Yash: ఏడాదిగా ఖాళీగా ఉన్న ‘కేజీఎఫ్’ స్టార్ యష్ - త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతాడట!
రాకింగ్ స్టార్ యష్ తన కొత్త ప్రాజెక్టుల గురించి చెప్పారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ‘కేజీఎఫ్’ స్టార్ తన కొత్త సినిమాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Yash: కన్నడ స్టార్ హీరో యష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ సినిమాలతో యష్ పేరు మారుమోగిపోయింది. ఒక్క కన్నడలోనే కాదు దేశవ్యాప్తంగా ఆయనకు క్రేజ్ పెరిగింది. ఈ సినిమాలతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారాయన. ‘కేజీఎఫ్’ సిరీస్ లలో మూడో పార్ట్ కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో యష్ నుంచి వచ్చే తర్వాత ప్రాజెక్టు గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ‘కేజీఎఫ్ 2’ మూవీ తర్వాత ఇప్పటి వరకూ తన నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటి అనేది యష్ ప్రకటించలేదు. ఇటీవల ఆయన కుటుంబంతో సొంతూరు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యష్.
ఏడాది దాటినా అప్డేట్ లేదు..
‘కేజీఎఫ్’ సినిమాల ప్రాంచైజీతో యష్ కు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలకు హిందీలో కూడా భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో యష్ నెక్స్ట్ ప్రాజెక్టు పై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఏప్రిల్ 14, 2022 న విడుదల అయింది. ఈ మూవీ కూడా ఫస్ట్ చాప్టర్ లానే భారీ కలెక్షన్లను వసూళ్లు చేసింది. అయితే ఈ సినిమా వచ్చి ఏడాది పైనే అయింది. ఇప్పటి వరకూ యష్ తర్వాత పిల్మ్స్ గురించి అప్డేట్ ఇవ్వలేదు. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నా మీద ఆ బాధ్యత ఉంది: యష్
తన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి మాట్లాడారు యష్. తన తరువాతి సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుసని అన్నారు. ప్రేక్షకుల అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు యష్. ఇకపై ఆలస్యం చేయనన్న ఆయన అతి త్వరలోనే తాను నటించబోయే సినిమాకు సంబంధించిన డీటైల్స్ చెప్తానని అన్నారు.
రామాయణ సినిమాపై సస్పెన్స్..
ఇదే మీడియా ఇంటరాక్షన్ లో బాలీవుడ్ ఎంట్రీ గురించి వస్తోన్న వార్తల గురించి అడగ్గా.. రూమర్స్ గురించి పెద్దగా చింతించకండి అంటూ బదలిచ్చారు యష్. త్వరలో బాలీవుడ్ లో తెరకెక్కబోతున్న రామాయణం సినిమాలో రావణుడి పాత్ర కోసం యష్ ను గతంలో సంప్రదించారు మేకర్స్. అయితే దీనిపై చర్చలు ఇంకా నడుస్తున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ కూడా యష్ తో సంప్రదింపులపై హింట్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. మరి బాలీవుడ్ రామాయణం యష్ చేస్తారా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు ‘యష్19’ సినిమాను గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ గురించి కూడా త్వరలోనే అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీ తెరకెక్కనున్న ఈ మూవీలో చాలా సర్‌ప్రైజింగ్ విషయాలు వున్నాయని సమాచారం.
Also Read: సోషల్ మీడియాలో చెర్రీ కూతురు ఫొటో లీక్? అసలు సంగతి ఇదీ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి. Join Us on Telegram: https://t.me/abpdesamofficial