'7/G బృందావన కాలనీ' రీరిలీజ్ ట్రైలర్ - మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
శ్రీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ '7/G బృందావన కాలనీ'. ఈ చిత్రాన్ని వచ్చే వారం థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 4K ట్రైలర్ ను ఆవిష్కరించారు.
తెలుగు తమిళ భాషల్లో కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోయిన చిత్రం '7/G బృందావన కాలనీ'. ఇందులో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. సెల్వరాఘన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ మూవీ 2004లో రిలీజ్ అయింది. యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకొని, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం దాదాపు 19 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ ఇప్పుడు థియేటర్లలోకి వస్తోంది. వచ్చే వారం ఈ సినిమా 4K వెర్షన్ ను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ట్రైలర్ ను లాంచ్ చేసారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా విభిన్నమైన ప్రేమ కథగా '7/G బృందావన కాలనీ' చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సెల్వరాఘన్. బాధ్యతలు లేకుండా అల్లరి చిల్లరిగా, జులాయిగా తిరిగే ఓ యువకుడు.. ఓ అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత ఎలా మారాడు? అనేది ఈ సినిమాలో చూపించారు. ఓ మధ్య తరగతి తండ్రి తన కొడుకు గురించి ఎలా ఆలోచిస్తాడు? తప్పు చేసినప్పుడు ఎంత దండిస్తాడో, ప్రయోజకుడు అయినప్పుడు అంతే సంతోషిస్తాడనే విషయాన్ని ఎమోషనల్ గా చూపారు. హీరోహీరోయిన్ల మధ్య సంఘర్షణను అద్భతంగా తెర మీద ఆవిష్కరించారు.
'ఈ వయసులో సిగరెట్లు, బీర్లు, పోలీసులు..' అంటూ రవికృష్ణను చంద్రమోహన్ తిట్టే సన్నివేశంతో ఇప్పుడు ఈ '7/G బృందావన కాలనీ' రీరిలీజ్ ట్రైలర్ ప్రారంభమైంది. యూత్ ని ఆకట్టుకునే అంశాలు, సినిమాలో హైలైట్ గా నిలిచిన సీన్స్ తో ఫ్రెష్ ఫిలింగ్ ను కలిగించేలా చాలా ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ ను కట్ చేసారు. మనసుకు హత్తుకునే పాటలను గుర్తు చేయడమే కాదు, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో కంటతడి పెట్టించారు. 4K క్వాలిటీతో డాల్బీ ఆటమ్స్ సౌండ్ తో అప్పటి మ్యాజిక్ ను రిపీట్ చేయబోతున్నామని ఈ వీడియోతో హింట్ ఇచ్చారు.
Also Read: 'డెవిల్' డైరెక్టర్ ను తప్పించారా? తప్పుకున్నాడా?
అప్పట్లో ఈ సినిమాని థియేటర్లలో చూడని ప్రేక్షకులు, మరొక్కసారి థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయాలనుకునే సినీ ప్రియుల కోసం '7/G బృందావన కాలనీ' చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 22న తెలుగు రాష్ట్రాలతో పాటుగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో రీరిలీజుల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. పలు చిత్రాలు కొత్త సినిమాల రేంజ్ లో వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడు ఈ కల్ట్ క్లాసిక్ మూవీ కూడా మరోసారి ఆడియన్స్ ను అలరిస్తుందని భావిస్తున్నారు.
ఏఎం రత్నం సమర్పణలో శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని రూపొందించారు. తమిళ్ లో '7/G రెయిన్‍బో కాలనీ' పేరుతో, తెలుగులో ‘7/జీ బృందావన కాలనీ’ పేరుతో వచ్చింది. ఇందులో రవికృష్ణ, సోనియా అగర్వాల్ లతో పాటుగా చంద్రమోహన్, సుధ, సుమన్ శెట్టి, మనోరమ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. లిటిల్ మ్యాస్ట్రో యువన్ శంకర్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం సమకూర్చారు. 'కన్నుల భాషలు', 'తలచి తలచి', 'కలలు కనే కాలాలు', 'మేం వయసుకు వచ్చాం' పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి. వాటిల్లో కొన్ని గీతాలకు ఏఎం రత్నం లిరిక్స్ రాయడం విశేషం. అరవింద్ కృష్ణ ఈ చిత్రానికి సినిమాట్రోగ్రఫీ నిర్వహించగా, కోలా భాస్కర్ ఎడిటింగ్ వర్క్ చేసారు.
Also Read: సీనియర్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న న్యూ ఏజ్ డైరెక్టర్స్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial