అన్వేషించండి
Advertisement
HCA Awards 2023 : టాప్ ప్లేసులో 'ఆర్ఆర్ఆర్' - ఐదు అవార్డులతో సత్తా చాటిన 'ఆర్ఆర్ఆర్'
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మెచ్చిన సినిమా ఏదో తెలుసా? దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్'. ఈ రోజు జరిగిన అవార్డు వేడుకలో మన సినిమా సత్తా చాటింది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో, ఆ మాటకు వస్తే మన భారతీయ చిత్రసీమలో అపజయం ఎరగని దర్శకుడు ఎవరు? అంటే ఆ తరం, ఈ తరం అని వేరు చేసి చూడాల్సిన అవసరం లేదు... ప్రేక్షకులు అందరూ ముక్త కంఠంతో చెప్పే ఏకైక పేరు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli). ఆయన్ను 'జక్కన్న' అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముద్దుగా పిలుస్తారు. ప్రేక్షక లోకం అయితే 'దర్శక ధీరుడు' అంటోంది.
ఇప్పుడు మన దర్శక ధీరుడు రాజమౌళి పేరు భారత దేశంలో మాత్రమే కాదు, పలు అంతర్జాతీయ వేదికలపై వినబడుతోంది. గత ఏడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన విజువల్ వండర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ & యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆయన తీసిన 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రానికి హాలీవుడ్ లోకం సలామ్ అంటోంది. ఇప్పటికే ఈ సినిమా పలు అవార్డులు నెగ్గింది.
'హెచ్.సి.ఎ'లో ఐదు అవార్డులు
అమెరికాలో ఈ రోజు జరిగిన 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' (HCA Awards 2023) అవార్డుల్లో సైతం 'ఆర్ఆర్ఆర్' సత్తా చాటింది. మొత్తం మీద ఈ సినిమాకు ఐదు పురస్కారాలు వచ్చాయి. అవి ఏమిటి?
ఇంటర్నేషనల్ ఫిల్మ్ & యాక్షన్ ఫిల్మ్ కూడా!
'ఆర్ఆర్ఆర్'కు వచ్చిన అవార్డుల్లో ముఖ్యమైనవి 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్' & 'బెస్ట్ యాక్షన్ ఫిల్మ్'. ఈ రెండు విభాగాల్లో అంతర్జాతీయంగా భారీ వసూళ్ళు సాధించిన, ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాలు ఉన్నాయి. వాటిని వెనక్కి నెట్టి మరీ 'ఆర్ఆర్ఆర్'కు అవార్డులు ఇచ్చారు. బెస్ట్ స్టంట్స్ విభాగంలో కూడా 'ఆర్ఆర్ఆర్' అవార్డు అందుకుంది.
'నాటు నాటు...'కు మరో అవార్డు!
'ఆర్ఆర్ఆర్'లో 'నాటు నాటు...' పాటను, అందులో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్... ఇద్దరూ వేసిన స్టెప్పులను అంత సులభంగా మర్చిపోగలమా? ఆ పాట హాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఆల్రెడీ 'గోల్డెన్ గ్లోబ్' అవార్డు వచ్చింది. ఆస్కార్ నామినేషన్ అందుకుంది. ఇప్పుడు ఆ పాటకు 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డు కూడా వచ్చింది.
'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' నుంచి 'ఆర్ఆర్ఆర్'కు వచ్చిన మరో పురస్కారం... హెచ్.సి.ఎ స్పాట్ లైట్ అవార్డు. గత ఏడాది డిసెంబర్ తొలి వారంలో ఆ అవార్డు అనౌన్స్ చేశారు. దానిని ఈ రోజు అందజేశారు. ఆ అవార్డు తీసుకోవడానికి రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణి, సెంథిల్ కుమార్ స్టేజి మీదకు వెళ్ళారు.
'హెచ్.సి.ఎ' స్పాట్ లైట్ అవార్డు అందుకున్న తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి మాట్లాడుతూ ''మా 'ఆర్ఆర్ఆర్' కథా రచయిత, మా నాన్నగారు విజయేంద్ర ప్రసాద్... సంగీత దర్శకుడు, మా అన్నయ్య ఎం.ఎం. కీరవాణికి థాంక్స్. అలాగే, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ కి కూడా! ఇతను మా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్. మేం ఎనిమిది సినిమాలకు కలిసి పని చేశాం. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, కాస్ట్యూమ్ డిజైనర్ రామ, ఇతరులు అందరికీ థాంక్స్. మా రామ్ (అల్లూరి సీతారామ రాజుగా నటించిన రామ్ చరణ్), నా భీమ్ (కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్) మూడేళ్ళు ఈ సినిమా కోసం తమ విలువైన సమయాన్ని కేటాయించారు. అందరికీ థాంక్స్'' అని అన్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
ఎంటర్టైన్మెంట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion