(Source: ECI/ABP News/ABP Majha)
RRR Wins Action Film In HCA : 'బ్లాక్ పాంథర్', 'బ్యాట్ మ్యాన్', 'టాప్ గన్'ను వెనక్కి నెట్టి మరీ 'ఆర్ఆర్ఆర్'కు అవార్డు
'ఆర్ఆర్ఆర్' యాక్షన్ హాలీవుడ్ క్రిటిక్స్‌కు విపరీతంగా నచ్చింది. పాపులర్ హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్స్ 'బ్లాక్ పాంథర్', 'బ్యాట్ మ్యాన్', 'టాప్ గన్' సినిమాలను వెనక్కి నెట్టి మరీ అవార్డు ఇచ్చారు.
హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ అడ్వాన్స్డ్‌గా ఉంటాయ్! ఆ విషయంలో ఎవరికి అయినా సరే మరో సందేహం అవసరం లేదు. యాక్షన్ కంటే ఎమోషన్ ముఖ్యం అని దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతి సినిమాతో నిరూపిస్తూ వస్తున్నారు. జస్ట్ ఫర్ యాక్షన్ అంటే యాక్షన్ అన్నట్లు ఆయన సినిమాల్లో ఫైట్లు ఉండవు. హీరో ఫైట్ చేయడానికి బలమైన ఎమోషన్ ఉంటుంది. బహుశా... ఆ ఎమోషన్ హాలీవుడ్ క్రిటిక్స్‌కు విపరీతంగా నచ్చినట్టుంది. అందుకని, యాక్షన్ కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్'కు రెండు అవార్డులు ఇచ్చారు.
'ఆర్ఆర్ఆర్'కుబెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అవార్డు
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA Awards 2023) అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాకు 'బెస్ట్ యాక్షన్ ఫిల్మ్' అవార్డు వచ్చింది. ఈ కేటగిరీలో ఏరియల్ కంబాట్ ఫిల్మ్ 'టాప్ గన్ : మేవరిక్', 'బ్లాక్ పాంథర్', 'బ్యాట్ మ్యాన్', 'విమెన్ కింగ్' ఉన్నాయి. ఆ సినిమాలను వెనక్కి నెట్టి మరీ 'ఆర్ఆర్ఆర్' అవార్డు సొంతం చేసుకుంది.
'నాటు నాటు...'కు & స్టంట్స్ కూడా
'హెచ్.సి.ఎ'లో 'నాటు నాటు...'కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్, ఇంకా స్టంట్స్ విషయంలో కూడా అవార్డు వచ్చింది. అంతర్జాతీయ అవార్డు వేదికలపై 'ఆర్ఆర్ఆర్' జైత్ర యాత్ర కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే పలు అవార్డులు, బాక్సాఫీస్ బరిలో కలెక్షన్ల రివార్డులు కొల్లగొట్టిన దర్శక ధీరుడు రాజమౌళి సినిమా... అవార్డుల విషయంలో కూడా వెనకడుగు వేయడం లేదు. మరింత ముందుకు దూసుకు వెళుతోంది.
'ఆర్ఆర్ఆర్' స్టంట్స్ మెచ్చిన 'హెచ్.సిఎ'
'ఆర్ఆర్ఆర్' సినిమాలో స్టంట్స్, యాక్షన్ సీక్వెన్సులు చూసి ప్రేక్షకులు 'ఔరా' అని ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు అడవి ప్రాణులతో ఎన్టీఆర్ దూకే సన్నివేశం గానీ, పతాక సన్నివేశాలకు అల్లూరి సీతారామ రాజు వేషధారణలో రామ్ చరణ్ బాణాలు వేసే సన్నివేశం గానీ అద్భుతం అని చెప్పాలి.
'బెస్ట్ స్టంట్స్'కు అవార్డు అందుకున్న అనంతరం దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మాట్లాడుతూ ''మా సినిమాలో స్టంట్స్ గుర్తించి అవార్డు ఇచ్చిన 'హెచ్.సి.ఎ'కు థాంక్స్. నేను ముందుగా మా యాక్షన్ కొరియోగ్రాఫర్లకు థాంక్స్. స్టంట్స్ కంపోజ్ చేయడానికి సాల్మన్ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులలో కొన్ని తీయడానికి జూజీ హెల్ప్ చేశారు. ఇతర స్టంట్ కొరియోగ్రాఫర్లు కూడా ఇండియా వచ్చి మా విజన్ అర్థం చేసుకుని, మా వర్కింగ్ స్టైల్ అర్థం చేసుకుని పని చేశారు. మా హీరోలు, వండర్ ఫుల్ యాక్టర్లు ఎన్టీఆర్, రామ్ చరణ్ కు థాంక్స్. రెండు మూడు షాట్స్ లో మాత్రమే బాడీ డబుల్ ఉపయోగించాం. మిగతా యాక్షన్ సీన్లు అన్నిటిలో వాళ్ళు సొంతంగా చేశారు. మా చిత్ర బృందానికి కూడా థాంక్స్. చివరగా... నా భారత దేశం ఎన్నో కథలకు పుట్టినిల్లు. మేరా భారత్ మహాన్'' అని అన్నారు. 'బెస్ట్ యాక్షన్ ఫిల్మ్' అవార్డు అందుకున్న అనంతరం ఆల్రెడీ తాను గాల్లో విహరిస్తున్నాని తెలిపారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ కొరియోగ్రాఫర్లు అందరికీ థాంక్స్ చెప్పారు.
Also Read : కార్లలో నిద్రపోయిన రోజులున్నాయి - తారకరత్న భార్య అలేఖ్య ఎమోషనల్ పోస్టు!
రాజమౌళితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ తదితరులు అవార్డయి వేడుకకు వెళ్లారు.
Also Read : హిట్టు కొట్టి ఏం లాభం రాజా.. సైలెంట్ అయిపోయిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్..!