ఆ ఐదేళ్లు నేను చెన్నైవాడిని కాదని చెప్పుకోవడమే సరిపోయేది: రానా
నటుడు దగ్గుబాటి రానా తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సినిమా ఇండస్ట్రీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే తాను నిర్మాతగా కాకుండా నటుడుగా ఎందుకు మారారో చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి రానా గురించి తెలియని వాళ్లుండరు. సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చినా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రానా. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగా మారి సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇటీవల ఆయన కొన్ని చిన్న సినిమాలను రిలీజ్ చేయడమే కాకుండా వాటికి ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. రీసెంట్ గా నటుడు తిరువీర్ నటించిన ‘పరేషాన్’ మూవీను ఆయన రిలీజ్ చేశారు. అంతే కాదు గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సినిమా ఇండస్ట్రీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే తాను నిర్మాతగా కాకుండా నటుడుగా ఎందుకు మారారో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
నిర్మాతగా పెద్ద సవాళ్లే ఎదుర్కొన్నా: రానా
ఇండస్ట్రీలో తాను నిర్మాతగా మారదామని అనుకున్నానని, కానీ అప్పుడు పెద్ద సవాలు ఎదుర్కొన్నానని అన్నారు. నిర్మాతగా తాను మొదట్లో ‘బొమ్మలాట’ అనే సినిమాను నిర్మించానని అన్నారు. ఆ సినిమాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయని చెప్పారు. అయినా ఆ సినిమా థియేటర్లలో విడుదల కాలేదని చెప్పారు. ఆడియన్స్ కు తాను చెప్పాలనుకున్న కథలను పట్టుకొని టెక్నీషియన్ల చుట్టూ రెండేళ్లపాటు తిరిగానని అయినా ఫలితం లేదని అన్నారు. నిర్మాతగా తాను అనుకున్న కథలను తీయలేకపోయానని అందుకే నటుడిగా మారల్సి వచ్చిందన్నారు. ఓ కొత్త కాన్సెప్ట్ పట్టుకొని నిర్మాతలను ఒప్పించడం చాలా కష్టమని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కొంచెం మారాయని అన్నారు.
సినిమాల విషయంలో భాషాబేధాలు లేవు..
తనకు సినిమాల విషయంలో భాషా బేధాలు లేవని అన్నారు రానా. తాను చెన్నై లో పెరిగానని తర్వాతే హైదరాబాద్ కు వచ్చామని అన్నారు. అందుకే తమిళ్, తెలుగు సినిమాలు చూస్తానని అన్నారు. మలయాళ సినిమాలు కూడా చూస్తానని, ఇంగ్లీష్ సినిమాలు కూడా ఎక్కువగానే చూస్తానని చెప్పుకొచ్చారు. భాష ఏదైనా అందులో కంటెంట్ ఉంటే ఏ భాష ప్రేక్షకులైనా ఆదరిస్తారని అన్నారు. ప్రస్తుతం సినిమాల మధ్య సరిహద్దులు చెరిగిపోయాయని అన్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ అని, రాజమౌళి లాంటి దర్శకులు ఆ పని చేయగలిగారని చెప్పారు. ఇప్పుడు ‘ప్రాజెక్ట్ కె’ లాంటి సినిమాలు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు.
చిన్న సినిమాలను అందుకే ప్రోత్సహిస్తున్న..
ఒక సినిమా కథతో నిర్మాతను ఒప్పించి సినిమా తీయాలంటే ఎంత కష్టమో తనకు కూడా తెలుసని అన్నారు. తాను నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాకే సినిమాలను నిర్మించాలని అనుకున్నానని అన్నారు. అందేకే ఇప్పుడు కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. సురేష్ ప్రొడక్షన్స్ కూడా తోడు ఉండటంతో మంచి కథలను ఎంకరేజ్ చేస్తూ వాటిని రిలీజ్ చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు సినిమాల మధ్య బేధాలు బాగా తగ్గిపోయాయని కంటెంట్ ఉంటే అది చిన్న, పెద్ద సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ కూడా కొత్త కొత్త కథలను ఆహ్వానిస్తుందని, గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పుకొచ్చారు రానా.
ఆ ఐదేళ్లు నేను చెన్నైవాడిని కాదని చెప్పుకోవడమే సరిపోయేది
తాను హిందీలో మొదటి సినిమా చేసిన తర్వాత ముంబైలో ఉంటున్నపుడు మొదటి ఐదేళ్ల పాటు తాను చెన్నై నుంచి కాదని, హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పేవాడినని అన్నారు. ఎందుకంటే అక్కడి వారికి అంతగా తేడా ఏమీ తెలియదని అన్నారు. సినిమాకు సరిహద్దులు లేవని అందుకే మనం కూడా హిందీలో సినిమాలు తీయగలం అని తెలుగు నిర్మాతలను ఒప్పించేలా తన ప్రయత్నం సాగిందన్నారు. పరిశ్రమలు ఆ పని చేస్తున్నాయి కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోవడం వలన కుదరలేదని అన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. ‘బాహుబలి’, ‘ఘాజీ’ వంటి చిత్రాలు ఆ సరిహద్దులను చెరిపేశాయని అన్నారు. ఆ రెండు సినిమాలతో పరిశ్రమలన్నీ ఒకే పరిశ్రమగా మారడం ప్రారంభించాయని చెప్పారు.
Also Read: కీర్తి సురేష్‌కు టాలీవుడ్ షాక్ - శ్రీలీలా ఎఫెక్ట్‌తో కోలీవుడ్‌కు జంప్!





















