అన్వేషించండి

Nikhil Siddhartha : మా సినిమాలో AI వాడలేదు - హీరో నిఖిల్ ట్వీట్ వైరల్... మరి ఆ మూవీ ఏది?

Nikhil Siddhartha Reaction : యంగ్ హీరో నిఖిల్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోందని. టెక్నికల్ గ్లిచ్‌తో 'స్వయంభు' హై క్వాలిటీ టీజర్ మళ్లీ అప్‌లోడ్ చేసినట్లు తెలిపారు.

Actor Nikhil Siddhartha Tweet Viral About AI : 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో నిఖిల్ హిస్టారికల్ ఎపిక్ 'స్వయంభు'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా అనుకున్నంత రెస్పాస్ రాలేదు. అయితే, టెక్నికల్ గ్లిచ్‌తో హై క్వాలిటీ టీజర్ మళ్లీ అప్ లోడ్ చేసినట్లు చెప్పారు నిఖిల్.

'స్వయంభు' టీజర్ రిలీజ్ కాగానే చాలా మంది దీన్ని 'బాహుబలి'తో పోల్చారు. అలాగే, సోషల్ మీడియా వేదికగా టీజర్ క్వాలిటీపైనా కామెంట్స్ వచ్చాయి. దీంతో మళ్లీ టీజర్ అప్‌లోడ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా నిఖిల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

'మా సినిమాలో AI వాడలేదు'

తాజాగా మరింత క్వాలిటీతో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన టీజర్ చూడాలంటూ నిఖిల్ ట్వీట్ చేశారు. 'రీసెంట్‌గా వచ్చిన ఓ సినిమాలోలాగా మా మూవీలో ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) వాడలేదు.' అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. రీసెంట్‌గా వచ్చిన ఆ మూవీ ఏంటి? నిఖిల్ ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేశారు? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ చర్చిస్తున్నారు. విజువల్ పరంగా ఏఐ ఎక్కువగా వాడిన మూవీస్ ఏంటా? అంటూ సెర్చ్ చేస్తున్నారు. మరి దీనిపై స్వయంగా నిఖిలే క్లారిటీ ఇవ్వాలి.

Also Read : 'క్వీన్'గా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యామిని - డిఫరెంట్ లవ్ స్టోరీతో క్యూరియాసిటీ పెంచేసిన టైటిల్ గ్లింప్స్

రీసెంట్‌గా సినీ ఇండస్ట్రీలో ఏఐ వినియోగం పెరిగింది. సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు ఆవిష్కరించే క్రమంలో VFXను దాటి ఏఐను కొంచెం ఎక్కువగా వాడుతున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ఇది కేవలం మూవీలోనే కాకుండా ప్రమోషన్స్ కోసం కూడా యూజ్ చేసిన సందర్భాలు మనం ఇటీవల ఎక్కువగా చూశాం. టీజర్ లాంచ్ ఈవెంట్‌లోనూ AI వినియోగంపై నిఖిల్ రియాక్ట్ అయ్యారు. ఇలాంటి భారీ స్థాయి సినిమాలకు ఏఐ బాగుండదని అభిప్రాయపడ్డారు.

'స్వయంభు' టీజర్ ఎలా ఉందంటే?

'స్వయంభు' టీజర్‌లో హీరో ఎలివేషన్ నుంచి అద్భుతమైన విజువల్స్ ఆకట్టుకున్నాయి. రాజులు, రాజ్యాలు, యాక్షన్ సీక్వెన్స్ నిజంగా గూస్ బంప్స్ తెప్పించాయి. 'కాలం కత్తై దూస్తే... కాపాడే కవచం ఒకటి కావాలి కదా' అనే డైలాగ్‌తో హీరో ఎంట్రీ ఇవ్వగా... ఆయన సెంగోలి పాత్రలో పవర్ ఫుల్ వారియర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణ యువకుడు యోధుడిలా మారేందుకు ఇన్‌స్పిరేషన్ ఏంటి? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఈ మూవీకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా... నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. 'బాహుబలి', 'RRR' వంటి మూవీస్‌కు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన సెంథిల్ కుమార్ ఈ మూవీకి వర్క్ చేశారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో ఏప్రిల్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
Embed widget