Mega Grand Daughter: సోషల్ మీడియాలో చెర్రీ కూతురు ఫొటో లీక్? అసలు సంగతి ఇదీ!
గత రెండు రోజుల నుంచి రామ్ చరణ్ కూతురు ఫోటో ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇది అన్ని సోషల్ మీడియాల గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతోంది. ఆ ఫోటోలో..
Mega Grand Daughter: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన ఇటీవలే తల్లదండ్రులైన సంగతి తెలిసిందే. మంగళవారం(జూన్ 20) తెల్లవారుజామున హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి. చెర్రీ-ఉపాసనకు కుటుంబ సభ్యులు సన్నిహితులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మెగా వారసురాలు ఎంట్రీతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చరణ్-ఉపాసనలకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు చేస్తున్నారు. మరోవైపు మెగా వారసురాలిని చూడటానికి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూతురు ఫోటో ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. దీనిపై రామ్ చరణ్ డిజిటల్ మేనేజర్ శివ చెర్రీ స్పందించారు.
వైరల్ అవుతోన్న మెగా వారసురాలి ఫోటో..
చెర్రీ, ఉపాసనలకు ఆడ బిడ్డ పుట్టిందని తెలియగానే ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేవు. ఇప్పటివరకు చిరు గ్రాండ్ డాటర్ కు సంబంధించిన ఫోటోలు ఏవీ బయటకు రాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. కానీ గత రెండు రోజుల నుంచి రామ్ చరణ్ కూతురు ఫోటో ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇది అన్ని సోషల్ మీడియాల గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతోంది. ఆ ఫోటోలో ఓ చిన్న పాప ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ ఫోటో సర్క్యులేషన్ పై రామ్ చరణ్ డిజిటల్ మేనేజర్ శివ చెర్రీ స్పందించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది రామ్ చరణ్ కూతురు ఫోటో కాదని స్పష్టం చేశారు.
మంగళవారం తెల్లవారుజామున..
ఉపాసన డెలివరీ డేట్ ప్రకటించినప్పటినుంచీ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. డెలివరీకు రోజులు దగ్గరపడుతున్నకొద్దీ మెగా ఫ్యామిలీతో పాటు అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. ఇక జూన్ 20 నే ఉపాసనకు డెలివరీ అవ్వొచ్చు అనే వార్తలు కూడా వచ్చాయి. అందరూ అనుకున్నట్టుగానే మంగళవారం(జూన్ 20) తెల్లవారుజామున 4 గంటలకు ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ మేరకు అపోలో వైద్యుల బృందం హెల్త్ బులిటెన్ ను ప్రకటించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు బులిటెన్ లో పేర్కొంది. దీంతో మెగా ఇంట సంబరాలు మొదలైయ్యాయి.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ‘లిటిల్ మెగా ప్రిన్సెస్’..
మెగా స్టార్ చిరంజీవి తాను తాతయ్యను అయ్యానని తెలియగానే ఆ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ లో ఆయన ఇలా రాసుకొచ్చారు.. ‘‘లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం. నీ రాకతో మెగా ఫ్యామిలీతోపాటు కోట్లాది మందిలో ఆనందాన్ని నింపావు. రామ్ చరణ్-ఉపాసనలను తల్లిదండ్రులుగా, మమ్మల్ని గ్రాండ్ పేరెంట్స్ గా సంతోషించేలా చేశావు. ఇది మాకెంతో గర్వకారణం’’ అంటూ ట్వీట్ చేశారు చిరు. దీంతో మెగా అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత గ్రాండ్ డాటర్ ను చూడటానికి చిరంజీవి ఆసుపత్రికి వెళ్లారు. ఆ సందర్భంగా మనవరాలి రాక తమ కుటుంబానికి ఎంతో ఆనందాన్నిచ్చిందని, పాప జాతకం చాలా బాగుందని అంటున్నారని, ఆ ప్రభావం వల్లే ముందు నుంచీ తన కుటుంబంలో అన్నీ శుభాలే జరుగుతున్నాయని మురిసిపోయారు. ఇక చిరంజీవి ఎప్పుడైతే మెగా వారసురాలుకు ‘లిటిల్ మెగా ప్రిన్సెస్’ అని పేరు పెట్టారో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆ హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ లు వస్తున్నాయి. దీంతో ‘లిటిల్ మెగా ప్రిన్సెస్’ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు మెగా గ్రాండ్ డాటర్ అఫీషియల్ ఫోటో కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also Read: ఇటలీలో ప్రభాస్‌కు విల్లా? దాని అద్దెతో జీవితాంతం బతికేయొచ్చట!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial