అన్వేషించండి

Murali Mohan: శ్రీదేవి హీరోయిన్‌గా ఫస్ట్ మూవీ.. షూటింగ్‌లో చిన్నారి మరణం - షాకింగ్ విషయాలు చెప్పిన మురళీ మోహన్

తన సినీ కెరీర్ లో జరిగిన రెండు ఘటనలను షాక్ కి గురి చేశాయని సీనియర్ నటుడు మురళీ మోహన్ వెల్లడించారు. ఆ రెండు ఇన్సిడెంట్లలో ఇద్దరి ప్రాణాలు పోయాయన్నారు. ఇప్పటికీ ఆ ఘటనలను మర్చిపోలేనన్నారు.

Murali Mohan: తన సినీ కెరీర్‌లో ఎన్నో ప్రమాదాలను చూశానని, కానీ రెండు ఇన్సిడెంట్లను అస్సలు మర్చిపోలేనని చెప్పారు సీనియర్ నటుడు మురళీ మోహన్. అప్పట్లో సినిమా షూటింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్లమని చెప్పారు. అయినా, కొన్నిసార్లు ఊహించని పరిణామాలు జరిగాయన్నారు. దర్శకుడు దాసరి నారాయణరావుతో సినిమాలు చేస్తున్నప్పుడు రెండు సంఘటనలు తమను షాక్‌కు గురి చేశాయన్నారు.

శ్రీదేవి తొలి సినిమా షూటింగ్ లో చిన్నారి మృతి

శ్రీదేవి హీరోయిన్‌గా చేస్తున్న తొలి సినిమా షూటింగ్ సమయంలో పాప చనిపోవడం బాధను కలిగించిందన్నారు మురళీ మోహన్. “దాసరి నారాయణరావుతో చేసిన రెండు సినిమాల్లో రెండు పెద్ద ప్రమాదాలను చవి చూశాను. వాటిని ఇప్పటి వరకు మర్చిపోలేను. ‘బంగారక్క‘ అనే ఓ సినిమా చేశాం. శ్రీదేవి హీరోయిన్‌గా మొదటి సినిమా. నేను హీరోగా చేశాను. ఈ సినిమాలో ఆమె మెచూరిటీ లేని అమ్మాయిలా కనిపిస్తుంది. చుట్టూ పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. ఆమె చుట్టూ ఉండేందుకు ఓ జూనియర్ ఆర్టిస్టు పిల్లలను తీసుకొచ్చేవాడు. ఓ రోజు అవుడ్ డోర్ షూటింగ్‌కు వెళ్లాం. సినిమాలో నటించాల్సిన పిల్లలతో పాటు ఓ చిన్న పాప వచ్చింది. షూటింగ్ చూడాలని వచ్చింది. మేం తీసుకొచ్చిన పిల్లల లిస్టులో ఆమె లేదు. మేం తీసుకొచ్చిన వాళ్లు అందరూ వచ్చారా? లేదా? అని చూసుకున్నాం. అందరూ సరిగానే ఉన్నారు. వారిని ప్రొడక్షన్ వాళ్లు జాగ్రత్తగానే చూసుకున్నారు. సాయంత్రం.. ఓ వ్యక్తి వచ్చి మా అమ్మాయి కనిపించడం లేదన్నారు. మీ అమ్మాయి మా సినిమాలో లేదు కదా అన్నాం. ఇంకో పాప ఉందండి, ఆమెతో పాటు ఈ పాప కూడా వచ్చిందన్నారు. చెరువులో యాక్ట్ చేశారు. ఆ తర్వాత కనిపించలేదన్నారు. వెంటనే జనాలను తీసుకొచ్చి వెతికితే పాప బురదలో కూరుకుపోయి ఉంది. మేమంతా అప్ సెట్ అయ్యాం. మాకు తెలియకుండా ఆ ఘటన జరిగింది. అందరం చాలా బాధపడ్డాం.

రైలు తగిలి నటుడు ఏవీ చలం మృతి

“నేను, ఏవీ చలం కలిసి దాసరి గారి దగ్గర ‘అద్దాల మేడ’ సినిమా చేస్తున్నాం. మద్రాసులో ఎక్కడో దూరంగా షూట్ చేస్తున్నాం. ప్రతి రోజు అతడు మాతో పాటు కలిసి వచ్చేవాడు. ఆ రోజు రాలేదు. అతడికి వేరే షూటింగ్ ఉంటే చెప్పి పర్మీషన్ తీసుకునేవాడు. కానీ, ఆ రోజు ఎవరికీ చెప్పలేదు. మధ్యాహ్నం వరకు చూశాం, రాలేదు. దాసరి గారు అప్పటికీ అంటూనే ఉన్నారు. మధ్యాహ్నం అయ్యింది రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదంటున్నారు. ఇంటికి ఫోన్ చేశాం. రాత్రి మీ దగ్గరికే వస్తానని చెప్పి బయల్దేరారండీ అన్నారు. ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. దాసరి గారు అందరికీ చెప్పి, మిగతా కంపెనీలో పని చేస్తున్నాడో వెతకండి అన్నారు. ఎక్కడా అతడు కనిపించలేదు. సమీపంలోని ఓ వ్యక్తి వచ్చి రైల్వే ట్రాక్ దగ్గర ఓ వ్యక్తి కనిపించాడండీ, ఫేస్ కనిపించడం లేదు. చూడ్డాని గూర్ఖాలా ఉన్నాడని చెప్పాడు. ఇంటికి ఫోన్ చేసి రాత్రి ఏ డ్రెస్ వేసుకున్నాడు? అని అడిగితే, ఖాకీ డ్రెస్ వేసుకున్నాడని చెప్పారు. బాడీ రైల్వే స్టేషన్ దగ్గర హాస్పిటల్ లో ఉంచారు. నేను, మోహన్ బాబు వెళ్లి చూస్తే, చలం డెడ్ బాడీ. షాక్ అయ్యాం. మరుసటి రోజు ఆయన అంతిమ యాత్రను దాసరి గారు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఘన వీడ్కోలు పలికాం. సాంబ్రానీ పొగలు వేశాం. కొన్ని ఏళ్ల వరకు అగర్ బత్తి పొగ పీల్చితే ఆ డెడ్ బాడీ గుర్తుకు వచ్చేది” అన్నారు.

Read Alos: వివాదంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సాంగ్, పూరీ జగన్నాథ్ పై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం? కారణం ఏంటో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget