అన్వేషించండి

Manchu Vishnu: ‘భక్త కన్నప్ప’గా మంచు విష్ణు పాన్ ఇండియా మూవీ - వామ్మో, భారీ బడ్జెట్టే!

కృష్ణంరాజు నటించిన సూపర్ హిట్ మూవీ ‘భక్త కన్నప్ప’ను రీమేక్ చేయబోతున్నట్లు మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు. వచ్చే నెల నుంచే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందన్నారు.

టాలీవుడ్ రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు నటించిన సూపర్ హిట్ మూవీ ‘భక్త కన్నప్ప’. కృష్ణం రాజు కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో కృష్ణం రాజు సినీ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఈ మూవీ తర్వాత ఇండస్ట్రీలో ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. కృష్ణం రాజు నటించిన ఈ సినిమా రీమేక్ గురించి టాలీవుడ్ లో చాలా సార్లు చర్చ జరిగింది. అయితే, మంచు ఫ్యామిలీ ఈ సినిమా రీమేక్ విషయంలో కీలక ముందడుగు వేసింది.  గతంలో  ఈ సినిమా రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించినా, ఆ తర్వాత ఎలాంటి కదలిక లేదు. రీసెంట్ గా మంచు విష్ణు ఈ సినిమా రీమేక్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు. 

సెప్టెంబర్ నుంచి ‘భక్త కన్నప్ప’ షూటింగ్- మంచు విష్ణు

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు ‘భక్త కన్నప్ప’ రీమేక్ పనుల్లో పురోగతి గురించి మాట్లాడారు.  “ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. నా మార్కెట్ కంటే చాలా ఎక్కువ బడ్జెట్ అనేది నేనూ ఒప్పుకుంటాను. రిస్క్ తీసుకుంటున్నాను కూడా. ఈ సినిమాను మేమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎవరితో టైయ్యప్ అవుతున్నాం అనేది త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం.  ఇప్పుడు నేను అఫీషయల్ గా చెప్తున్నాను ‘భక్తకన్నప్ప’ను రీమేక్ చేస్తున్నాం. ఈ సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుంది. గత 8 నెలలుగా ఈ సినిమా పైనే ఫోకస్ పెట్టాను. చాలా భాషల్లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు కీలక నటీనటులు భాగం కాబోబుతున్నారు. ఈ మూవీలో నటీనటులు అందరినీ సర్ ప్రైజ్ చేస్తారు” అని చెప్పుకొచ్చారు.  

రూ. 150 కోట్లతో ‘భక్త కన్నప్ప’ రీమేక్

కొద్ది నెలల క్రితం ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు మంచు ఫ్యామిలీ ప్రకటించింది. ఈ సినిమాను హాలీవుడ్ లెవల్లో రూపొందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఏకంగా రూ. 150 కోట్లు బడ్జెట్ వెచ్చించనున్నట్లు చెప్పారు. అప్పట్లో ఈ అనౌన్స్ మెంట్ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. కానీ, ఇప్పుడు మంచు విష్ణు ఈ సినిమా గురించి కీలక విషయాలు వెల్లడించడంతో ఇండస్ట్రీలో మళ్లీ ఈ మూవీపై చర్చ జరుగుతోంది. వాస్తవానికి కృష్ణం రాజుతో మంచు మోహన్ బాబుకు మంచి అనుబంధం ఉండేది. ఈ కారణంగానే ఆయన సినిమాను రీమేక్ చేయనున్నట్లు మోహన్ బాబు ప్రకటించారు.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.   

Read Also: 2024లో ఏపీ సీఎం ఆయనే - పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget