By: ABP Desam | Updated at : 25 Feb 2023 11:01 AM (IST)
గణనాథుని మండపంలో మంచు మనోజ్, మౌనిక తదితరులు
తెలుగు ప్రేక్షకులకు, చిత్రసీమ ప్రముఖులకు మంచు మనోజ్ (Manchu Manoj) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కలెక్షన్ కింగ్, డా. మంచు మోహన్ బాబు రెండో కుమారుడిగా ఆయన అందరికీ తెలుసు. హీరోగానూ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కెరీర్ చూస్తే రోలర్ కోస్టర్ రైడ్ కింద ఉంటుంది. అయితే, జయాపజయాలకు అతీతంగా ఆయన పేరు, గుర్తింపు సొంతం చేసుకున్నారు.
మంచు మనోజ్ వ్యక్తిగత జీవితం కూడా రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పాలి. ఎందుకు అంటే... మొదటి పెళ్లి ఆయనకు కలిసి రాలేదు. గతంలో ప్రణతి రెడ్డిని మనోజ్ ప్రేమించారు. వాళ్ళిద్దరూ 2015లో పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. తమ దారులు వేర్వేరు అంటూ 2019లో విడిపోయారు. విడాకుల తర్వాత చాలా రోజులు మనోజ్ ఒంటరిగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం రాయలసీమకు చెందిన బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన భౌమ నాగ మౌనికతో ఆయన ప్రేమలో పడ్డారని తెలిసింది.
భూమా మౌనిక రెడ్డితో జంటగా తిరిగిన మనోజ్!
మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ తొలి వారంలో భాగ్య నగరంలోని సీతాఫల్ మండిలోని వినాయక మండపంలో జంటగా కనిపించారు. ఆ సమయంలో గణనాథుడికి పూజలు చేశారు. అప్పుడే ప్రేమ విషయం బయటకు వచ్చింది. అప్పుడు పెళ్లి గురించి ప్రశ్నించగా... అది తన వ్యక్తిగత విషయం అని చెప్పారు. ఆ తర్వాత డిసెంబర్ నెలలో కడప దర్గాను మనోజ్ సందర్శించారు. అక్కడ కొత్త జీవితం ప్రారంభించనున్నట్టు, త్వరలో కొత్త కుటుంబంతో కడప దర్గాకు మళ్ళీ రావాలని ఉన్నట్టు ఆయన తెలిపారు. అప్పుడు మనోజ్, భూమిక పెళ్లి చేసుకుంటారనే స్పష్టత వచ్చింది.
మార్చి 3న మనోజ్ - మౌనిక పెళ్లి!?
మార్చి తొలి వారంలో భూమా నాగ మౌనిక రెడ్డి మెడలో మంచు మనోజ్ మూడు ముడులు వేయనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. వీళ్ళిద్దరూ ఏడు అడుగులు వేయడానికి ఇరువురి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట!
Also Read : 'బ్లాక్ పాంథర్', 'బ్యాట్ మ్యాన్', 'టాప్ గన్'ను వెనక్కి నెట్టి మరీ 'ఆర్ఆర్ఆర్'కు అవార్డు
ఎవరీ భూమా మౌనిక?
రాయలసీమలో బలమైన రాజకీయ నేపథ్యం కల భూమా నాగి రెడ్డి, శోభా రెడ్డి దంపతుల రెండో కుమార్తె నాగ మౌనిక. తల్లిదండ్రుల మరణం తర్వాత పిల్లలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాగి రెడ్డి, శోభా రెడ్డిల మొదటి కుమార్తె అఖిల ప్రియ రాజకీయాల్లోకి రాగా... కష్టకాలంలో అక్కకు అండగా నిలిబడుతూ, తమ నియోజకవర్గంలో కార్యకర్తలతో నిత్యం మౌనిక టచ్ లో ఉంటున్నారు. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి.
Also Read : టాప్ ప్లేసులో 'ఆర్ఆర్ఆర్' - ఐదు అవార్డులతో సత్తా చాటిన 'ఆర్ఆర్ఆర్'
Shastipoorthi Movie : మళ్ళీ 'లేడీస్ టైలర్' జోడీ - 37 ఏళ్ళ తర్వాత 'షష్టిపూర్తి'తో!
NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు
Sreeleela Role In NBK 108 : బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు - అసలు నిజం ఏమిటంటే?
Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!
Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి
Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ
PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!
BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్
Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...