Actor Suresh Gopi Daughter Wedding: గుడిలో సింపుల్‌గా ప్రముఖ నటుడు సురేష్ గోపి కూతురు పెళ్లి.. హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
Actor Suresh Gopi Daughter Marriage: ప్రముఖ యలయాళ నటుడు, రాజకీయ నాయకుడు సురేష్ గోపి పెళ్లి బాజాలు మోగాయి.ఆయన కూతురు భాగ్య సురేష్ పెళ్లి గుడిలో సింపుల్ గా జరిపించారు.
Actor Suresh Gopi Daughter Marriage: ప్రముఖ యలయాళ నటుడు, రాజకీయ నాయకుడు సురేష్ గోపి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ నటుడిగా గుర్తింపు పొందారు. అంతేకాదు పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం ఆయన సుపరిచితమే. ఇక ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న ఆయన గతంలో మీడియా ఇంట్రాక్షన్‌లో మహిళా జర్నలిస్టుతో అసభ్యకంగా ప్రవర్తించి కోర్టు కేసును ఎదుర్కొన్నారు. అలా వివాదంలో నిలిచిన సురేష్ గోపికి ఇటీవల ఊరట లభించింది. ఇదిలా ఉంటే తాజాగా సురేష్ గోపి ఇంట పెళ్లి బాజాలు మోగాయి.
ఆయన కూతురు భాగ్య సురేష్.. శ్రేయాస్ మోహన్‌తో ఏడడుగులు వేసింది.. స్టార్ నటుడు, రాజకీయ నాయకుడైన సురేష్ గోపి.. తన కూతరి పెళ్లిని చాలా సింపుల్‌గా గుడిలో జరిపించడం విశేషం. ఈ రోజు బుధవారం (జనవరి 17) ఉదయం కేరళలోని గురువాయూర్ ఆలయంలో చాలా సింపుల్‌గా కూతురికి వివాహం జరిపించారు. కేవలం ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకుకు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వధువురులను ఆశీర్వాదించారు.
#Malayalam superstars arriving for #SureshGopi daughter wedding in #GuruvayoorAmbalaNadayil, in the presence of #PM @narendramodi ji! pic.twitter.com/BErxC23saa
— Sreedhar Pillai (@sri50) January 17, 2024
మోదీ చేతుల మీదుగా పూలదండలు మార్చుకున్న కొత్త జంట
బీజేపీ నాయకుడైన సురేష్ గోపి కూతురి పెళ్లి ప్రదాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మోదీ సమక్షంలో నూతన వధువరులతో పూలదండలు మార్చుకునే కార్యక్రమాన్ని జరిపించారు. ఆ తర్వాత వధువరులు మోదీ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మరో ౩౦ జంటలను కూడా ఆశీర్వదించారు. భాగ్య-శ్రేయాస్ పెళ్లితో అదే ఆలయంలో పెళ్లి చేసుకున్న మరో ముప్పై జంటలను కూడా మోదీ దీవించారు.
Prime Minister @narendramodi visited #GuruvayurTemple and after praying he also blessed newly wedded couples and also met Malayalam actors who were there for Suresh Gopi’s daughter’s wedding!
— Sreedhar Pillai (@sri50) January 17, 2024
Video: @ANI
pic.twitter.com/fDpTXmujMz
సూపర్ స్టార్స్ సందడి
సురేష్ గోపి కూతురి పెళ్లికి మలయాళ స్టార్స్ పాల్గొని సందడి చేశారు. సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్‌తో పాటు నటులు జయరాం, దిలీప్, ఖుష్బూ సుందర్ వంటి తదితర నటీనటులు పాల్గొని నూతన వధువరులను ఆశ్వీర్వాదించారు. అలాగే పలువురు రాజకీయ ప్రముఖుల కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. ప్రస్తుతం గోపి సురేష్ కూతురి వివాహ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి ప్రధాని మోదీ పాల్గొనడం మరింత ప్రాధాన్యతను సంతరించుకంది. ఇక స్టార్స్ ఈ వివాహ వేడుకకు హజరవుతున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
View this post on Instagram