Prabhas: ఇటలీలో ప్రభాస్‌కు విల్లా? దాని అద్దెతో జీవితాంతం బతికేయొచ్చట!
ప్రభాస్ వెకేషన్లకు ఎక్కువగా ఇటలీ వెళ్తుంటాడు. ఎప్పుడైనా సినిమాలకు విరామం దొరికితే అక్కడకి చెక్కేస్తుంటాడు ప్రభాస్. అందుకోసం..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏ లెవల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. దీనితో పాటు పలు భారీ ప్రాజెక్టుల్లో భాగం అయ్యాడు ప్రభాస్. ‘ఆదిపురుష్’ సినిమాకు గానూ ఆయన సుమారు రూ.150 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇండియాలో ఒకేసారి నాలుగు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోన్న ఏకైక హీరో ప్రభాస్ అనే చెప్పాలి. ఈ బిజీ షెడ్యూల్ లో ప్రభాస్ కాస్త విరామం తీసుకున్నాడు.
ఇటలీలో విల్లా? దాని అద్దే రూ.40 లక్షలట
ప్రభాస్ వెకేషన్లకు ఎక్కువగా ఇటలీ వెళ్తుంటాడు. ఎప్పుడైనా సినిమాలకు విరామం దొరికితే అక్కడకి చెక్కేస్తుంటాడు ప్రభాస్. అందుకోసం అక్కడ ఓ విల్లాను కూడా కొనుగోలు చేశాడనే సమాచారం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ సినిమా షూటింగ్ లలో విరామం దొరికినపుడు వెకేషన్ కోసం అక్కడికే వెళ్తాడట. అది కూడా కొద్ది మంది క్లోజ్ ఫ్రెండ్స్ తో మాత్రమే. అయితే మిగిలిన సమయాల్లో ఆ విల్లాను అక్కడ ఉండే టూరిస్ట్ లు, లోకల్స్ కు అద్దె కు ఇస్తాడట. ఇలా ఆ విల్లా నుంచి నెలకు రూ.40 లక్షలు అద్దె వస్తుందట. వాస్తవానికి ‘ఆదిపురుష్’ రిలీజ్ కు ముందు అతడు మోకాలి చికిత్స కోసం యూకే వెళ్లాడని ప్రచారం జరిగింది. కానీ అతడు వెకేషన్ కు ఇటలీ వెళ్లాడని రీసెంట్ గా తెలిసింది. ఇప్పుడు కూడా ఓ నెల రోజులు ఇటలీలోనే వెకేషన్ లో ఉంటాడని టాక్ నడుస్తోంది. అలా ప్రభాస్ ఇటలీలో కూడా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే, కొన్ని మీడియా సంస్థలు మాత్రం.. ప్రభాస్ ఆ విల్లాను కొనుగోలు చేయలేదని, రూ.40 లక్షలకు అద్దెకు తీసుకున్నాడని చెబుతున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది ప్రభాస్, అతని సన్నిహితులకే తెలియాలి.
ఓకేసారి నాలుగు పాన్ ఇండియా సినిమాలు..
ఇండియాలో పాన్ ఇండియా హీరోల్లో ప్రభాస్ కూడా ఒకడు. అలాగే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల లిస్ట్ లో కూడా ఆయన ఉన్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా ప్రభాస్ పారితోషకం తీసుకోవడం విశేషం. ఆయన ఇప్పుడు ఒకేసారి నాలుగు పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ విడుదల అయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఈ మూవీ కలెక్షన్స్ ఈ వీకెండ్ లో పుంజుకునే అవకాశం ఉందంటున్నారు. మరో వైపు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే విడుదలు సిద్దంగా ఉంది. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తోన్న ‘ప్రాజెక్ట్ కె’ ను శరవేగంగా పూర్తి చేయడానికి అవసరమైన కాల్షీట్లను ప్రభాస్ కేటాయించాల్సి ఉంది. ఇవి కాకుండా మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ అనే పాన్ ఇండియా మూవీను ఓకే చేశాడు ప్రభాస్. దీనితో పాటు సందీప్ వంగా తో ‘స్పిరిట్’ మూవీ చేయబోతున్నాడు. ఇలా వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్.
Read Also: 'కెజియఫ్' కాదు, అంతకు మించి, 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' రేంజ్‌లో 'సలార్' - శ్రియా రెడ్డి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial