Siddharth: హీరోయిన్లను కొట్టాలని, నడుము గిల్లాలని చెప్పారు... ఆ రోల్స్, ఫిల్మ్స్ రిజెక్ట్ చేశా - సిద్ధార్థ్ షాకింగ్ స్టేట్మెంట్
Siddharth : హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో నటుడు సిద్ధార్థ్ టాక్సిక్ మస్కులినిటిపై మాట్లాడారు. అలాంటి రోల్స్ రిజెక్ట్ చేయడం వల్లే ఇండస్ట్రీలో తన కెరీర్ స్లో అయ్యిందని అన్నారు.
![Siddharth: హీరోయిన్లను కొట్టాలని, నడుము గిల్లాలని చెప్పారు... ఆ రోల్స్, ఫిల్మ్స్ రిజెక్ట్ చేశా - సిద్ధార్థ్ షాకింగ్ స్టేట్మెంట్ Actor Siddharth recalls rejecting scripts that involved slapping women pinching navel Siddharth: హీరోయిన్లను కొట్టాలని, నడుము గిల్లాలని చెప్పారు... ఆ రోల్స్, ఫిల్మ్స్ రిజెక్ట్ చేశా - సిద్ధార్థ్ షాకింగ్ స్టేట్మెంట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/282bcf643a8944dcbbd64247ea7c5fc117381308489711106_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సౌత్ హీరో సిద్ధార్థ్ ఆలోచనలతో పాటు ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. సినిమాలు అన్నాక గ్లామర్, యాక్షన్, రొమాన్స్... ఇలా అన్నీ అంశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే గ్లామర్ లేకపోతే సినిమానే లేదు అన్నట్టుగా ఉంటాయి చాలా సినిమాలు. చాలా మంది దర్శక నిర్మాతలు అందుకే గ్లామర్ ను వలకబోయడానికి అడ్డు చెప్పని హీరోయిన్లకు స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ ఇస్తారు. ఇక కొంతమంది హీరోయిన్లు అయితే తమ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేకున్నా సరే, సినిమాలకు సైన్ చేసి, కేవలం గ్లామర్ కే పరిమితం అవుతారు. మరి ఇవన్నీ లేకుండా మంచి సోషల్ మెసేజ్ సినిమాలు లేవా ? అంటే... అవి కూడా ఉన్నాయి. కానీ వాటిలోనూ అన్ని సినిమాలకు ఆదరణ దక్కడం కష్టమే. కమర్షియల్ ఫార్ములా సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతారు నిర్మాతలు. ఇక అందులో హీరో హీరోయిన్ల రొమాన్స్ కూడా ఒక పార్ట్. ఇప్పుడున్న హీరోలలో చాలామంది ఇలాంటి సినిమాలనే చేస్తున్నారు. కానీ ఒకప్పుడు లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్ మాత్రం తాజాగా అమ్మాయిలను కొట్టడం, వాళ్ళ నడుము గిల్లడం వంటి స్క్రిప్ట్ లను రిజెక్ట్ చేశానని చెప్పి షాక్ ఇచ్చారు.
అందుకే కెరీర్ స్లో అయ్యింది
సిద్ధార్థ్ అనగానే తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం, ఆయన పలుమార్లు వివాదాల్లో చిక్కుకోవడం వంటివి గుర్తొస్తాయి. ఈ హీరో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ లో తన గాయని, రచయిత అయిన విద్యా రావుతో కలిసి టాక్సిక్ మస్కులినిటీ, టాక్సిక్ రోల్స్ పై మాట్లాడారు. సిద్ధార్థ్ హీరోయిన్ అదితి రావు హైదరిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె తల్లే విద్యా రావు. ఈ సందర్భంగా సిద్ధార్థ డిస్కషన్ లో భాగంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాక్సిక్ మస్కులినిటి గురించి మాట్లాడుతూ స్టీరియో టైప్ రోల్స్ ను తాను రిజెక్ట్ చేసానని సిద్ధార్థ వెల్లడించారు.
అయితే ఇలా స్టీరియో టైప్, టాక్సిక్ రోల్స్ ను రిజెక్ట్ చేయడం వల్ల కమర్షియల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరియర్ స్లో అయ్యిందని అన్నారాయన. సిద్ధార్థ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ "అమ్మాయిల్ని కొట్టడం, ఐటెం సాంగ్స్ చేయడం, హీరోయిన్ల నడుము గిల్లడం, అమ్మాయిలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పేటటువంటి స్టోరీలు, రోల్స్ ఎన్నో నా దగ్గరికి వచ్చాయి. కానీ వాటన్నింటినీ నేను రిజెక్ట్ చేసి పక్కన పెట్టాను. ఇలా రిజెక్ట్ చేయడం వల్ల నేను సినిమా ఇండస్ట్రీలో స్లో అవ్వడమే కాదు, డిఫరెంట్ గా అనిపించవచ్చు. కానీ సహజంగానే నాకు నచ్చిందే నేను చేశాను "అని అన్నారు సిద్ధార్థ్.
Also Read: బాలకృష్ణతో ఏజ్ గ్యాప్ క్వశ్చన్స్... కూల్‌గా ఇచ్చి పడేసిన 'డాకు మహారాజ్' హీరోయిన్
తెరపై ఏడవడానికే భయపడతారు
సిద్ధార్థ్ ఇంకా మాట్లాడుతూ "ఈ రోజు నేను అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేస్తానని కొంతమంది చెబుతున్నారు. మరికొంత మంది పేరెంట్స్ కి, వాళ్ళ పిల్లలకి నేను బాగా నచ్చుతున్నాను. అలా నచ్చుతున్నాను అంటే వాళ్ల పిల్లలు నా సినిమాలను 15 ఏళ్ల క్రితం నుంచి చూస్తూ ఉండొచ్చు. ఇది నిజంగా ఒక గ్రేట్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ కోట్లలో వెలకట్టలేనిది. నా చుట్టూ ఉన్నవాళ్లు అగ్రెసివ్ గా, మాకోగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. చాలామంది అబ్బాయిలు పెయిన్ ను ఫీల్ అవ్వడానికే ఆలోచిస్తుంటే, నేను స్క్రీన్ పై ఏకంగా ఏడవడం అనేది సంతోషంగా ఉంది" అంటూ ఇండస్ట్రీలోని పలు ఇంట్రెస్టింగ్ విషయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
సిద్ధార్థ కొత్త సినిమాలు
రీసెంట్ గా తమిళ్ చిత్రం 'మిస్ యూ'లో కనిపించిన సిద్ధార్థ, ఈ మూవీతో ప్రేక్షకులను నిరాశపరిచారు. త్వరలోనే నయనతార, మాధవన్ తో కలిసి సిద్ధార్థ నటించిన కొత్త మూవీ 'ది టెస్ట్' రిలీజ్ కాబోతోంది. అలాగే శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇండియన్ 3' మూవీలో కూడా సిద్ధార్థ్ కీలకపాత్రను పోషిస్తున్నారు.
Also Read: డాక్యుమెంటరీ వివాదంలో నయనతారకు షాక్... నెట్‌ఫ్లిక్స్ పిటిషన్ రిజెక్ట్ చేసిన కోర్ట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)