అన్వేషించండి

Devi Prasad: ఆయన జుగుప్సాకర లీలలు, విన్యాసాలు మాకు బాగా తెలుసు - తోటపల్లి మధు వ్యాఖ్యలపై దేవీ ప్రసాద్ కౌంటర్

Devi Prasad: టాలీవుడ్‌ రచయిత, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ తోటపల్లి మధు తాజా ఇంటర్వ్యూలో సీనియర్ ఆర్టిస్టులపై కామెంట్స్ చేశారు. వాటిపై యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన దేవీ ప్రసాద్‌ స్పందించారు.

Devi Prasad Counter To Thotapalli Madhu Comments: సినీ సెలబ్రిటీలు ఏం మాట్లాడుతున్నారు అనేదానిపై ప్రేక్షకుల ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది. పొరపాటున ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు చూశారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి తోటపల్లి మధు చేరారు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించిన తొటపల్లి మధు... సావిత్రి, శ్రీదేవి, జయలలిత, శోభన్ బాబు, ఎమ్‌జీఆర్, జంధ్యాల, కోడి రామకృష్ణ వంటి ప్రముఖ సెలబ్రిటీలపై తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయనకు రైటర్ కమ్ డైరెక్టర్ దేవీ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

తోటపల్లికి దేవి ప్రసాద్ కౌంటర్

ఇండస్ట్రీలో ప్రముఖులు, కొందరు సీనియర్ ఆర్టిస్టులపై తోటపల్లి మధు చేసిన వ్యాఖ్యలు దేవీ ప్రసాద్‌కు అస్సలు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో దీనిపై వ్యంగ్యంగా స్పందించారు. ‘ఎంత గొప్ప సినిమా అయినా కాగితంపైన రాసే అక్షరంతోనే ప్రారంభం అవుతుంది. అందుకే రచయితది ఎప్పటికీ అగ్రస్థానమే అని నమ్ముతాను. నా వరకూ నేను రచయిత స్థాయి.. వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ గౌరవిస్తాను. అందరూ గౌరవించాలని కోరుకుంటాను’ అంటూ తోటపల్లి మధు ఫోటోను షేర్ చేశారు. ఆయన గురించి, ఆయన చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు దేవీ ప్రసాద్. ‘తోటపల్లి మధు గారి వంటివారు మాత్రం కొంత ప్రత్యేకం. వీరికి కొన్ని ప్రత్యేక ప్రతిభలున్నాయి’ అని చెప్పుకొచ్చారు.

కెమెరా ఆన్ చేస్తే చాలు..

‘సీనియర్ రచయిత తోటపల్లి మధుగారు మీడియా మైక్ పెట్టి కెమెరా ఆన్ చేస్తే చాలు... పరిశ్రమలో ఎంత సాధించిన వారినైనా వాడు వీడు అని సంబోధించగలరు. జంధ్యాల గారు, సావిత్రి గారు, శ్రీదేవి గారి లాంటివారు అసలెందుకు మందుకు బానిస అయ్యారో, రోజుకి ఎన్నిసార్లు తాగేవారో కూడా కళ్ళారా చూసినట్టు చెప్పగలరు. అసలు శ్రీదేవిగారు చనిపోయేముందు ఏమేమి ఎలా జరిగిందో అప్పుడు ఆ ప్రదేశంలో ఆయన అక్కడ ఉన్నట్టే వివరించగలరు. ఎం.జి.ఆర్ గారు స్విస్ బ్యాంక్‌లో దాచిన 3000 వేల కోట్ల సొమ్ము వివరాల చీటీని ఆయన తన తలపైన టోపీలో దాచుకుంటే జయలలిత గారు దాన్ని తీసి శోభన్‌ బాబు గారికి ఇస్తే ఆయన భూములుకొని ఎలా లాభపడ్డారో ప్రత్యక్ష సాక్షిలా చెప్పగలరు’ అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు దేవి ప్రసాద్.

అపహాస్యం..

‘అద్భుతమైన నటనను కూడా ప్రదర్శించే వీరి దృష్టిలో జస్ట్ వందల సినిమాలలో మాత్రమే నటించి నంది అవార్డులు కూడా పొందిన సీనియర్ నటులు మురళీ మోహన్ గారు అసలు ఆర్టిస్టే కాదని బల్లలు బద్దలు కొట్టగలరు. మరణించిన మిక్కిలినేని గారి వంటి నటులను అపహాస్యం చేయటమే కాక వీరికి అవకాశాలిచ్చి ఉపాధి కల్పించిన కోదండరామిరెడ్డి గారి లాంటి వారి ప్రతిభకూ వ్యంగ్యంగా మరకలద్దగలరు. పాపం అస్సలు మందు వాసనంటే తెలియని వీరు... ఇప్పుడు ఇండస్ట్రీలో మందుని దాటి అందరూ డ్రగ్స్ విరివిగా వాడుతున్నారనీ, అవి కూడా డాక్టర్లే ఇస్తారనీ చూసినట్లే చెప్పి అన్నం పెడుతున్న ఇండస్ట్రీనే ఎంతవరకైనా దిగజార్చగలరు’ అని సీరియస్ అయ్యారు దేవీ ప్రసాద్.

జుగుప్సాకర విన్యాసాలు..

‘వారికి అవకాశాలిచ్చి ప్రోత్సహించిన మా గురువుగారు ఈ లోకంలో లేని కోడి రామకృష్ణ గారి మీద అబద్ధాల అవాకులు చెవాకులు పేలగలరు. కానీ వారికి తెలియనిదొక్కటే... మా గురువుగారు లేకపోయినా ఆయన శిష్యులం మేమింకా ఇక్కడే వున్నాం. తోటపల్లి మధు గారిలో పశ్చాత్తాపం రాకుంటే వారికున్నంత కుసంస్కార ప్రతిభ మాకు లేకున్నా వారి అసహ్యకర జుగుప్సాకర లీలలు విన్యాసాలు అప్పటివి ఇప్పటివి మాకు పరిపూర్ణంగా తెలుసు గనుక వాటిని విశాదపరచి మేమూ మన్ననలందుకోక తప్పేట్టులేదు’ అంటూ కోడి రామకృష్ణపై తోటపల్లి మధు చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు దేవీ ప్రసాద్. చివర్లో ‘వారి అబద్ధపు ఘోష మధ్యలో పట్టరాని నవ్వులతో అలరించిన యాంకర్ స్వప్న గారి సంస్కారం కూడా తక్కువేమీ కాదు’ అంటూ యాంకర్‌పై కూడా కౌంటర్ వేశారు.

Also Read: ‘గం గం గణేశా’ రిలీజ్ డేట్ ఫిక్స్ - అఫీషియల్‌గా ప్రకటించిన ఆనంద్ దేవరకొండ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget