అన్వేషించండి

Sabdham Teaser: మాటల్లేవ్, కానీ ఆ సౌండ్‌కు వణికిపోతారు - భయపెడుతోన్న ‘శబ్దం’, ఆది కొత్త మూవీ టీజర్ చూశారా?

ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘శబ్దం’. ఈ హారర్, థ్రిల్లర్ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలయ్యింది. మాటల్లేకుండా కేవలం మ్యూజిక్ తోనే వణుకు పుట్టిస్తోంది.

Sabdham Movie Teaser: హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌ కాంబోలో రూపొందుతున్న తాజా చిత్రం 'శబ్దం'.  ఇప్పటికే వీరిద్దరి కలిసి కాంబోలో వచ్చిన ‘వైశాలి’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. చాలా కాలం తర్వారా మళ్లీ వీరిద్దరు  అదే జానర్ లో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘వైశాలి’ సినిమాను మించి హిట్ కొట్టడమే టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని 7జీ ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.   

మాటలు లేకుండానే భయపెడుతున్న ‘శబ్దం’ టీజర్

‘శబ్దం’ సినిమా టీజర్ ను విక్టరీ వెంకటేష్  విడుదల చేశారు. ఈ సినిమా ఆత్మల కారణంగా ఎదురయ్యే సంఘటన చుట్టూ తిరుగుతున్నట్లు అర్థం అవుతోంది. ఆత్మల మీద రీసెర్చ్ చేసే పాత్రలో ఆది కనిపిస్తున్నారు. ఆది హాంటెడ్ హౌస్ దగ్గర చిత్ర విచిత్రమైన సంఘటనలు జరిగేటప్పుడు కొన్ని సౌండ్స్ ను రికార్డు చేస్తాడు. అసలు విషయం ఏంటనేది ఎక్కడా రివీల్ కాకుండా టీజర్ ను వదిలారు మేకర్స్. ఈ సినిమాలో నటిస్తున్న కీలక నటులు అందరినీ పరిచయం చేశారు. గతంలో ఎప్పుడూ కనిపించని రీతిలో ఆది కనిపిస్తున్నాడు. మొత్తంగా దర్శకుడు అరివళగన్ ఈసారి ఆత్మలను లీడ్ చేసుకుని సరికొత్తగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇక అరుణ్ పద్మనాభన్ సినిమాటోగ్రఫీ మరో లెవల్ అని చెప్పుకోవచ్చు. ఆయన ప్రతి ఫ్రేమ్ లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మాయ చేశారు. హారర్ థ్రిలర్ సినిమాకు తన సంగీతంతో మరింత భయాన్ని యాడ్ చేశారు. టీజర్‌లో‍ థమన్‌ అందించిన స్పెషల్ సౌండ్‌ ఎఫెక్ట్స్‌ అదుర్స్ అని చెప్పుకోవచ్చు.

‘వైశాలి’ని మించి సక్సెస్ అందుకునేనా?

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముంబై, మున్నార్‌, చెన్నై సహా పలు ప్రాంతాల్లో జరిగింది. అంతేకాదు, ఈ సినిమాలోని ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ కోసం ఏకంగా 2 కోట్ల రూపయాలతో 120 ఏళ్ల నాటి పురాతన లైబ్రరీ సెట్‌ను వేసినట్లు చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ లో దాన్ని హైలెట్ చేస్తూ చూపించారు. 2009లో వచ్చిన ‘వైశాలి’ తమిళంతో పాటు తెలుగలోనూ మంచి వసూళ్లను సాధించింది. అప్పట్లో సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇన్నాళ్లకు మళ్లీ ఇద్దరి కాంబోలో ‘శబ్దం’ రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తప్పకుండా ఈ సినిమా కూడా చక్కటి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించనున్నారు.  ఈ చిత్రంలో ఆది పినిశెట్టితో పాటు లక్ష్మీ మీనన్‌, సిమ్రాన్‌, లైలా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read Also: సెక్యులరిజమా? పబ్లిసిటీ స్టంటా?- విశాల్ వీడియోపై నటి కస్తూరి తీవ్ర విమర్శలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Embed widget