Actress Anjali : ‘గేమ్ ఛేంజర్’లో నా క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది: అంజలి
Actress Anjali: 'గేమ్ ఛేంజర్' సినిమాలో చేయడం తనకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు యాక్టరస్ అంజలి. 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఆమె విషయాలు చెప్పింది.
Actress Anjali About Game Changer: హారర్ కామెడి సినిమా 'గీతాంజలి'. ఆ సినిమాకి సీక్వెన్స్ 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. అంజలి, శ్రీనివాస రెడ్డి తదితరులు నటించిన' గీతాంజలి' అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అదే జోనర్ లో సెకెండ్ పార్ట్ 'గీతాంజలి మళ్లీ వచ్చింది' ఈ నెల 12న రిలీజ్ కాబోతోంది. దీంతో సినిమా టీమ్ మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. దాంట్లో భాగంగా అంజలీ వివిధ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా ఆమె రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్' సినిమా గురించి కూడా కొన్ని విషయాలు పంచుకున్నారు.
చాలా చాలా హ్యాపీగా ఉన్నాను
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా చాలా భారీ ప్రాజెక్ట్. అభిమానులు ఆ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే, ఆ సినిమాలో అంజలి కూడా ఒక రోల్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పోస్టర్ ఇటీవల తెగ వైరల్ అయ్యింది. ఆ సినిమాలో ఆమె పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నట్లుగా అర్థం అవుతోంది. ఆ రోల్ గురించి ఇలా చెప్పారు అంజలి. "గేమ్ ఛేంజర్'లో చేయడం చాలా హ్యాపీ. ఎందుకంటే మనం పెద్ద మూవీస్ చేస్తున్నప్పుడు క్యారెక్టర్ ఇంటెన్సీటీ డైల్యూట్ అవుతుంది. పెద్ద మూవీ అంటే పెద్ద పెద్ద యాక్టర్లు ఉంటారు. అన్ని క్యారెక్టర్లకి న్యాయం చేయాలి. అందరికీ స్క్రీన్ స్పేస్ ఇవ్వాల్సి వస్తుంది. పెద్ద సినిమాలో నేను అంత ఇంటెన్స్ క్యారెక్టర్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీ. చాలా సంతృప్తిగా ఉంటుంది అంటారు కదా.. ఆ పీరియడ్‌లో ఉన్నాను ఇప్పుడు. 'గేమ్ ఛేంజర్'లో నా క్యారెక్టర్ విని చాలా ఇష్టపడి ఓకే చెప్పాను. బ్యూటిఫుల్‌గా రాశారు. చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. కమర్షియల్ మూవీలో అలాంటి స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ క్రియేట్ చేయడం అనేది ఈజీ కాదు. అది అస్తమానం జరగదు. 'గేమ్ ఛేంజర్'లో జరిగింది. దానికి నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను" అని 'గేమ్ ఛేంజర్' గురించిన విశేషాలు పంచుకున్నారు అంజలి.
మ్యూజిక్ సూపర్ గా ఉంటుంది. కామెడీ కూడా..
'గీతాంజలి మళ్లీ వచ్చింది'లో మ్యూజిక్ చాలా చాలా నచ్చింది. "ప్రవీణ్ నటరాజు మ్యూజిక్ కంపోజర్. 'గీతాంజలి మళ్లీ వచ్చింది' థీమ్ మ్యూజిక్ చాలా క్యాచీగా ఉంది. సినిమాలో చాలా సార్లు వస్తుంది. డెఫనెట్‌గా ఈ మ్యూజిక్ ప్లే అయినప్పుడు ఫీల్ అనేది వస్తుంది. ఒకవైపు సూథింగ్‌గా ఉంటుంది. మరోవైపు హారర్‌గా ఉంటుంది. ఇక రైటర్ కోన వెంకట్ గురించి చెప్పాలంటే కామెడీ ట్రాక్ రాయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇంతకు ముందు ఆయన రాసిన కామెడీ గురించి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. హిలారియస్ గా ఉంటుంది. హారర్ కామెడీ కావడంతో కామెడీని ఇంకా చాలా బాగా ఎలివేట్ చేశారు. యాక్టర్స్ సపోర్ట్ కూడా ప్లస్ అయ్యింది. సునీల్, సత్య, శ్రీనివాస్ రెడ్డి అందరూ కామెడీ యాక్టర్స్ కాబట్టి ఇంకా బాగా వచ్చింది. దాన్ని బెటర్ గా డెలివరీ చేశారు" అని 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమా గురించి చెప్పారు అంజలి.
Also Read: విడాకులకు దరఖాస్తు చేసిన ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ - అలా మొదలై.. ఇలా ముగిసిన లవ్ స్టోరీ