Pragya Jaiswal: బాలకృష్ణతో ఏజ్ గ్యాప్ క్వశ్చన్స్... కూల్‌గా ఇచ్చి పడేసిన 'డాకు మహారాజ్' హీరోయిన్
Pragya Jaiswal : సీనియర్ హీరో బాలయ్యతో కలిసి రెండు సార్లు స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఏజ్ గ్యాప్ గురించి స్పందిస్తూ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఆసక్తికరంగా సమాధానం చెప్పింది.
![Pragya Jaiswal: బాలకృష్ణతో ఏజ్ గ్యాప్ క్వశ్చన్స్... కూల్‌గా ఇచ్చి పడేసిన 'డాకు మహారాజ్' హీరోయిన్ Pragya Jaiswal addresses age gap with her Akhanda 2 Daaku Maharaaj co star Balakrishna experience of working with him twice Pragya Jaiswal: బాలకృష్ణతో ఏజ్ గ్యాప్ క్వశ్చన్స్... కూల్‌గా ఇచ్చి పడేసిన 'డాకు మహారాజ్' హీరోయిన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/cf3aa0226b74759414cd8831010bf64317381296322951106_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
స్టార్ హీరోలతో వరుసగా సినిమాలలో నటించే అవకాశం రావడం కష్టమే. ఒకవేళ అలాంటి ఛాన్స్ వచ్చిందంటే ఆ హీరోయిన్ లక్కీ అని చెప్పాలి. ఇలాంటి లక్కీ ఛాన్స్ గ్లామరస్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal)కి కలిసి వచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో కలిసి ఈ అమ్మడు వరుసగా రెండు సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ప్రగ్యా జైస్వాల్ బాలయ్యతో కలిసి వరుసగా రెండు సినిమాలు చేయడం, ఏజ్ గ్యాప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
బాలయ్యతో రెండు సినిమాలపై...
ఈ సందర్భంగా తాజాగా బాలయ్యతో రెండు సినిమాల గురించి ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ "డాకు మహారాజు మూవీ నా బర్త్ డే రోజునే రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. దీంతో ఈ ఏడాది నాకు అద్భుతంగా ప్రారంభమైందని చెప్పాలి. ఈ మూవీలో నేను చేసిన కావేరి పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. డాకు మహారాజు మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి నన్ను అందరూ 'డాకు మహారాణి' అని పిలవడం చూస్తుంటే, కావేరి పాత్ర జనాలపై ఎంత ఎఫెక్ట్ చూపించిందో అర్థమవుతుంది. ఈ సినిమా నాకు ఎంతో తృప్తినిచ్చిందని చెప్పాలి. పైగా ఈ మూవీలో ఫస్ట్ టైం గర్భిణీ పాత్రలో నటించడం మంచి ఫీలింగ్ నిచ్చింది. పుట్టబోయే బిడ్డ కోసం కావేరి చేసే పోరాటం ప్రేక్షకుల మనసులను కదిలించింది. గతంలో ఎప్పుడూ చేయని రోల్ చేయడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నా. కానీ మహిళలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో ఈ రోల్ చూస్తే అర్థమవుతుంది" అని చెప్పుకొచ్చారు ప్రగ్యా. ఇక ఈ బ్యూటీ గతంలో బాలయ్యతో కలిసి 'అఖండ' అనే సూపర్ హిట్ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.
బాలయ్య తో ఏజ్ గ్యాప్ గురించి...
ఈ నేపథ్యంలోనే బాలయ్యతో ఏజ్ గ్యాప్ గురించి కూడా ప్రగ్యా స్పందించింది. "బాలయ్య ఒక లెజెండ్. ఆయన పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది పాజిటివిటీ. ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకోవచ్చు. మనసులో మాటను నిర్మొహమాటంగా చెప్పే ఆయన, ప్రతి ఒక్కరిని ఒకేలా గౌరవిస్తారు. బాలయ్య చాలా మంచి మనిషి. అయితే రోల్ ఆధారంగా నటీనటులను ఎంపిక చేస్తారు. వయసు ఆధారంగా ఎవ్వరూ అవకాశాలు ఇవ్వరు. నేను చేయాల్సిన రోల్ కు 100% న్యాయం చేశానా లేదా ? అనేదే ఆలోచిస్తాను. అంతేగాని నా వరకు ఏజ్ అనేది అసలు సమస్య కానే కాదు" అంటూ తనకంటే ఎక్కువ ఏజ్ ఉన్న బాలయ్య తో కలిసి నటించడంపై వస్తున్న కామెంట్స్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.
Also Read: డాక్యుమెంటరీ వివాదంలో నయనతారకు షాక్... నెట్‌ఫ్లిక్స్ పిటిషన్ రిజెక్ట్ చేసిన కోర్ట్
ముచ్చటగా మూడోసారి...
'అఖండ' సినిమాలో బాలయ్యతో కలిసి నటించిన ప్రగ్యా, రెండవ సారి 'డాకు మహారాజ్'లో కూడా కన్పించింది. ఇక సీక్వెల్ 'అఖండ 2'లో కూడా ప్రగ్యా హీరోయిన్ గా నటించబోతుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ రోల్ వేరే హీరోయిన్ చేయబోతుందని అంటున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని అంటున్నారు. మరి ముచ్చటగా బాలయ్యతో కలిసి మూడోసారి నటించే ఛాన్స్ ప్రగ్యాను వరిస్తుందా లేదా అని తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)