also Read : ఆసుపత్రిలో చేరిన అజీత్ కుమార్ - ఆందోళనలో అభిమానులు, అసలేం జరిగింది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Best Cars Under 10 Lakh: రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Best Cars Under 10 Lakh: రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
5G Smartphones Under 20000: రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
Embed widget