అన్వేషించండి

Jana Nayagan : విజయ్ 'జన నాయగన్' రిలీజ్ ఎప్పుడు? - సెన్సార్ కాంట్రవర్సీకి చెక్ పడేనా!

Jana Nayagan Release Date : కోలీవుడ్ స్టార్ విజయ్ 'జన నాయగన్' మూవీ రిలీజ్ ఎప్పుడనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ 30 లోపు మూవీ రిలీజ్ కాదని తెలుస్తోంది.

Thalapathy Vijay Jana Nayagan Delayed Again : కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ హీరోగా నటించిన లాస్ట్ మూవీ 'జన నాయగన్' ఇప్పట్లో రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. జనవరి 9న రిలీజ్ కావాల్సిన సినిమా సెన్సార్ వివాదాలతో ఆలస్యమైంది. చిత్ర నిర్మాణ సంస్థ కేసు వెనక్కి తీసుకోవడంతో సెన్సార్ బోర్డు మూవీని రివైజింగ్ కమిటీకి పంపిన నేపథ్యంలో మార్చిలో విడుదలవుతుందని అంతా భావించారు. అయితే, ఫ్యాన్స్‌కు మాత్రం మళ్లీ నిరాశే మిగిలింది.

ఏప్రిల్‌లోనూ కష్టమే...

అయితే, ఏప్రిల్‌లోనూ 'జన నాయగన్' రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. కెనడాలోని ఇండియన్ సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేసే 'యార్క్ సినిమాస్' సంస్థ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. 'జన నాయగన్ ఏప్రిల్ 30 లోపు రిలీజ్ కాదనే విషయాన్ని అంతా గమనించగలరు. సినిమా టికెట్స్ బుక్ చేసుకుని ఇంకా రిఫండ్ పొందని వారు సంబంధిత థియేటర్ల యాజమాన్యాలను అప్రోచ్ కావొచ్చు.' అంటూ పేర్కొంది. దీంతో మూవీ సెన్సార్ వివాదం ఇంకా క్లియర్ కాలేదని తెలుస్తోంది.

Also Read : నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 14కి మళ్ళీ వస్తాం... 'కపుల్ ఫ్రెండ్లీ' జంటతో కొత్త సినిమా - సక్సెస్‌ మీట్‌లో బిగ్ అప్డేట్

వారం రోజుల్లోనే అనుకున్నా...

'జన నాయగన్'ను సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి పంపాలన్న నిర్ణయంపై చిత్ర నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది. అయితే, కోర్టులో సెన్సార్ బోర్డుకు అనుకూలంగా తీర్పు రావడంతో ఆ కేసును వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో మూవీని సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి పంపింది. వారం రోజుల్లోనే కాంట్రవర్సీ క్లియరై సెన్సార్ సర్టిఫికెట్ వస్తుందనుకున్న తరుణంలో ఆ అవకాశాలు కనిపించడం లేదు. దీనిపై నిర్మాణ సంస్థ రియాక్ట్ కావడం లేదు. తాజాగా కెనడాలో డిస్ట్రిబ్యూట్ సంస్థ చేసిన ప్రకటనతో 'జన నాయగన్' సమ్మర్ తర్వాతే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. 

అసలేం జరిగింది?

సెన్సార్ బోర్డు ముందుగా మూవీకి U/A సర్టిఫికెట్ జారీ చేసి ఆ తర్వాత రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించింది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ కోర్టును ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ అనుకూలంగా తీర్పు ఇచ్చినా... సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించడంతో అక్కడ చుక్కెదురైంది. సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా డివిజన్ బెంచ్‌లోనే తేల్చుకోవాలని సూచించింది. దీంతో కేసును వెనక్కి తీసుకుని మూవీని రివైజింగ్ కమిటీకి పంపారు. అయితే, ఆ తర్వాత సెన్సార్ సర్టిఫికెట్‌పై కానీ మూవీ రిలీజ్‌పై కానీ ఎలాంటి అప్డేట్ లేదు. 

ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా... విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. ప్రేమలు ఫేం మమితా బైజు కీలకపాత్ర పోషించారు. వీరితో పాటే బాబీ డియోల్, నరైన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా... KVN ప్రొడక్షన్స్ బ్యానర్‍పై వెంకట్ కె నారాయణ నిర్మించారు. విజయ్ చివరి మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Aamir Khan Net Worth: వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Express Hari: మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి
మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Embed widget